Others

లక్కీ గాళ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజల్ పనైపోయిందని అంటున్నవాళ్లు అంటూనే ఉన్నారు, ఆమె మాత్రం పెద్ద హీరోల చిత్రాల్లో భారీ ఆఫర్లు అందుకుంటూనే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనాయికగా వెలిగిన కాజల్ అగర్వాల్, ఒకదశలో తోటి హీరోయిన్లతో రేసులో వెనుకబడిన మాట వాస్తవమే. అయితే, వయసు మీదపడుతున్నకొద్దీ కొత్తందాలు సంతరించుకున్న కాజల్ -సీనియర్ కథానాయిలకు ఏమాత్రం తగ్గకుండా వేగాన్ని పెంచుతోంది. పెద్ద ప్రాజెక్టుల్లో చాన్స్‌లు అందుకుంటూ, అదేస్థాయిలో పారితోషికాన్నీ డిమాండ్ చేస్తోంది. కాజల్‌కు ఇక ఎంతమాత్రం అవకావాలు రావనుకునే పరిస్థితిలో చిరుతో జోడీకట్టి ‘అమ్మడు లెట్స్ కుమ్మడు’తో కొత్త గ్లామర్ సాధించింది. క్రేజ్ ఉండగానే కెరీర్ చక్కబెట్టాలన్న రీతిలో ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రాజెక్టుతో బిజీ అయ్యింది. అటు అనుష్క, ఇటు తమన్నాలు పెద్ద చిత్రాలు చేస్తుంటే -కాజల్ మాత్రం ఖాళీగా ఉండకూడదన్నట్టు ఏదోక సినిమా చక్కబెడుతూనే ఉందన్నది ఇండస్ట్రీ టాక్. తాజాగా కొరియోగ్రాఫర్ నుంచి హారర్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ డైరెక్టర్ హీరోగా మారిన రాఘవ లారెన్స్‌తో సినిమా చేయబోతోందని వినికిడి. ‘మిత్రుడు’, ‘జాగ్వార్’ లాంటి చిత్రాలు రూపొందించిన రాజవౌళి శిష్యుడు మహదేవ్ తాజాగా లారెన్స్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. 18, 19వ శతాబ్దాల్లో జరిగిన రెండు కథలను కలిపి రచయిత విజయేంద్రప్రసాద్ సిద్ధం చేసిన కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఆ పీరియాడికల్ మూవీలో నాయిక పాత్రకు కాజల్‌ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ‘మగధీర’లో రామ్‌చరణ్ సరసన రెండు జన్మల పాత్రలు పోషించి మెరుపులు మెరిపించినట్టే -ఈ చిత్రంలోనో కాజల్ తన టాలెంట్ చూపించగలదన్న నమ్మకంతోనే దర్శకుడు ఆమెను సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల దశలోవున్న ఈ భారీ చిత్రానికి కాజల్ సైన్ చేస్తే -మరో రెండేళ్లపాటు ఆమె కెరీర్‌కు ఢొకా ఉండకపోవచ్చని అంటున్నారు.