Others

‘అమ్మ రాజీనామా’ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన మాతృత్వ మధురిమలతో తడిమి ఈ లోకాన్ని పరిచయం చేసేది అమ్మ. అమ్మకన్నా గొప్ప దైవం ఎక్కడా ఉండదు. అమ్మ లేకపోతే ఆ లోటు జీవితంలో ఎవరూ తీర్చలేరు. తన బదులుగా దేవుడు అమ్మను ఇచ్చాడని, కొంతమంది కవులు చెబుతారు. మాతృదేవోభవ అని ముందుగా అమ్మనే స్మరిస్తాం. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మ గూర్చి తెలిపే సినిమాలు తెలుగు పరిశ్రమలో చాలా తక్కువే ఉన్నాయి. ఉన్నవాటిలోకెల్లా గొప్పగా అనిపించేది శారద అమ్మగా నటించిన ‘అమ్మరాజీనామా’ చిత్రం. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. కానీ అమ్మకు మాత్రం కట్టెల్లోకి వెళ్లేంతవరకూ విశ్రాంతి ఉండదు. నిరంతరం తన పిల్లలకోసం తపిస్తూనే ఉంటుంది. అవసరమైతే శిబి చక్రవర్తిలా తన శరీరాన్ని కోసి ఇస్తుంది, పిల్లలకోసం. అటువంటి కథనంతో అమ్మ రాజీనామా చిత్రాన్ని రూపొందించారు. ప్రతీ బిడ్డకు మనస్సుకు హత్తుకునేలా తీర్చిదిద్దిన చిత్రం ‘అమ్మ రాజీనామా’. అమ్మ తన రక్తమాంసాలతో నవమాసాలు మోసి కని పెంచితే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక తల్లిని గురించి పట్టించుకోకపోయినా వారు సమస్యల్లో ఉన్నపుడు తన కిడ్నీని అమ్మి ఆ ధనంతో పిల్లల సమస్యల్ని తీర్చిదిద్ది, చివరికి తను ఒక సమిధగా మిగిలిపోతుంది అమ్మ ‘‘అమ్మ రాజీనామా’’ చిత్రంలో.
అవనిలోనికి తీసుకొచ్చేది అమ్మ ఆ అవనికి పరిచయం చేసేది నాన్న. ఊర్వశి శారదగారు అమ్మ పాత్రలో జీవించారు. ‘సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించింది ఒక అమ్మ,’ ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాటకన్నా కమ్మని కావ్యము’ అను పాటలు సందర్భానుసారంగా ఎంతో గొప్పగా ఉన్నాయి. ఈ పాటలు యేసుదాసు, చిత్ర ఎంతో రాగయుక్తంగా మన మనస్సులో పదిలంగా నిలిచిపోయే విధంగా ఆలపించారు.
- టి.రఘురామ్, నరసరావుపేట
................

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి శుక్రవారం వెలువడే వెనె్నలకు రచనలు మంగళవారం లోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలు వుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- టి.రఘురామ్, నరసరావుపేట