డైలీ సీరియల్

ఒయాసిస్ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిలిస్తే పలకవాకు, కోమాలో ఉన్నట్లు యాక్ట్ చెయ్.. ఏ నిమ్స్‌కో పంపించి, అక్కడ అడ్మిట్ చేస్తారు.. టెస్ట్‌లనీ చేస్తారు.. ఓసారి ఫ్రీగా చెకప్ చేయించుకో.. సాయంత్రం వచ్చి కలుస్తాను. మన పోలీసులుంటే మేనేజ్ చేస్తాను...’’ అన్నాడు రణధీర్.
దీప్తి ఆయన చెప్పినట్లే చేసింది..
సాయంత్రం మళ్లీ రణధీర్‌కి ఫోన్ చేసి హస్పిటల్‌లో తను ఏ వార్డులో ఉన్నదీ చెప్పింది.
రణధీర్ ఆమెను చూడటానికి వెళ్ళాడు.. ఆమె పక్కన రాజశేఖర్ కూర్చున్నాడు. ధైర్యం చెబుతున్నాడు. రణధీర్‌ని చూడగానే దీప్తి ఏడ్చింది. ఆమెకు కాపలాగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. అతను ఇదివరలో రణధీర్ దగ్గర పనిచేశాడు. అంచేత లేచి నుంచుని ఠక్కున శాల్యూట్ కొట్టాడు.
‘‘ఏడవకు.. అయిపోయింది గదా..’’ అని ఓదార్చాడు రణధీర్.
రాజశేఖర్ రణధీర్ వంక ఆశ్చర్యంగా చూశాడు.. ‘‘ఈ కానిస్టేబుల్ మీకు తెల్సా?’’ అని అడిగాడు.
‘‘మా ఫ్రెండ్ ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నాడు. వాడి దగ్గరకు వెళ్తుంటాను గదా.. చూసి ఉంటాడు..’’ అని కవర్ చేసుకున్నాడు.
కానీ రాజశేఖర్‌కి అనుమానం వచ్చింది.
ఆయన నిజంగా సినిమా ప్రొడ్యూసరేనా? లేక ఆ వేషంలో తన గుట్టు లాగటానికివచ్చిన పోలీసు శాఖవాడా అని’’.
‘‘ఈమధ్య అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ గోల్డ్ స్మగ్లింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఎక్సైజ్ సుంకం పెంచినప్పటినుంచి ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. కిందటి సంవత్సరం మన దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో మూడొందలకు పైగా కేసులు రిజిస్టర్ అయినయి. దొరకని కేసులూ, ఇతర మార్గాల ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్ లెక్కలోకి తీసుకుంటే దేశంలోకి ఎంత బంగారం అక్రమంగా వస్తోందో చెప్పలేం..’’ అన్నాడు రణధీర్.
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే దీప్తికి కాపలాగా ఉంచిన కానిస్టేబుల్ కాఫీ తాగి రావటానికి కాంటీన్‌కి వెళ్ళాడు.
‘‘నువ్వు లేచి బాత్‌రూంకి వెళ్తున్నట్లు హాలు చివరిదాకా వెళ్ళు.. ఆ చివర ఇంకో తలుపు ఉంది. ఆ తలుపు ద్వారా బయటకు రా..’’ అని చెప్పి రణధీర్ కూడా బయటకు నడిచాడు.
అయిదు నిముషాల తర్వాత దీప్తి రణధీర్ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసింది.
రాజశేఖర్ మాత్రం మరికొంతసేపు అక్కడే కూర్చున్నాడు. కానిస్టేబుల్ వచ్చాడు.
‘‘ఈ అమ్మ ఏదీ?’’ అని అడిగాడు కానిస్టేబుల్. ‘‘బాత్‌రూంకు వెళ్లింది. సరేగాని ఇందాక నువ్వు శాల్యూట్ కొట్టావే.. ఆయన ఎవరు?’’ అని అడిగాడు రాజశేఖర్.
‘‘అదేంటి.. ఆయనతో మాట్లాడుతున్నారు గదా.. ఆయనెవరోదెలవదా.. సార్ ఇన్స్‌పెక్టర్ సార్.. మా స్టేషన్‌లో కూడా ఆయన పనిజేసిండు.. ఇప్పుడు సి.ఐ.డిలో చేస్తుండు... శాన మంచోడు..’’ అన్నాడు కానిస్టేబుల్.
ఈ ఇన్స్‌పెక్టర్ ఎంత తెలివిగా తన రహస్యాలన్నీ లాగేశాడు? ఈయన్ని బతకనిస్తే తనని బతకనియ్యడు అనుకుంటూ రాజశేఖర్ బయటకు నడిచాడు.
*****

