మెయిన్ ఫీచర్

మళ్లీ.. సోషియో ఫాంటసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషియో ఫాంటసీ
ఈ జానర్ కింద కమ్మని రుచులు వండి వడ్డించటంలో -తెలుగు సినిమాను తక్కువ చేసి చెప్పలేం. ఉన్న ముడి సరుకుతోనే ఉన్నతమైన సినిమాలను తీర్చిదిద్దిన గొప్ప చరిత్ర తెలుగు పరిశ్రమకూ ఉంది. కాకపోతే -వైవిధ్యాన్ని వదిలిపెట్టి, ప్రేక్షకుడికి బోరుకొట్టే వరకూ ‘యమ’కథల్నే గుదిగుచ్చటంతో -తెలుగు సోషియో ఫాంటసీ కొత్తపుంతలు తొక్కలేకపోతోంది. కొంగొత్తదారులు వెతకలేకపోతోంది. అర్థాన్ని మార్చేసి.. అర్థం ప(దా)ర్థంలేని కథలను వండేసి.. సోషియో పాంటసీ టాగ్‌లైన్‌తో జనంమీదకొదిలే దిగ్గజ‘్ధరుల’ సంఖ్య పెరగటంతో -ఆ పేరు చెబితేనే పెదవి విరిచే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి సోషియో ఫాంటసీ జానర్‌కింద తెలుగు వచ్చిన సినిమాలెన్నో. కానీ -ఎప్పటికీ ప్రస్తావించుకుంటూ, మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు, ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు కొన్నిగానే మిగిలిపోయాయి. తాజాగా -సోగ్గాడే చిన్నినాయనా అంటూ నాగార్జున చేసిన సోషల్ ఫాంటసీ వర్కవుటైంది. మరోపక్క బాలకృష్ణ 100 సినిమా సోషియో ఫాంటసీగా రాబోతుందన్న ప్రకటనతో -ఈ జానర్‌పై చర్చ ఊపందుంది. అదీ కొనే్నళ్ల క్రితం సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన -ఆదిత్య 369కు సీక్వెల్ అనేసరికి అంచనాలు పెరుగుతున్నాయ. బహుశ -తెలుగులో సోషియో ఫాంటసీకి సీక్వెల్‌గా వస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావొచ్చు. పైగా -నందమూరి ఫోర్త్ జనరేషన్‌గా మోక్షజ్ఞ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న కథనాలు -సోషియో ఫాంటసీ స్ట్రెంగ్త్‌పై అంచనాలు పెంచుతున్నాయ. పరసవేది
కానె్సప్ట్‌తో -పంచభూతాల శక్తి నేపథ్యంలో స్టోరీని వర్కవుట్ చేస్తున్నట్టు వినికిడి.

