రాష్ట్రీయం

సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాప్రతినిధులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హితవు
నరసరావుపేట, డిసెంబర్ 12: రాజకీయాల్లో శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగానే ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన నరసరావుపేట మున్సిపల్ శతాబ్ది వేడుకల రెండోరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షత వహించారు. శత్రుభావనను రాజకీయ నాయకులు తమ జీవితాల నుండి తొలిగించుకోవాలని హితోపదేశం చేశారు. దేశంలో అవకాశవాదం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మంచి సిద్ధాంతంతోకూడిన నిబద్ధత కావాలన్నారు. రాజకీయ నాయకులకు క్యారెక్టర్, కాలిబర్, కాండక్ట్, కెపాసిటీ అవసరమన్నారు. పార్లమెంట్‌లోగానీ శాసనసభలో కానీ చర్చలు పరిణితితోజరగాలని, అలా జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రస్తుతం ఆ పరిస్థితి పార్లమెంట్‌లో లేదన్నారు. మున్సిపల్ సమావేశాల్లో కూడా మంచి చర్చలు జరగాలని, ప్రస్తుతం రణరంగ భేరీలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పసలేని వాళ్లే వెల్‌లోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కులం, మతం, ధనం ప్రభావం ఎక్కువగా ఉందని, దానిని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆర్థిక, ప్రాంతీయ, సామాజిక అసమానతలు తొలిగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జన్‌ధన్ యోజన పథకం కింద ఐదు నెలల్లో 18కోట్ల మంది ప్రజలు బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, కోడెల శివరామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు, నలబోతు వెంకట్రావు, పోట్రు పూర్ణచంద్రరావు, నాగసరపు సుబ్బరాయగుప్తా, మీరావలి, రైల్వే డిఆర్‌ఎం విజయ్‌శర్మ, సీఈ హౌసింగ్ మల్లికార్జునరావు, రాయపాటి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రైల్వే అండర్ బ్రిడ్జి, భూగర్భ డ్రైనేజి-2 పనులు, గృహనిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.