Others

వస్తున్నాయ్.. పోతున్నాయ్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమా ఇంకా బలంగా వేళ్లూనుకోలేకపోతోంది. చెప్పుకోవడానికి -క్షణంలాంటి నాలుగైదు సినిమాలు తప్ప, గత ఆర్నెల్లలో విడుదలైన చిన్న సినిమా ఏదీ తలెత్తుకుని నిలబడగలిగేదిలా లేదు. అష్టకష్టాలు పడి థియేటర్ వరకూ తీసుకొస్తున్నా, రెండో రోజే ప్రేక్షకులు తిప్పికొడుతుండటంతో -తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రాలు ఏమాత్రం బలం చూపించలేకపోయాయి.

తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చిత్రాలు మనకు ఉన్నాయి. ఇటువంటి చిత్రాలు తీసినందుకు గత కాలం మేలు అనుకుంటూ, అప్పటి చిత్రాలను చూసి గర్విస్తున్నాం. ఇప్పుడు ఆ చరిత్రంతా వెలవెలబోతోంది. అంత గొప్ప చిత్రాలను అందించిన తెలుగు పరిశ్రమ ఎటువంటి మెరుపులు లేని అధ్వాన్నమైన చిత్రాలు రూపొందిస్తోంది. ఇందులో అగ్ర హీరోల చిత్రాలను పక్కనబెడితే, చిన్న చిన్న చిత్రాలంటూ హంగామా చేసే వాటిలో ఎటువంటి సత్తా కనిపించడంలేదు. అసలు చిన్న సినిమా అంటేనే భారీ బడ్జెట్ చిత్రానికి పోటీగా సమాంతరంగా సాగి ప్రేక్షకులను అలరించేవి. ఈ విషయాన్ని నేటి చిన్న సినిమా దర్శక నిర్మాతలు మరిచిపోయారు. ఏదో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, రెండు కామెడీ ట్రాక్‌లు పెట్టి సినిమా చుట్టేయడానికే అలవాటుపడిపోయారు. అసలు సినిమా తీయడం అనేది ఓ కుటీర పరిశ్రమలా మారిపోయింది. ప్రస్తుతం అక్కడక్కడా కొంతమంది యువ ఔత్సాహిక దర్శకులు కొత్త సాంకేతిక నిపుణులైనా సరే, వారిని తీసుకుని ఏదోవిధంగా చిత్రం అన్నట్టుగా చిత్రీకరించి వదిలేస్తున్నారు. ఈ చిత్రాలలో ఎటువంటి డెప్త్ లేక కథ సరిగా వుండక, కథనాలు పేలవంగా సాగుతూ ఎటువంటి భావాలు పలకని నటీనటులతో రూపొందిస్తున్నవే. ఇటువంటి చిత్రాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో, ఎక్కడ ఆడుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు. శాటిలైట్ వ్యాపారం వుందా అంటే, అది కూడా కుదేలైపోయింది. ఈ సంవత్సరం జూన్ అంతానికల్లా ఇటువంటి చిత్రాలు దాదాపుగా 70పైన విడుదలయ్యాయి. ఈ చిత్రాలన్నీ అగ్ర చిత్రాల సమయంలోనే విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. విడుదలైన రెండో రోజే టపా కట్టేశాయి. ఈ సినిమాల పరిస్థితి ఎలా వుందీ అంటే, ఒక థియేటర్‌లో నాలుగు షోలు ప్రదర్శిస్తుంటే, అందులో రెండు షోలకే అవకాశం ఇస్తున్నారు. మిగతా రెండు షోలు వేరే చిత్రం ప్రదర్శిస్తున్నారు. ఈ రెండు షోలకైనా ప్రేక్షకులు వస్తున్నారా అంటే, శూన్యం. దాంతో, విడుదలైన రెండవ రోజే చిత్రాన్ని తీసేసి ప్రదర్శిస్తున్న మరో చిత్రాన్ని నాలుగు షోలు వేస్తున్నారు. ఈ పరిస్థితి హీనాతి హీనం. ఇటీవల ఓ చిత్రానికి ఓ థియేటర్‌లో విడుదలైన రోజునుంచే ఒక్క షోకే అవకాశం ఇచ్చారు. కానీ, రెండో రోజు ఆ ఒక్క షో కూడా వేయలేకపోయారు. ఎందుకంటే, ఒక్క టికెట్ కూడా తెగకపోవడమే కారణం. చిన్న సినిమా అంటే మన తెలుగులోకన్నా అటు తమిళంలో, ఇటు మరాఠిలో అద్భుతంగా రూపొందించి ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల వచ్చిన మరాఠి చిత్రం ‘సైరత్’. తమిళం నుండి తెలుగులోకి అనువాదమైన ‘బిచ్చగాడు’. ఈ చిత్రం తెలుగు తెరలపై ప్రభంజనమే సృష్టిస్తోంది. డైరెక్టుగా తెలుగులో తీసిన అనామక సినిమాల స్థానంలో ఈ చిత్రానే్న ప్రదర్శిస్తున్నారు. తెలుగు సినిమాలకు ఒక్క ప్రేక్షకుడు రాకపోవడంతో, వౌత్ టాక్‌తో హిట్ అయిన బిచ్చగాడు, ఆయా థియేటర్లను ఆక్రమిస్తున్నాడు. టీనేజ్, ఓ మల్లి, తుహిరే మేరీ జాన్, రెండక్షలు, వినోదం వంద శాతం, వసుధైక, శ్రీమతి బంగారం, మీరా, 7 టు 4, రైట్ రైట్, మేము, దండకారణ్యం, సీసా, దృశ్యకావ్యం, ఓ స్ర్తి రేపురా, నేను మా కాలేజీ, వీరి వీరి గుమ్మడిపండు, టెర్రర్, పడేసావె లాంటి చిత్రాల జాబితా బాగానే వుంది. ఈ సినిమాలన్నీ మంచి దృక్పథంతో ప్రారంభించినా, సరైన చిత్రీకరణ, ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో సినిమా ప్రదర్శించడంలో కూడా విఫలమైపోతున్నాయి.
ఈ చిత్రాలకు ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందో అదంతా వృధా అవుతోంది. దీనిగురించి పరిశ్రమలో పెద్దలు ఆలోచించాల్సిన అవసరం వుంది. చిన్న సినిమా అంటే పేలవమైన కథ, కథనాలతో నష్టాలను ఎదుర్కోవడానికే రూపొందించేదేనా అన్న నానుడి మారాలి.

-తిలక్