Others

అదీ నిబద్ధత అంటే.. (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచరిత్రలో అపూర్వమైన చిత్రం ‘మాయాబజార్’. ప్రపంచ సినిమాకు మాయాబజార్ స్క్రీన్ ప్లే పెద్దబాలశిక్ష లాంటిదని విమర్శకులు ఇప్పటికీ పొగుడుతూనే ఉన్నారు. ప్రేక్షకులకు తెలిసిన ఓ కథకు సంబంధించిన విషయాన్ని తీసుకుని, తెలియని ఓ కథనం అల్లుకుని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన మాయాబజార్ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆవకాయ పప్పు అంత ఇష్టం! అలాంటి చిత్రానికి పనిచేసిన వారిలో ఇప్పుడు వున్న దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, నటి సీత ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఈ ఛాయాచిత్రం మాయాబజార్ సినిమా నిర్మాణానికి సంబంధించినది. మయాబజార్‌లో ‘‘ఘంటసాల ఆలపించిన ‘సుందరి నీవంటి దివ్య స్వరూపం ఎందెందుకు చూసినా లేదు కదా.. నీ అందమె నాకు దక్కేగదా’’ పాటలో శశిరేఖగా నటించిన సావిత్రి ‘ఆఁ.. దూరం దూరం..’’ అంటూ పాడుతుంది. ఆ పాటలో వాయిస్ మహానటి సావిత్రిదే! ఇందుకోసం ఆమె రికార్డింగ్ థియేటర్‌కు వచ్చి పాటను ప్రాక్టీస్ చేసే సమయంలో తీసిన ఫొటో ఇది! ఇందులో ఘంటసాలవారితోపాటుగా కె.వి.రెడ్డి, మాధవపెద్ది సత్యం తదితరులను చూడవచ్చు. ఓ పాటకోసం నటి సావిత్రి ప్రత్యేకంగా రికార్డింగ్ థియేటర్‌కు వచ్చి నేర్చుకుని మరీ పాడటంలోనే సినిమా పట్ల ఆమెకున్న నిబద్ధతను గుర్తించవచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717