మెయిన్ ఫీచర్

ఫెంటాస్టిక్ ఫోర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు-
సంక్రాంతి రోజున ఆడియన్స్‌ని ఆనందం పంచేందుకు ఏడాదంతా కష్టపడిన సినిమాలొచ్చేవి. అలా ముగ్గురు నలుగురు హీరోలకు సంబంధించిన మూడు నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేసేవి. పెద్ద సినిమాలన్నీ కట్టగట్టుకుని థియేటర్లకు ఒకేసారి వచ్చినా ‘నష్టపోయాం’ అన్న మాట వినిపించేది కాదు. కారణం -అప్పట్లో సినిమాకు లాంగ్న్ ఉండేది కనుక. అలాగే, సినిమాలోని సరుకుకు తగిన లాభం అంతోఇంతో మిగిలేది కనుక. కానీ -కొనే్నళ్లుగా సినిమా పరిస్థితి వేరు. సాధించిన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా నిర్మాణం సులువయ్యేకొద్దీ -నిర్మాణ విలువ పెరిగిపోతోంది. బడ్జెట్లు అంచనాలను మించుతున్నాయి. పెట్టుబడి తిరిగి రాబట్టుకునేందుకు పట్టుమని పాతికరోజులు థియేటర్లో సినిమాను నిలబెట్టే పరిస్థితీ ఇప్పుడు లేదు. వీకెండ్‌లోని ఓపెనింగ్ వసూళ్లపైనే సినిమా భవిష్యత్, నిర్మాత బతుకు ఆధారపడి ఉంటుంది. విడుదలైన రెండు మూడురోజుల్లో మాగ్జిమం వసూళ్లు రాబట్టాలంటే -మాగ్జిమం థియేటర్లలో సినిమా విడుదల కావాలి. ఈ పరిస్థితుల్లోనే 500 నుంచి 1000 థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ వెసులుబాటుకు ఇబ్బందిలేకుండా -కొంతకాలంగా పెద్ద సినిమాల నిర్మాతలు పోటీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఫ్యాన్స్ వొత్తిళ్లతోనో, హీరోల ప్రమేయంతోనో కదనరంగంలోకి దూకుడుగా దిగితే -పళ్లురాలేది మనకేనన్న విషయం అర్థమైన తరువాత ఆచితూచి అడుగేస్తున్నారు. సంయమనంతో, సమన్వయంతో -ఒకరి సినిమా మరొకరికి పోటీకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. గత ఏడాది మొత్తంమీద -పెద్ద సినిమాలేవీ ఒకేరోజు విడుదలైన సందర్భం లేదు. అంతెందుకు -2015 సంక్రాంతికి పవన్‌కల్యాణ్ గోపాల గోపాల తప్ప -మరే సినిమా దరిదాపుల్లో విడుదల కాలేదు. కానీ, ఈసారి పరిస్థితి వేరు. కొనే్నళ్లుగా కనిపించని పాత సంస్కృతి -ప్రాణం పోసుకుంది. సంక్రాంతి సందడి చూపించే తాపత్రయంతో నాలుగు పెద్ద సినిమాలు సంక్రాంతి విడుదలకు సిద్ధమయ్యాయి.
హేమాహేమీల ప్రొడక్షన్ కంపెనీలో తయారైన నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఒకేసారి వస్తుండటంతో -ఎవరికి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయన్న ఆసక్తి కనిపిస్తోంది. సంక్రాంతికి ఏ హీరో ఎక్కువ థియేటర్లలో కనిపిస్తాడన్న ఉత్కంఠ అటు ఫ్యాన్స్‌లోనూ కనిపిస్తోంది. అంటే -ఈ సంక్రాంతికి తెరపై సత్తా చూపేందుకు హీరోలు, ఎక్కువ తెరలు సంపాదించేందుకు నిర్మాతలు పోటీపడబోతున్నారన్న మాట.