ఒకప్పుడు-
సోహియో ఫాంటసీ చిత్రాలు తెలుగు ప్రేక్షకుడిని సమ్మోహనపర్చాయి. అలాంటి సినిమాలు అప్పుడప్పుడే తప్ప, ఎప్పుడూ ఎందుకు రావట్లేదన్నదే ప్రశ్న. చాలాకాలం క్రితం వచ్చిన ఎన్టీఆర్ యమగోల సోషియో ఫాంటసీగా ఆ రోజుల్లోనే రికార్డ్ బ్రేక్ చేసింది. సత్యానంద్ సంభాషణలు చిత్రంలో శక్తివంతగా పేలాయి. తరువాత 1990లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సోషియో ఫాంటసీ రికార్డుల్ని తిరగరాసింది. శ్రీనివాస చక్రవర్తి మూలకథతో యండమూరి సహా ఇద్దరు ముగ్గురు రచయితల ఆలోచనలతో రిస్క్ తీసుకుని వండిన విందు భోజనమది. కథ ఒక ఎత్తయితే, బడ్జెట్ పరిధులు దాటేసి ఇంద్రలోకం, హీరో నివాసం, అమ్రిష్‌పురి మంత్రాల నిలయంలాంటి భారీ సెట్టింగులేసిన చిత్రమది. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ ఫలించింది. ఖర్చుకు వెనుకాడని అశ్వనీదత్ నమ్మకం కోట్లు రాబట్టింది. సినిమా రికార్డులు బద్దలుకొట్టింది. 1993లో యమలోకానికి భూలోకాన్ని అనుసంధానిస్తూ వచ్చిన చిత్రం ‘యమలీల’. దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి మనీషా సంస్థతో చేసిన మాయల గారడీ. కమెడియన్ ఆలీని హీరోని చేస్తూ కేవలం కథనే నమ్ముకుని తీసిన సంచలనం. అమ్మ ప్రేమ, యమపాశానికి మధ్య భవిష్యవాణిని పెట్టి అల్లుకున్న అందమైన సరదా కథ. మదర్ సెంటిమెంట్ పండింది. సినిమాలో యముడు, తోటరాముడు, తోటరాముడు, ఎడిటర్, ఇన్స్‌పెక్టర్ పాత్రలు అద్భుతంగా పండాయి. హిమక్రీములు, నగర పౌరులు చూస్తున్నారు లాంటి దివాకర్‌బాబు సంభాషణలు సినిమా విజయానికి తోడ్పడ్డాయి. లోతైన సన్నివేశాలు, సున్నితమైన హాస్యం, కట్టిపడేసే సంగీతం, హాయిగా సాగిపోయే కథనం.. వెరసి కనకవర్షం కురిసింది. ‘సిరులొలికించే చిన్ని నవ్వులే’ ‘సుస్వాగతం యమ రాజాగ్రణి’ ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’లాంటి పాటలు ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తున్నవే. 1988లో వచ్చిన ‘యముడికి మొగుడు’ మరో ఫాంటసీ. డైనమిక్ మూవీస్‌పై మెగాస్టార్ చిరంజీవి మిత్రులు సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. కాళీగా, బాలరాజుగా మెగాస్టార్ ద్విపాత్రాభినయం చిత్రానికి హైలెట్. రెండు పాత్రల్లో చిరు రఫ్పాడించాడు. ఈ కథ మెగాస్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అల్లుకున్నదే. విజయశాంతి, రాధలతో లవ్ రొమాన్స్, రాజ్‌కోటి మ్యూజిక్, రవిరాజా పినిశెట్టి డైరెక్షన్, యముడిగా కైకాల, చిత్ర విచిత్ర గుప్తులుగా అల్లు రామలింగయ్య, సుత్తివేలు, భారీ విలనిజంతో రావుగోపాలరావు, గొల్లపూడి, కోట శ్రీనివాసరావులు ప్రాణం పోసేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి డాన్స్, ఫైట్స్ చెప్పక్కర్లేదు. మూడు సినిమాల్లో యముడి పాత్ర ధరించినా -కైకాల నట విశ్వరూపాన్ని ఈ సినిమాలోనే కనిపిస్తుంది. కిట్టయ్య -కన్నయ్య, అహో బ్రహ్మా.. ఒహో శిష్య, ఘటోత్కచుడు, అనగనగా ఓ ధీరుడు, శక్తి, ఢమరుకంలాంటి సోషియో ఫాంటసీ ఆనవాళ్లతో ఎన్నో సినిమాలూ వచ్చాయ. కాకపోతే -ఈ తరహా చిత్రాల్లో చెప్పుకోదగ్గవి, చిరస్థాయగా మిలిగిపోయనవిగా కొన్నింటినే చెప్పుగలం.
ఇక -1991లో వచ్చిన ఆదిత్య 369 బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయి. ఒక శాస్తవ్రేత్త కనిపెట్టిన కాలయంత్రం (టైమ్‌మెషీన్)లో హీరో హీరోయిన్లు ప్రయాణించి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోవటం, అక్కడ జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనల సమాహారమే కథాంశం. సింగీతం దర్శకత్వ ప్రతిభకు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఎక్కడ చిత్ర విచిత్రమైన వస్తువున్నా దాన్ని సొంతం చేసుకోవాలనుకునే విలన్‌గా అమ్రిష్‌పురి నటన హైలెట్. కృష్ణకుమార్‌గా, శ్రీకృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్నీ అద్భుతంగా పండించాడు బాలకృష్ణ. శ్రీకృష్ణదేవరాయలు గెటప్‌లో బాలకృష్ణ హావభావాలు, ముఖ్యంగా స్పష్టమైన తెలుగు భాషా ఉచ్ఛారణ చెప్పుకోతగ్గవే. జంధ్యాల సంభాషణల్లో -పొట్టిపొట్ట, లవలేశమైననూ అర్థంకాలేదు, హతవిధీ, సంస్కృతం డైలాగులు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. ఏదేమైనా బాలకృష్ణకు భారీ విజయం అందించింది ఆదిత్య 369. ఈ చిత్రానికి సీక్వెల్‌లో బాలకృష్ణ వందో చిత్రం వస్తుందన్న ప్రకటనతో తెలుగు పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. రాబోయే సోషియో సీక్వెల్ స్టోరీ ఏమై ఉంటుందా? ఎలా తీర్చిదిద్దుతారోనన్న చర్చలు మొదలయ్యాయి.

1 దేవాంతకుడు (1960)
సోషియో ఫాంటసీ రుచిని తెలుగుకు పరిచయం చేసిన సినిమా. యమలోకంలోకి నరుడు అడుగుపెట్టడమనే కానె్సప్ట్‌కి శ్రీకారం. యముడిగా యస్వీఆర్, నరుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం.

2 ముత్యాలముగ్గు (1975)
ఉత్తర రామాయణాన్ని సోషలైజ్ చేస్తూ తెలుగు వాకిట బాపు తీర్చిదిద్దిన అందమైన ముగ్గు. ‘ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ’లాంటి పాటలతో కడుపునింపే విందు భోజనం. రావు గోపాలరావు డైలాగులు గ్రామ్‌ఫోన్ రికార్డులకెక్కిన సంచలనం.

