రివ్యూ

దారి తప్పిన రివెంజ్ ( * కేశవ..బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: నిఖిల్, నీతూవర్మ, ఇషా కొప్పికర్, రావు రమేష్, వెనె్నల కిషోర్, బ్రహ్మాజీ, జీవా, అజయ్..
సినిమాటోగ్రఫి: దివాకర్ మణి
సంగీతం: సన్నీ ఎం.ఆర్.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ పిళ్లై
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
సమర్పణ: దేవాంశ్ నామ
నిర్మాత: అభిషేక్ నామ
రచన, దర్శకత్వం: సుధీర్ వర్మ

అందరిలా కాకుండా భిన్నమైన దారి ఎంచుకున్నాడు యువహీరో నిఖిల్. ‘స్వామి రారా’తో మొదలుపెట్టి కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ’ లాంటి భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లేటెస్టుగా తనకు స్వామి రారా లాంటి కమర్షియల్ విజయాన్ని అందించిన సుధీర్ వర్మతో చేసిన మరో భిన్నమైన ప్రయత్నం కేశవ. పగ తీర్చుకోవాలంటే అది వేడిమీదున్నప్పుడే కానిచ్చేయాలి. లేదంటే చల్లబడ్డాక ఏం చేయలేము అనే కానె్సప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో నిఖిల్ కేశవగా ఎలా ఆకట్టుకున్నాడు. అసలు ఈ కేశవ ఎవరు? అనేది చూద్దాం.
భిన్నమైన ప్రయత్నం అనగానే రెగ్యులర్‌గా కాకుండా కాస్త కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన దర్శకుడికి రాగానే.. మొదట చేసేది హీరోలోనే ఏదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేయడం. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయోగాన్ని చేశాడు దర్శకుడు. కేశవ అనే టైటిల్‌కి పెద్ద ప్రాధాన్యత లేదు. కేవలం హీరో క్యారెక్టర్ పేరునే టైటిల్‌గా పెట్టారు తప్ప టైటిల్ ద్వారా ఏమీ చెప్పాలనే ప్రయత్నం చెయ్యలేదు. ఈ సినిమా గురించి మొదటినుంచీ చెప్పుకుంటూ వస్తున్నట్టుగానే ఇది ఓ రివెంజ్ డ్రామా.
ఓ యాక్సిడెంట్‌లో తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన పోలీసుల్ని వరుసగా చంపుకుంటూ పోవడమే కేశవ ప్రధాన ఇతివృత్తం. పోలీస్ ఆఫీసర్లనే చంపడంతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న డిపార్ట్‌మెంట్ అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుని స్పెషల్ ఆఫీసర్ షర్మిల (ఇషా కొప్పికర్)కు కేసు అప్పగిస్తుంది. అలా కేసును టేకప్ చేసిన షర్మిల ఎలాంటి ఇనె్వస్టిగేషన్ చేసింది? నేరస్థుడు కేశవ అని ఎలా గుర్తించింది? అసలు కేశవ కుటుంబానికి జరిగిన కారు ప్రమాదానికి, పోలీసులకు లింకేంటి? కేశవ పోలీసులకు పట్టుబడకుండా తన పగను ఎలా తీర్చుకున్నాడు? అనేది స్క్రీన్‌పై చూడాలి.
నిఖిల్‌ను జాలీగా వుండే హీరోగానే ఎక్కువ చిత్రాల్లో చూశాం. హీరోయిన్ చుట్టూ తిరుగుతూ అల్లరిచేసే పాత్రలే ఎక్కువ పోషించాడు. కానీ ఈ సినిమాలో మొదటిసారి సీరియస్ మూడ్‌లో వుండే క్యారెక్టర్ చేశాడు. సినిమా మొత్తంలో అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలా తక్కువ. కేశవ క్యారెక్టర్‌కి తగ్గట్టు నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదు అనిపించింది. ఇక హీరోయిన్ క్యారెక్టర్‌కి సినిమాతో అసలు పనిలేదు. హీరోయిన్ వుండాలి కాబట్టి వుందన్నట్టుగా పెట్టారు రీతూవర్మని. ఆమె పెర్‌ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సీరియస్ మూడ్‌లో వెళ్తున్న కథలో వెన్నల కిషోర్, సత్య, ప్రియదర్శి, మధుసూదన్ వంటి ఆర్టిస్టులు అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. కేశవ చేసే హత్యల మిస్టరీని ఛేదించేందుకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ షర్మిలగా ఇషా కొప్పికర్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. రెండు వేరియేషన్స్ కలిగివున్న రావు రమేష్ క్యారెక్టర్ ఆడియెన్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో అజయ్, జీవా, బ్రహ్మాజీ, రాజా రవీందర్ ఫర్వాలేదు అనిపించారు.
ఇక టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌కి వస్తే దివాకర్ మణి ఫొటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని ఏరియల్ షాట్స్ అందంగా చెయ్యగలిగాడు. సన్ని ఎం.ఆర్. ఈ చిత్రం కోసం చేసిన పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. ప్రశాంత్ పిళ్ళై ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎస్‌ఆర్ శేఖర్ ఎడిటింగ్ గ్రిప్పింగ్‌గా ఉండి సినిమాకు ప్లస్ పాయంట్ అయ్యంది.. సినిమాలో ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. పాటల కోసం, ఫైట్స్‌కోసం ఫారిన్ లొకేషన్స్‌కి వెళ్ళకపోయినా వున్నంతలో సినిమాని రిచ్‌గా చెయ్యడంలో అభిషేక్ పిక్చర్స్ సక్సెస్ అయింది. డైరెక్టర్ సుధీర్ వర్మ గురించి చెప్పాల్సి వస్తే నిఖిల్‌తో చేసిన మొదటి సినిమాలో వున్నంత విషయం ఈ సినిమాలో లేదనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. దర్శకుడు కథ విషయంలో ఏమాత్రం కేర్ తీసుకోలేకపోయాడు.
ఐదుగురు పోలీసులు వున్న జీప్ వచ్చి తన కారును గుద్దేస్తే దానివల్ల తల్లిదండ్రులు చనిపోతే యాక్సిడెంట్ చేసినవాడిని కాకుండా కారులో వున్న అందర్నీ వరుసగా చంపుకుంటూ పోవడం ప్రేక్షకుడికి రుచించదు. పైగా హీరోకి గుండె కుడివైపున వుంటుందని, దానివల్ల ఎక్కువ ఆవేశపెడితే చనిపోతాడని మొదట్లో చెప్తారు. అయితే దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నట్లు సినిమాలో ఎక్కడా అనిపించదు. ఇన్స్‌పెక్టర్ అయిన రవిప్రకాష్ రాష్ట్రంలో ఎక్కడ మర్డర్ జరిగినా అక్కడ ఠక్కున ప్రత్యక్షమవుతుంటాడు. ఇది కాస్త కామెడీగానే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కి హీరోని అరెస్టు చెయ్యడంతో సెకెండాఫ్‌లో ఏం జరుగుతుందో అందరూ ఈజీగా ఊహించేలా వుంది. హత్యల కేసులో అరెస్టు అయిన హీరో అంతే సునాయాసంగా నిర్దోషిగా విడుదలై వస్తాడు. హీరో, హీరోయిన్ మధ్య అసలు లవ్ ట్రాక్ అనేదే లేకపోవడం, రివేంజ్ డ్రామాలో ఉండాల్సిన స్పీడ్ లేకపోవడం, కథ, కథనాల్లోని కొన్ని లోపాలు.. హీరో నిఖిల్ చేసిన మరో విభిన్నమైన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాయ.

-త్రివేది