15
శే్వత హత్యకేసుతో ఎంతో కొంత సంబంధం ఉందనుకున్న వాళ్ళందరి సెల్‌ఫోన్లకు సంబంధించిన కాల్ లిస్ట్ తెప్పించాడు సబ్ ఇన్స్‌పెక్టర్ రాజు. శే్వత ఈమెయిల్ అడ్రసుకు వచ్చిన మెయిల్స్ తాలూకు ప్రింటవుట్స్‌నూ తయారుచేశాడు.
ఇవన్నీ తెచ్చి ఇన్స్‌పెక్టర్ రణధీర్‌కిచ్చాడు. రణధీర్ ముందు ఈమెయిల్స్ చదవటం మొదలుపెట్టాడు. రాజశేఖర్‌తో ఆమెకు జరిగిన సంఘటనల పరంపరను తెల్సుకోవడానికి ఈమెయిల్స్‌ను తేదీలవారీగా వరుసక్రమంలో పెట్టుకున్నాడు. ఒక్కొక్కటీ చదవడం మొదలుపెట్టాడు.
డియర్ శే్వత,
నిన్న రాత్రి మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు, నువ్వు నర్సింగ్ హోంలో ఇంకొక అంతస్తు వేయాలని ఉందనీ, మాదాపూర్ సమీపంలో ఈ నర్సింగ్ హోం బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఉందనీ చెప్పావు.. కానీ డబ్బు సమకూర్చుకోవడానికి టైం పడుతుందనీ ఈ ప్రణాళికలు నెరవేరటానికి ఎనే్నళ్ళు పడుతుందో తెలియదనీ నిరాశపడ్డావు. కానీ నీకు నేనున్నాను.. డబ్బు నాకొక సమస్య కాదు..
కోట్ల రూపాయలు ఒక చేత్తో సంపాదిస్తూ, రెండో చేత్తో ఖర్చుచేస్తున్నాను.. నువ్వు చెయ్యి కలిపితే చాలు.. ఈ కోట్లన్నీ నీ చేతితోనూ ఖర్చు చేయవచ్చు. ఇందుకు మొదటి విడితగా యాభై లక్షల రూపాయలు ఇవాళ నీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేయించాను. ఇకనుంచీ ప్రతిదీ నాదీ, నీదీ వేరు కాదు.. మనది.. మనం ఒకటైనప్పుడు ఇంక తేడాలేముంటాయి?
...రాజశేఖర్
రెండో మెయిల్ తీసి చదివాడు..
డార్లింగ్,
ఇప్పుడు నేను నీతో సరదాగా సరోగసీ బిడ్డను కనాలని ఉందని అంటే, నువ్వు సీరియస్‌గా తీసుకుని, అందుకు కృషిచేసినందుకు థాంక్స్... ఎవరో పిల్లను పంపించావు.. బానే వుంది. అందుకూ థాంక్స్.. అసలు ఆ తతంగం అంతా చెయ్యటంలో నా ఉద్దేశ్యం వేరే ఉంది. నాకు నీ ద్వారా పిల్లలను కనాలని ఉంది.. అదీ ఇలాంటి టెక్నికల్ ప్రాసెస్‌లో కాదు.
నాచురల్ పద్ధతిలో.. ఒక భార్యా భర్తా సహజ పద్ధతిలో ఎలా బిడ్డల్ని కంటారో.. ఆ పద్ధతిలోనే.. అవును.. నిన్ను నా భార్యగా ఊహించుకుంటున్నాను. నువ్వు అహోబలరావుతో ఏ విధంగానూ తృప్తిపడటం లేదనీ నీ మాటల్లోనే తెల్సిపోయింది.. నిజమే.. నీ మొగుడికి పీకలదాకా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవటం తప్ప.. భార్యను సుఖపెట్టటమే తెలియదు. నీలాంటి అందమైన పెళ్లాన్ని పక్కన పెట్టుకుని మొద్దు నిద్దురపోయేవాడితో ఏం సుఖపడతావు?

- ఇంకాఉంది

శ్రీధర