Others

తప్పదు మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా లండన్ వెళ్లిపోయింది. వేసవి బ్రేక్ కాదు, కొత్త ప్రాజెక్టు కోసం. కొత్త ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తమన్నా మకాం లండన్‌లోనే ఉండొచ్చని అంటున్నారు. ‘్ఫనా’, ‘హమ్‌తుమ్’, ‘తేరి మేరి కహాని’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లి తన తెలుగు ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను లండన్‌లో ప్రారంభించాడట. తెలుగు ప్రాజెక్టు చేయాలని చాలాకాలంగా ప్రణాళికలు వేసుకుంటున్న కునాల్ కోహ్లీ, ఈమధ్యే కథను తమన్నాకు చెప్పడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయింది. పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ప్రాజెక్టును యంగ్ హీరో సందీప్‌కిషన్‌తో కలిసి చేస్తోంది తమన్నా. తమన్నా కొత్త ప్రాజెక్టు సంగతి సరే... స్టార్ హీరోయిన్ ఇలా చిన్న హీరోలతో సినిమా చేస్తోందేమిటబ్బా అన్న సందేహాలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి బాహుబలితో అమాంతం క్రేజ్ పెరిగిపోతుందని ఆశించిన తమ్మూ బేబీ ఆశలు ఫలించలేదు. పైగా ఆమె చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు కూడా లేవు. ఈ పరిస్థితిలో చిన్న హీరోలతోనైనా సినిమాలు చేయకుంటే వెనుకబడిపోతానన్న భయం తమ్మూ బేబీని వెంటాడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు తమిళంలోనూ మరో చిన్న హీరోతో సినిమా ఒప్పుకున్న తమన్నా, పెద్ద హీరోలతో ఎప్పుడు సినిమా పడుతుందోనని ఆశగా చూస్తోంది.