Others

అద్దెకడుపు చల్లగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేగు తెంచుకుంటేనే కాదు, వేరొకరి పేగు తెగినా చక్కటి బిడ్డదక్కే రోజులివి. అద్దె కడుపు చల్లగావుంటే, అమ్మ ఆనందం వెచ్చగా ఉంటుందని చెప్పుకునే కాలమిది. పేజ్ త్రీ ప్రపంచానికి ‘సరొగసీ’ డెలివరీలు పెద్ద ఫ్యాషనై కూర్చున్నాయి. కడుపు కష్టం లేకుండా.. భారం మోయాల్సిన బాధ్యతలు పెట్టుకోకుండా.. పిల్లల్నికనే ప్రక్రియపట్ల సెలబ్రిటీల ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాల మాదిరిగానే, నిజ జీవితంలోనూ హాలీవుడ్ కల్చర్‌ను అలవాటు చేసుకోడానికి, అందిపుచ్చుకోడానికీ బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఉత్సాహం చూపుతున్నారు. లేటెస్ట్‌గా పెళ్లి చేసుకోకుండా తండ్రి అయ్యానని జోష్‌తో చెప్పిన తుషార్ కపూర్‌ను చూసి అందరూ ముక్కున వేలుసుకున్న సంగతి తెలిసిందే. హాయిగా పెళ్లి చేసుకుని పిల్లాపాపల్ని కనొచ్చుగా అన్నవాళ్లూ ఉన్నారు. తుషార్ అభిప్రాయాన్ని అర్థం చేసుకుని, అదో ఆదర్శం అంటూ కితాబిచ్చిన వాళ్లూ ఉన్నారు. వైవాహిక జీవితంపై బలమైన అభిప్రాయం లేకపోవడం వల్లే ఇలా చేశానని తుషార్ చెప్పకనే చెప్పాడు. ప్రస్తుత సమాజంలో వైవాహిక బంధాలు ఎటుపోతున్నాయో అర్థంకాని పరిస్థితి లేకపోలేదన్న అభిప్రాయాలు ఇలా చాలమంది నుంచే బలంగా వినిపిస్తున్నాయి. అది వేరే సంగతి. అయితే, సరొగసీ విధానంలో పిల్లల్ని కనేందుకు ఉత్సాహం, ఆసక్తి చూపుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతుండటం సంచలనమవుతోంది. ఈమధ్యే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సరోగసి విధానంలో తల్లి అయ్యింది.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గౌరిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆ తరువాత సరోగసి ద్వారా షారూఖ్, గౌరీలకు అబ్రామ్‌ఖాన్ కొడుకయ్యాడు. ఇక హాలీవుడ్ పాపులర్ రాక్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూడా ఐవిఎఫ్ ద్వారా ఓ పాపకు జన్మనిచ్చాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్, కిరణరావు దంపతులు కూడా సరోగసితోనే ఓ బాబుకు జన్మనిచ్చారు. బాలీవుడ్ మరో నటుడు సోహైల్‌ఖాన్ సీమాఖాన్ దంపతులు కూడా ముందు నిర్వాణ అనే అబ్బాయికి జన్మనిచ్చి, తరువాత మరో బాబుకోసం సరోగసి విధానాన్ని ఎంచుకున్నారు. హాలీవుడ్ పాపులర్ నటి సారాజెస్సికా పార్కర్ కూడా భర్త మాతౌ బ్రాడెరిక్‌తో మొదట ఓ బాబుకు జన్మనిచ్చింది. తరువాత సరోగసితో మరో బిడ్డను సొంతం చేసుకుంది. బాలీవుడ్ పాపులర్ ఉమెన్ డైరెక్టర్ ఫరాఖాన్, హాలీవుడ్ నటీమణి నికోల్ కిడ్మాన్‌లు కూడా సరోగసీ విధానంలోనే తల్లులుగా మారారు. ఇక టాలీవుడ్‌లో మంచులక్ష్మి అండీ శ్రీనివాసన్ దంపతులు సరోగసి విధానంలోనే ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు నిర్వాణ పేరు పెట్టుకున్నారు. అంటే, క్రమంగా సరోగసీ తల్లుల సంఖ్య పెరుగుతోందన్న మాట.
chitram...
మంచు లక్ష్మి మధురానుభూతి

-శ్రీనివాస్