రాష్ట్రీయం

ఓటమిని తట్టుకోలేకే ఆక్రోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనియా, రాహుల్‌పై వెంకయ్య మండిపాటు
స్వామి కేసు పెట్టింది 2012లో అప్పుడు మా ప్రభుత్వం లేదు
పెండింగ్ బిల్లులు పట్టని కాంగ్రెస్ ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి
విజయవాడ, డిసెంబర్ 19: గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తోందని, ముందుగా ప్రజాతీర్పు పట్ల సహనం చూపించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసును పక్కదోవ పట్టించటానికి సోనియా, రాహుల్ గాంధీ బిజెపిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలు వ్యవహారం కేసులో అడ్డగోలుగా ఇరుక్కుని కోర్టుకు హాజరుకావాలనే కోర్టు ఆదేశంతో దిక్కుతోచని తల్లీకొడుకులు రాజ్యసభను స్తంభింపచేసి న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నేరాభియోగాలు ఎదుర్కొంటున్నది వీరైతే, శిక్ష అనుభవించాల్సింది దేశప్రజానీకమా అని ఆయన నిలదీశారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఈనాటిది కాదని, 2012లో సుబ్రమణ్యస్వామి కోర్టులో ఫైల్ చేశారని, అప్పుడు ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదన్నారు. స్వామి లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు దమ్ముంటే కోర్టులో తేల్చుకోమని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారని వెంకయ్య గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కొమ్ముకాయటం దురదృష్టకరమన్నారు. ఆ పార్టీ ప్రభుత్వ ఉన్నతాధికారి 13 కేసుల్లో ఇరుక్కోగా సిబిఐ దర్యాప్తు చేస్తుంటే దీనికి ప్రధాని మోదీ కారణమని ఆరోపిస్తూ ఆయనపై బురద జల్లటానికి ప్రయత్నించటం ఏరకమైన నీతో చెప్పాలని ప్రశ్నించారు. జిఎస్‌టి, రియల్ ఎస్టేట్, ఇన్‌లాండ్ వాటర్ బిల్లు వంటి ముఖ్యమైన 16 బిల్లులు పెండింగ్‌లో వుండగా కావాలని దురుద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వాటిని అడ్డుకుంటోందన్నారు. విలేఖరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి హరిబాబు, మరో ఎంపి గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.