మెయిన్ ఫీచర్

ఫాల్కే ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక కెరీర్ రేంజ్ -పిఎస్‌ఎల్‌వి రాకెట్ స్థాయిలో దూసుకెళ్తోంది. ‘బేవాచ్’ అందాలతో హాలీవుడ్‌లో సెగలు పుట్టిస్తోన్న ప్రియాంక పనితనానికి తాజాగా విశిష్టమైన గౌరవమూ దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన ఘన విజయాన్ని గుర్తిస్తూ దాదా సాహెబ్ ఫాల్కే అకాడెమీ అవార్డుతో ప్రియాంకను సత్కరించనున్నారు. ఈ అకాడెమీ అవార్డుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘అంతర్జాతీయ ప్రఖ్యాత నటి’ క్యాటగిరీ కింద ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ‘అంతర్జాతీయ వేదికల మీద ప్రియాంక ధగధగలాడుతోంది. అందుకు ఆమె చిత్తశుద్ధి, అంకితభావమే కారణం. ఎంచుకున్న కెరీర్‌లో ఆమె సాధిస్తోన్న విజయాలను చూసి ప్రతి భారతీయుడూ గర్వపడాలి. చిన్న వయసులోనే ప్రపంచ సినిమాకు భారతీయ ప్రతినిధిగా ఎదిగిన ఆమెను దాదా సాహెబ్ అవార్డుకు ఎంపిక చేశాం. కొత్తగా ప్రవేశపెట్టిన ‘అంతర్జాతీయ ప్రఖ్యాత నటి’ క్యాటగిరీ కింద ఈ అవార్డును అందించేందుకు నిర్ణయించాం’ అని దాదా సాహెబ్ ఫాల్కే అకాడెమీ అవార్డు కమిటీ చైర్మన్ గణేష్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 1న ముంబయిలో జరగనున్న ఓ కార్యక్రమంలో ప్రియాంకకు అవార్డు అందించనున్నారు. కార్యక్రమానికి అనిల్‌కఫూర్, కపిల్ శర్మ, జూహీ చావ్లా, నితీష్ తివారిలాంటి సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అకాడెమీ బోర్డు సభ్యులు జానీ లీవర్, పహ్లాజ్ నిహ్లానీ, మిథున్ చక్రవర్తి, టిపి అగర్వాల్ సైతం హాజరవుతారు.