Others

శ్రీకృష్ణ తులాభారం ( నాకు నచ్చిన చిత్రం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1966లో సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించిన పౌరాణిక చిత్రరాజం ‘శ్రీకృష్ణ తులాభారం’. నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం దీనికి మూలాధారం. తల్లి చేతిలోనే మరణించే వరమున్న నరకాసురుడ్ని వధించే ప్రక్రియలో భూదేవి సత్యభామగా అవతరించడం, శ్రీకృష్ణుడు ఆపె కుమారుడైన నరకాసురుణ్ణి వధించడానికి సత్యభామకు అవకాశం కల్పించగా, నరకాసుర వధ తన గొప్పతనమే అని గర్వపడుతుంది సత్యభామ. నారదుడు తెచ్చిన పారిజాత పుష్పం శ్రీకృష్ణుడు రుక్మిణికి ప్రేమకానుకగా ఇవ్వడంతో అలకబూనిన సత్యభామకు ఇంద్రలోకంనుండి పారిజాత వృక్షాన్ని తెచ్చి ఇవ్వడంతో ఆమె అతిశయానికి అవధులు దాటి సమత్నులను అవమానిస్తుంది. రుక్మిణీదేవి తులసి పూజ చేస్తే ముత్తయిదువులు వెళ్లకుండా చేస్తుంది. ఆమెకు జ్ఞానోదయం కలిగించడానికి నారదుడి ద్వారా శ్రీకృష్ణుని శాశ్వతంగా వశం చేసుకోవడానికి పతిదాన వ్రతం చేయాలని, వ్రతం పూర్తవగానే తిరిగి అతని ఎత్తు ధనంగానీ, ధనేతరం చేత గానీ తూచి తిరిగి పతిని గ్రహించవచ్చని చెప్పగా సత్యభామ వ్రతాన్ని చేసి తులాభారంలో తన ధనం యావత్తు వేసినా కృష్ణుని తూచలేకపోతుంది. నారదుడు అతడిని నడివీధిలో విక్రయించగా సత్యభామ ప్రాధేయపడగా శ్రీకృష్ణుని తూచగల భక్తురాలు రుక్మిణి అని తెలుసుకుని ఆమె ద్వారా ఒక తులసి దళంతో తూచి తిరిగి శ్రీకృష్ణుని పొందుతారు. శ్రీకృష్ణుడు జగన్నాధుడని, భక్తసులభుడని, సత్యభామకు అర్ధమవుతుంది. పెండ్యాల స్వర రచనలో ఘంటసాల, సుశీల, వసంత,జానకి, మాధవపెద్ది, లీల పాడిన ప్రతీపాటా, పద్యం మధురాతి మధురం. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, సత్యభామగా జమున, నారదుడిగా కాంతారావు రుక్మిణిగా అంజలి పాత్రలలో ఒదిగిపోయారు. స్థానం నరసింహారావుగారి పాట మీరజాలగలడా, చందాల కేశవదాసుగారి భలేమంచి చౌకబేరము పాటలు యథాతథంగా వాడుకోగా దాశరధి, శ్రీశ్రీ, సముద్రాల మిగిలిన గీతాలు రాశారు.
నటనాపరంగా, సంగీతపరంగా, సన్నివేశ పరంగా అలరించిన ఈ చిత్రం నేటికీ బుల్లితెరపై అలరిస్తోంది.

-సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ, విశాఖపట్నం