జాతీయ వార్తలు

అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆలోచిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన సభల సీట్లను పెంచేందుకు న్యాయ శాఖతో చర్చిస్తామని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గురువారం మధ్యాహ్నం వెంకయ్యనాయుడుతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, అంశాల గురించి చర్చించారు. వెంకయ్యనాయుడు సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఒక వాక్యాన్ని పొందుపరచకపోవటం వల్ల రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లను పెంచటం కష్టమవుతోందన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర న్యాయ శాఖతో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ శాసన సభ సీట్లపెంపు, ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి నిధులు, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటం గురించి తాను వెంకయ్యనాయుడుతో చర్చించినట్లు చంద్రశేఖరరావు వివరించారు. భద్రాచలం డివిజన్‌లోని కొన్ని తెలంగాణ గ్రామాలకు రహదారి లేదన్న విషయాన్ని కెసిఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కేంద్రానికి లేఖ రాయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పట్టణ ప్రాంతాలకు చెందిన పేదల కోసం ఇళ్లు కేటాయించినందుకు వెంకయ్యనాయుడుకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణానికి ఒక్కొక్క ఇంటికి ఒక లక్ష నుండి రెండు లక్షల 33 వేల రూపాయల వరకు ఇచ్చేందుకు వీలుందని కేంద్ర మంత్రి అన్నారు. అటల్ మిషన్ కింద మొదట తెలంగాణలోని 11 నగరాలను మాత్రమే చేర్చినా ఆ తరువాత సిద్దిపేటను కూడా చేర్చినట్లు వెంకయ్య వివరించారు. పట్టణాభివృద్ధిశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.