Others

సోగ్గాడే.. ( మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో అందమైన పాత్రలతో ప్రత్యేకమైన తెలుగు యాసతో అసభ్యత, విశృంఖలత, హింస, ద్వంద్వార్థాలు మచ్చుకైనా కనిపించని చిత్రీకరణతో కుటుంబమంతా కలసి చూడదగిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. సినిమా మొదటినుండి చివరి దాకా పాజిటివ్ ఫీల్‌తో ఆహ్లాదకరంగా సాగి, మంచి అనుభూతినిచ్చింది. నిర్మాత, దర్శకుడు, రచయితల కృషి బాగుంది. పంచకట్టులో నాగార్జున ద్విపాత్రాభినయం సూపర్. నాగార్జున, రమ్యకృష్ణల కాంబినేషన్ భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి దర్పణంగా నిలిచింది. అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నాయి. ఇమేజ్ చట్రంలో సినిమాని బిగించి, ఫార్ములాకు అనుగుణంగా ఫైట్లు, డాన్సులు, ఐటెమ్ పాటలు దట్టించి పరమ చెత్త సినిమాలను నిర్మిస్తున్న వారికి మంచి సినిమాలు తీయడమెలాగో నాగార్జున నేర్పాడు.
- సి.సాయిమనస్విత, విజయవాడ

అర్ధమైందా?
నచ్చినా పనే చేస్తాడు. ఇష్టమొచ్చినప్పుడే పనిచేస్తాడు. లేదంటే నిద్రపోతాడు. జీవితం పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండటం అందరికీ సాధ్యంకాదంటూ పూరి జగన్నాథ్ వర్మను తెగ పొగిడేశాడు. కానీ వర్మ ఆలోచనా విధానం ఎంత చేటు చేస్తుందో పూరిజగన్నాథ్‌కు ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఈమధ్యనే తన వ్యక్తిగత సిబ్బంది సుమారు పాతికమందిని ఒకేసారి ఉద్యోగంలోంచి తొలగించినట్టు పూరి చెప్పాడు. ఎందుకంటే ఎవరూ ఆయన మాట వినడం లేదట. పైగా తమలో తామే వాదించుకుంటూ పనిని నిర్లక్ష్యం చేస్తున్నారట. ఒక టీమ్‌గా కలసి పనిచేయమని రెండేళ్ల క్రితమే చెప్పినా ఫలితం లేకపోవడంతో అందర్నీ తొలగించాడట. పని పట్ల నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అర్థం అయ్యిందా పూరీ?!
-ఎస్ కృష్ణ, కొండయ్యపాలెం

బాలరాజు
ఫ్లాష్‌బ్యాక్‌లో బాలరాజు మమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ప్రేక్షకులను ఎంతగా ఈ సినిమా ఉర్రూతలూగించిందీ అంటే హీరోలకు ఈ చిత్రంతోనే గ్లామర్ వచ్చింది. అభిమాన సంఘాలు లేకపోయినా హీరోను అభిమానించే వర్గాలు ఏర్పడతాయి. ఆరోజుల్లో పుట్టిన బిడ్డలకు బాలరాజు అని పేరుపెట్టుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. బాలరాజు, యలమంద ఓరోజు రాత్రి అడవిలో పడుకుంటే దోమలు యలమందను తెగ కుట్టి వేధిస్తాయి, కానీ బాలరాజు నిశ్చింతగా నిద్రపోతాడు. నాగేశ్వరరావుకి దోమల్లో కూడా అభిమానులున్నట్టున్నాయని అప్పట్లో చెప్పుకుని తెగ నవ్వుకునేవాళ్లు.
- పి.చంద్ర, కాకినాడ

