Others

‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా..’ (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణంరాజు, సుమన్‌లు నటించిన చిత్రం ‘ప్రాణస్నేహితులు’. ఈ చిత్రంలోని పాట ‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా..’ ఈ పాట వింటుంటే బాల్యంనుంచీ ఇప్పటివరకూ మనకుగల స్నేహితులు గుర్తుకు వస్తూ ఉంటారు. జీవితంలో స్నేహానికుండే విలువను ఈ పాట తెలియజేస్తుంది. కుటుంబ బంధం తర్వాత అత్యంత విలువ ఇచ్చే బంధం స్నేహబంధం. ఈ పాటలో ఎన్ని సిరిసంపదలున్నా అవేవీ స్నేహానికన్నా మిన్నకాదు అని చెప్పిన భావం అద్భుతం. బంధువులు రాబంధువులైతే కనీసం మాటలతోనైనా ఓదార్చేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహబంధం యొక్క పవిత్రతను ఈ సృష్టి ఉన్నంతవరకూ గుర్తుండిపోయేలా ఈ పాట కొనసాగుతుంది. ఈ పాట అంటే నాకెంత ఇష్టం అంటే ఈ పాట వింటూంటే నా రెండుకళ్ళు చెమ్మగిల్లుతాయి. నిర్మలమైన స్వచ్ఛమైన విలువలతో కూడిన స్నేహం ఎంత గొప్పదో ఆ పాట వింటే ఇట్టే అర్థం అగును. ఎటువంటి వారికైనా ఈ పాట తనలో లీనం చేసుకోగలదనుటలో అతిశయోక్తి లేదు.
- వెలిశాల దుర్గాప్రసాదు,
ఆత్కూరు, కృష్ణాజిల్లా

- వెలిశాల దుర్గాప్రసాదు, ఆత్కూరు, కృష్ణాజిల్లా