3 యమగోల (1977)
హాలీవుడ్ సంచలనం -డెత్ టేక్స్ ఏ హాలిడే ఇన్‌స్పిరేషన్‌తో తెలుగులో నూరిన ఘాటుమసాలా. ‘చిలక కొట్టుడు కొడితే’ అంటూ కిర్రిక్కించే పాటలు, ఎన్టీఆర్ విశ్వరూపానికి వసూళ్ల వర్షం కురిసింది. నరకం నుంచి నేలకు దిగొచ్చిన యమధర్మరాజు, చిత్రగుప్తులుగా కైకాల, అల్లు పండించిన వినోదం అబ్బో అనాలి.

4 యముడికి మొగుడు (1988)
‘యమ’ ఫార్ములాను అందిపుచ్చుకుని సూపర్‌హిట్టు కొట్టిన చిరంజీవి మార్క్ చిత్రం. పాటలు హిట్టు. ఫైట్లు హిట్టుమీద హిట్టు. ఎన్టీఆర్‌కు సహకరించినట్టే చిరంజీవికీ యముడిగా కైకాల, చిత్రగుప్తుడిగా అల్లు సహకరించి ఆ పాత్రలకు -బ్రాండ్ అంబాసిడరు అయపోయారు.

5 జగదేకవీరుడు-అతిలోక సుందరి (1990)
ఈ సినిమాతో నరకాన్ని వదిలి స్వర్గాన్ని టార్గెట్ చేశాడు చిరంజీవి. స్వర్గ్ధాపతి దేవేంద్రుని కూతురు నరుడి ప్రేమలో పడితే.. -ఆ అందమైన ఊహను స్క్రీన్‌మీద ఆవిష్కరించిన సినిమా ఇది. ‘అబ్బనీ తీయని దెబ్బ’లాంటి పాటలతో తుపానులోనూ వసూళ్ల తుపాను సృష్టించిన చిత్రం. దేవకన్య ఇలాగే ఉంటుందన్న అందంతో శ్రీదేవి ప్రేక్షకులను కట్టిపడేసింది.

6 యమలీల (1994)
తల్లి ప్రేమ, యమపాశం చుట్టూ కథ తిప్పుతూ -కమెడియన్ ఆలీని హీరో చేసి దర్శకుడు యఎస్వీ కృష్ణారెడ్డి చూపించిన లీల. ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’లాంటి పాటలు ఆడియన్స్ చేత స్టెప్పులేయించాయి. ఉదాత్తమైన పాత్రలు, వినోదాత్మక సన్నివేశాలకో కిక్కునిచ్చిన చిత్రమిది.

7 అమ్మోరు (1995)
చిత్రం నిర్మాణానికే మూడేళ్ల కాలం. అనుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ను తీర్చిదిద్దడానికి అష్టకష్టాలు పడిన వైనం. దర్శకుడిగా కోడి రామకృష్ణలోని రెండో పార్శ్వాన్ని చూపిన కథనం. శ్యాంప్రసాద్ రెడ్డిని మేకర్ హీరో చేసిన చిత్రం. అందాల రమ్యకృష్ణను అమ్మోరుగా, అప్‌కమింగ్ హీరోయిన్ సౌందర్యను పరమ భక్తురాలిగా చూపించి హిట్టుకొట్టిన సినిమా.

8 దేవి (1999)
భక్తురాలిని కాపాడుకున్న నాగదేవత కథ. ఎమ్మెస్ రాజు భారీ వెంచర్. దర్శకుడు కోడి రామకృష్ణ మరోసారి చెలరేగిపోయిన గ్రాఫిక్స్ వండర్. నాగదేవత పాత్రలో ప్రేమ నటన అద్భుతం.

9 యమదొంగ (2007)
సెకెండ్ జనరేషన్‌కు రాజవౌళి రుచిచూపించిన మేజికల్ వండర్. తాత ఎన్టీఆర్ పీక్స్‌ను అందుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ పడిన తపన. స్వర్గంలో తాతా మనవళ్ల స్టెప్పులకు -్థయేటర్లలో విజిల్సే విజిల్స్. యముడిగా డైలాగ్ కింగ్ మోహన్‌బాబు మోగించిన మోత.

10 2009 (మగధీర)
గ్రాఫిక్స్ పల్స్ పట్టుకున్న రాజవౌళి -గ్రాండియర్ విజువల్స్‌తో సృష్టించిన సైక్లోన్. పునర్జన్మ నేపథ్యంలో అల్లుకున్న ప్రేమ కథతో వండివార్చిన ఎమోషనల్ డ్రామా. రెండో సినిమాతోనే రామ్‌చరణ్‌కు స్టార్ హోదా అందించిన హిట్టు మూవీ.

- మహాదేవ, బి గిరివాసు