రివ్యూ

పెద్ద పొట్లమే.. కానీ ( *మిక్చర్ పొట్లం బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: శే్వతాబసుప్రసాద్, భానుచందర్, జయంత్, గీతాంజలి, కృష్ణ్భగవాన్, పోసాని కృష్ణమురళి, అలీ, జూ.రేలంగి
సంగీతం: మాధవపెద్ది సురేష్
కెమెరా: కళ్యాణ్ సమీ
నిర్మాతలు: లంకలపల్లి శ్రీనివాసరావు, వీరన్నచౌదరి, లక్ష్మీప్రసాద్
దర్శకత్వం: ఎం.వి.సతీష్‌కుమార్

కిడ్నాప్ నేపథ్యంలో ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. అయితే ఈ పాయింట్‌తో తెరకెక్కే సినిమాల్లో ఏదోక వైవిధ్యం లేకపోతే ప్రేక్షకులు తిప్పికొట్టడం ఖాయం. తలకు, మోకాలుకు ముడిపెట్టినట్లుగా ఏదో సంఘటనను కిడ్నాప్ ఉదంతానికి ముడిపెడితే బానే వుంటుంది. కానీ దాన్ని ప్రేక్షకుడు ఒప్పుకోగలగాలి. ఒప్పుకునేలా స్క్రిప్ట్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చూపించాలి. అప్పుడే కిడ్నాప్ కథ దర్శకుడు పరంగా సుఖాంతమవుతుంది. లేదంటే సినిమా కథ ప్రకారం సుఖాంతమే అయినా దర్శకుడి పనితీరు దుఃఖాంతంగానే మిగులుతుంది. ఈ సినిమాలోనూ అదే పరిస్థితి. పొట్లం పెద్దదిగానే వున్నా మిక్సర్ సరిగ్గా కలవక రుచి పూర్తిగా తెలియలేదు. శే్వతాబసుప్రసాద్ చాలాకాలం తరువాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం కావడంతో కేవలం ఆమె గ్లారన్‌నే దృష్టిలో పెట్టుకుని కథ రూపొందించుకున్నారు.
అందాల సుందరాంగిగా ప్రజల హృదయాల్లో కోరికలు రేపే సువర్ణసుందరి (శే్వతాబసుప్రసాద్) ఓ ట్రావెల్స్ నడిపిస్తుంటుంది. ఆమె బండి ఎక్కాలని, హాయిగా ఎక్కడెక్కడికో విహారం చేయాలని ఎంతోమంది ఉవ్విళ్లూరుతుంటారు. ఎందుకంటే, ఒక్కసారి బస్సెక్కెతే మిక్చర్ పొట్లంలో ఎన్ని రుచులు ఉంటాయో అన్ని ఆనందాలు దొరుకుతాయి. అందుకని సువర్ణ సుందరి ట్రావెల్స్‌లో ప్రయాణించడానికి జనాలు ఎగబడుతుంటారు. ఆమె ఓసారి అమలాపురం నుండి షిర్డీకి భక్తజనాలతో బయలుదేరుతుంది. భక్తులు కానివాళ్లు కూడా షిర్డీ దర్శనం కోసం బస్సులెక్కేస్తారు. సగం సినిమా అంతా (శే్వతా) బస్సు ప్రయాణంతోనే సాగుతుంది. ఇక ఈ సమయంలో కామెడీకి హద్దే ఉండదు. రకరకాల డైలాగులతో ముఖ్యంగా జయంత్- గీతాంజలి జంట ప్రేమాయణపు గీతాలతో సినిమా అలా అలా సాగుతుంటే, ఒక్కసారిగా పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురైనట్లుగా, సంఘ విద్రోహశక్తులు కథలోకి వచ్చేస్తారు. ఓ ఎమ్మెల్యే తమ్ముణ్ణి టార్గెట్ చేస్తూ వచ్చిన దుండగులు అడవిలో సువర్ణసుందరి బస్సులో వున్న ప్రయాణీకులను కిడ్నాప్ చేస్తారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంటేనే షిర్డీ యాత్రికులను విడుదల చేస్తామని డిమాండ్ పెడతారు. అందుకు ప్రభుత్వం ఏం చేసింది? సువర్ణ సుందరి బస్సులో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారు? యువజంట ప్రేమకథ చివరికి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ముగింపు.
తొలి సగమంతా రకరకాల అర్థాలున్న డైలాగులతో సాగి అభిరుచి వున్న ప్రేక్షకులకు నచ్చేలా సాగించారు. ముఖ్యంగా ద్వందార్థాలు అక్కడక్కడా వినపడినా అవన్నీ హాస్యంలో కలిసిపోతాయి. తొలిసగం ఫర్వాలేదనిపించేలా సాగినా, మలిసగంలో వున్న సంక్లిష్టతే సరిగా రాసుకోలేకపోయాడు దర్శకుడు. నక్సలిజాన్ని ఎత్తుకున్నా, దానివెనుక ఓ మంచి ఉద్దేశం ఉందని చెప్పే ప్రయత్నం సరిగ్గా సాగలేదు. స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండటంతో సినిమా ఆసక్తి కలగదు. పాత్రలమధ్య సంక్లిష్టత ఎక్కువై ఏం జరుగుతుందో అర్థంకాని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయ. ఏదేమైనా ప్రధానంగా శే్వతాబసుప్రసాద్ గ్లామరే టార్గెట్ కనుక, ఆమె అందచందాలపై ఎక్కువగానే ఫోకస్ చేశారు. కామెడీతో సస్పెన్స్ కలపడంవల్ల మంచి గ్రిప్పింగ్ ఉన్నా అది తెరపైకి పూర్తిగా ఆవిష్కృతం కాలేదు.
శే్వతాబసుప్రసాద్ తన పాత్ర వరకూ న్యాయం చేయగలిగింది. సినిమా బృందం ఆశించినంతగా ఆమె గ్లామర్ సినిమాకు కలిసి రాలేదు. భానుచందర్ కీలకమైన పాత్రలో ఓకె అనిపించాడు. కొత్త జంట జయంత్- గీతాంజలి సోసోగా అలరిస్తారు. కృష్ణ్భగవాన్, అలీ, జూ.రేలంగిల కామెడీలో ఇసుమంతైనా కొత్తదనం కనిపించదు. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం. కల్యాణ్ సమీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లో చూపించాడు. మాధవపెద్ది సురేష్ చాలాకాలం తరువాత సంగీతం అందించినా, పూర్తిస్థాయి ప్రతిభ చూపలేకపోయాడు. నిర్మాణ విలువలు ఫరవాలేదనిపిస్తాయ. దర్శకుడి వైఫల్యమే చిత్రాన్ని రొటీన్‌కు చేర్చేసింది. కిడ్నాప్ డ్రామాను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడి వైఫల్యం కనిపించింది.

-వాహిని