****
నందమూరి బాలకృష్ణ సెంచురీ సినిమా ఎలా ఉండబోతుందో రుచిచూపించబోయే 99వ సినిమా -డిక్టేటర్. వయసుమీరినా సమర్థవంతమైన పాత్రలతో నందమూరి ఫ్యాన్స్‌ను అలరిస్తున్న బాలకృష్ణ -ఇందులోనూ వైవిధ్యమైన గెటప్, పాత్రలతో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏరోస్ తొలిసారి తెలుగులో నిర్మిస్తోన్న చిత్రం కూడా. బాలకృష్ణ మొత్తం సినిమాల్లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే. దర్శకుడు శ్రీవాస్ పనితనం నచ్చిందంటూ ఇప్పటికే బాలకృష్ణ -డిక్టేటర్‌పై ఆసక్తిని పెంచేశాడు. ఒకప్పటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి విలనిజం, తమన్ సంగీతం, అంజలి అందం, శ్రీవాస్ పనితనం, కోన వెంకట్-గోపీమోహన్ కథాబలాన్ని -బలగాలు చేసుకున్న డిక్టేటర్ ఏస్థాయిలో హీరోయిజాన్ని చూపుతాడన్నదే ఆసక్తికర అంశం. సంక్రాంతికి ఒకరోజు ముందొస్తున్న డిక్టేటర్ -ఎంతమేర సక్సెస్‌ను డిక్టేట్ చేయబోతున్నాడోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
ఇక -బాబాయ్‌కి పోటీగా అబ్బాయ్ కూడా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో 25వ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఎన్టీఆర్ స్టైలిష్ మేకోవర్, టైటిల్లోనే కనిపిస్తున్న సెంటిమెంట్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, జూనియర్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న ప్రాజెక్టు ఇది. హీరో పాట పాడితే, త్వరలో హీరో కాబోతోన్న మ్యూజిక్ డైరెక్టర్ పాట రాయడం ప్రాజెక్టుకు ఒక స్పెషల్. అంతేకాదు, దర్శకుడికి తన తండ్రితోవున్న అనుబంధాన్ని కథగా మలుచుకుని తీస్తున్న సినిమా కావడం మరో స్పెషల్. షూటింగ్ పార్ట్ ఎక్కువ భాగం స్పెయిన్‌లో జరుపుకుంటే, తొలిసారి రకుల్ ప్రీత్‌సింగ్ ఎన్టీఆర్‌తో జోడీ కడుతోంది. ఈ సినిమాలో రకుల్ తన వాయిస్ (డబ్బింగ్) వినిపించబోతోంది కూడా. ఈ అంశాలే -జూనియర్ ఫ్యాన్స్‌లో అంచనాల పల్స్ పెంచేస్తోంది. బాబాయ్‌కంటే ఒకరోజు ముందే -్థయేటర్లకు వచ్చేస్తున్న జూనియర్ ఎన్టీర్ సంక్రాంతికి ఎలాంటి స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడో చూడాలి.
ఇక -మనంతో మెప్పించాడు నాగార్జున. తెలుగు సినిమాకు రెండు కళ్లలో ఒకరైన తండ్రి అక్కినేనితో నటించాడు. అదే ఏఎన్నార్ చివరి సినిమా. విజయవంతమైన మనం తరువాత గ్యాప్ తీసుకుని -నాగార్జున చేస్తున్న సినిమా సోగ్గాడే చిన్నినాయినా. మనంలో తండ్రితో నటిస్తే.. ఈ సినిమాలో తండ్రి ఆత్మను ఆవహించిన పాత్రలో కనిపించబోతున్నాడన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏఎన్నార్ ‘ఆత్మ’నే కాదు, ఆహార్యాన్ని రుచిచూపించేలా ఏఎన్నార్ పంచెలు, చేతివాచీని నాగార్జున ధరించడం ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. వైవిధ్యమైన కథతో వస్తున్న ప్రాజెక్టుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. దర్శకుడిగా ఫస్ట్ చాన్స్‌తోనే -సీనియర్ హీరో నాగార్జునను ఇద్దరిగా (బంగార్రాజు, రాము) చూపిస్తుండటం అక్కినేని ఫ్యాన్స్‌కు చెప్పలేనంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ‘ఆత్మ’కథలో వినోదాత్మకత మేళవించి కుటుంబ కథా చిత్రంగా కల్యాణ్ కృష్ణ తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఒకప్పటి హిట్‌పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మళ్లీ జంటగా కనిపిస్తున్న చిత్రం కూడా ఇది. సరిగ్గా సంక్రాంతి రోజున థియేటర్లలో కనిపించబోతున్నాడు -సోగ్గాడె చిన్నినాయిన.
పైమూడు సినిమాలతో పోలిస్తే -చిన్న సినిమాయే అయినా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా.
గత ఏడాది రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శర్వానంద్, సురభితో సంక్రాంతి ఎంటర్‌టైన్‌మెంట్ అందివ్వబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మేర్లపాక గాంధీ దీనికి దర్శకుడు. లోకల్ ఫ్లేవర్డ్ లవ్ స్టోరీ కనుక -ఎక్కువ భాగాన్ని విశాఖ నేపథ్యంలో చిత్రీకరించారు. పెద్ద హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగుతున్న శర్వానంద్‌కు -సక్సెస్ పడితే రేంజ్ పెంచేసే సినిమానే అవుతుంది. యూత్‌కు కనెక్టయిన శర్వానంద్ -ఎక్స్‌ప్రెస్ రాజాతో హీరోగా మరో మైలురాయి దాటుతాడో లేదో భోగి రోజన చూద్దాం. మరో వారం దూరంలోవున్న సంక్రాంతికి -నాలుగు సినిమాలతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంటే.

-మహాదేవ