రివ్యూ

తుప్పుపట్టిన కథ (*టిక్ టాక్ * బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: హరినాథ్ పొలిచర్ల, వౌనిక, నిషిగంధ, రాహుల్, సందీప్ ఆనంద్, సాయకృష్ణ, రమేష్, రమణి తదితరులు
సినిమాటోగ్రఫి: వంశీకృష్ణ
సంగీతం: ఎస్ అండ్ బి మిల్
ఎడిటింగ్: వెంకటరమణ
నిర్మాత, దర్శకత్వం: హరినాథ్ పొలిచర్ల

ఆత్మలు నిజంగా మనుషులకు కన్పిస్తాయా? మరణానంతరం వాటి జీవితం ఎలా వుంటుంది? ఎప్పటికీ అలా గాల్లో దెయ్యాల్లాగా తిరుగుతూనే ఉంటాయా? మనిషికి భయంతోపాటు ధైర్యాన్ని కూడా దెయ్యాలు ఇస్తాయా? వెన్నుతడితే ధైర్యం- ఎదురుపడితే భయం అన్న స్థాయికి దెయ్యాలు ఎదుగుతాయా? అసలు మనిషికి దెయ్యం అనే పదార్థం ఎప్పటికీ ఓ మిస్టరీనా? లేక దాన్ని ఛేదించినవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి అనుభవాలేంటి? అనే ఆలోచనలతో ఓ కథను రాసుకొని టిక్ టాక్ సినిమాగా తీసుకొచ్చారు. అయితే పైన చెప్పిన పాయంట్లేవీ కథనంలో కనిపించకపోవడంతో టిప్పు టాపుగా తయారుకావాల్సిన హారర్ సినిమా తుప్పుపట్టిన కథలా మారిపోయంది!
అంజిబాబు (హరనాథ్) అనే ఓ మెకానిక్. తన కుటుంబంతో రోజులు హాయిగా గడిపేస్తుంటాడు. మరదలు మహాలక్ష్మి (వౌనిక) తోడిదే అతని లోకం. స్నేహితులు కూడా అతనికి వెన్నుదన్నుగా నిలుస్తారు. అలాంటి పైలాపచ్చీసు అంజికి ప్రీతి (నిషి గంధా) అనే అమ్మాయినుండి ఓ సవాలు ఎదురవుతుంది. ఆ ఊళ్ళో ఉన్న ఓ పాడుబడిన భవనంలో కొన్ని రోజులపాటు అంజి నివసించాలని ఆమె సవాల్ విసురుతుంది. అందుకు స్పందించిన హీరో తాను దెయ్యాలొచ్చినా భూతాలొచ్చినా ఏం భయపడను అంటూ ఆ బంగళాలో ఉండడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరువాత అతనికెదురైన పరిణామాలు ఎలాంటివి? వాటన్నింటినీ పరిష్కరించి తిరిగి తన మరదల్ని ఎలా చేరాడు అన్న కథనం మిగతా సినిమా.
విషయపరంగా చూస్తే ఇక్కడ ఎలాంటి కథా లేదు. ఓ రెండు గంటలపాటు ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేయడానికి మాత్రమే పనికొచ్చే ఓ చిన్న థ్రెడ్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకునే ప్రయత్నం చేశారు. గతంలో కూడా స్మశానంలో చెట్టుమీద అర్థరాత్రి మేకు కొట్టిరావాలని ఓ కథ ఉండేది. మేకును కొట్టిన వీరుడు ఆ చెట్టుమీదే చనిపోయి వేలాడుతూ కనిపిస్తాడు. ఆ కథనం కొంచెం అటూ ఇటూ చేసుకొని ప్రధాన పాత్రకు హీరోయిజమ్ సృష్టించి తీర్చిదిద్దారు. సినిమా నిడివి తక్కువవడం ప్రేక్షకుడికి కలిసొచ్చే అంశం. రచయితగా తానే కథ రాసుకొని తన కథకు న్యాయం జరిగేలా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు హరనాథ్. అయితే పూర్తిగా హారర్ ఎలిమెంట్ కాకపోవడం సినిమాకి పెద్ద మైనస్. కథలోకాని, స్క్రీన్‌ప్లేలోగాని ఎక్కడా సరైన క్లారిటీ లేదు. పైగా హారర్ సినిమాకు కావాల్సిన పాళ్లేవీ ఇందులో చొప్పించలేకపోయారు. మొదటి పది నిమిషాలు మాత్రం సినిమా చూడబుల్‌గా ఉన్నా, తరువాత గాడి తప్పి ఎటో పోయంది. దాంతో స్క్రీన్‌పై అర్థంకాకుండా సాగిపోతున్న సన్నివేశాల్ని బలవంతంగా చూస్తూ కూర్చోవడం తప్ప ప్రేక్షకుడు ఇంకేం చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చేస్తాడు. హీరోకోసమే కొన్ని పాటలు, కామెడీ సన్నివేశాలు, శృంగారాత్మక సన్నివేశాలు చొప్పించినట్లుగా కనిపిస్తాయి. చివరల్లో వచ్చే ఐటెం సాంగ్‌ను ఎందుకు పెట్టారో దర్శకుడికైనా అర్థమయ్యందో లేదో డౌటే. కెమెరా పనితనం సోసోగా ఉండి, ఏమాత్రం హారర్ సినిమా ఫీలింగ్ ఇవ్వలేకపోయంది. కొత్తదనం లేని తుప్పు కథ కావడంతో దెయ్యాల గురించి చెబుతున్నా కామెడీగా అనిపిస్తుంది. కథలో చెబుతున్న పాయింట్ అటూ ఇటుగా జారిపోయి పక్కదారి పట్టడంతో విసుగొస్తుంది. నటీనటుల్లో హరనాథ్ ఓకె అన్పించినా, హీరోయిన్లు కేవలం గ్లామర్ షోకే పనికొచ్చారు. గ్రాఫిక్స్‌లో వున్న పాట, ఏదో ఏదో అంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది. చెప్పదల్చుకున్న విషయాన్ని పూర్తిస్థాయిలో చెప్పలేకపోయింది ఈ టిక్‌టాక్.

-సునయన