కేరాఫ్ అడ్రస్
అయోమయం, గందరగోళానికి కేరాఫ్ అడ్రస్ అయిన సుకుమార్ నెం.1 నేనొక్కడినే సినిమాతో ప్రేక్షకులకు ఇచ్చిన షాక్ మరవక ముందే మరో షాక్ ఇచ్చాడు. నాన్నకు ప్రేమతో అంటూ వచ్చాడు. నాన్నకు ద్రోహం చేసిన వాడిపై పగతీర్చుకోవడమని పాత చింతకాయ పచ్చడి కథకు తనదైన శైలిలో ఎవరికీ అర్థం కాకుండా, గందరగోళం సృష్టించి, చివరికి ఈ సినిమా అసలు ఎందుకు దర్శకుడు తీశాడా అన్న ప్రశ్న ప్రేక్షకులకు కలిగేలా చేశాడు. సన్నివేశాలు, డైలాగులు అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులు డబ్బులిచ్చి మరీ కష్టపడాలా? తన మేధస్సుపై సుకుమార్‌కు నమ్మకం వుండొచ్చు, కానీ అది అతి విశ్వాసంగా మారి ప్రేక్షకులను ఇబ్బందిపెట్టేదిగా ఉండకూడదు. తను నిర్మాతగా తీసినా కుమారి 21 ఎఫ్ సినిమాలో ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకు లేదు?
-ఎం కనకదుర్గ, తెనాలి

ఇది తగునా?
నిన్నటి తరం సినిమాల్లో సమాజానికి, వ్యక్తిత్వ వికాసానికి, కుటుంబంలో, జీవితంలో మానవతా విలువలు పెంపొందించుకునేందుకు ఉపయోగపడే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చేవాళ్లు. ఆ సినిమాల్లో పాత్రల రూపకల్పన కూడా ఎంతో ఉదాత్తంగా, ఆదర్శప్రాయంగా ఉండేలా శ్రద్ధ తీసుకునేవారు. నేడు ఆ విలువలు, ఆదర్శాలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. అమ్మాయిల వెంట పడు, చదువు సంధ్యలు గాలికొదిలి పిచ్చి తిరుగుళ్లు తిరుగు, నిస్సందేహంగా మందుకొట్టు, పెళ్లయినా ఎంత మందితోనైనా రిలేషన్‌షిప్ పెంచుకో, ఎంత బరితెగించి తిరిగినా పరవాలేదు, తల్లిదండ్రులు, గురువులు, డాక్టర్లపై ఎన్ని కుళ్లు జోకులైనా వేయొచ్చు. ఇంట్లో వాళ్లని ఎదిరించి, ప్రేమ పేరుతో అన్ని విలువలకు తిలోదకాలిచ్చి ఎవరిని పడితే వాళ్లని పెళ్లిచేసుకోవచ్చు. లేదా ఇంట్లోనుంచి జంప్ అయి పోవచ్చు లాంటి సందేశాలను నేటి యువతీ యువకులకు ఇస్తున్నారు. నేటి యువతని ఓ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక సినిమాలో హీరో విలువలు, క్రమశిక్షణ, నిజాయితీ అంటూ మడికట్టుకు కూర్చుంటే జీవితంలో ఎదగలేవు అంటాడు. సినిమా వంటి అతి శక్తివంతమైన సాధనం ద్వారా తెలుగు సినిమా వాళ్లు ఇలాంటి సందేశాలు ఇవ్వడం తగునా?
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఆస్కారం లేదు
సువర్ణ సుందరి ఆస్కార్ బహుమతికి అర్హమైన సినిమా అంటూ వెనె్నల్లో వేసిన లేఖను చూసి, ఈ జాబు రాస్తున్నా. ఆ సినిమా ఎంత బాగా తీసినా సంగీతమే ప్రధానమైన బలం గలది. మల్లీశ్వరి వంటి మహత్తర కళాఖండమే ఆస్కార్‌కు ఎంపిక కాలేదు. దేవతా మూర్తులతో అల్లిన జానపద చిత్రం సువర్ణసుందరి. ఆ విధంగా ఆస్కారమే లేని చిత్రం. హిందీలో తీసినప్పుడు మహమ్మద్ రఫీ పాడిన ఒకే ఒక్క పాట ‘కుహుకుహు కోయిలయాబోలే’ అన్న పాట మహమ్మద్ రఫీ, లతా పాడినా, రఫీకి మాత్రమే నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారో చెబితే బాగుండేది.
లతా పాడిన ‘ముజ్‌నేబులా’ పాటకు ఫిలిమ్ ఫేర్ అవార్డు ఎంపికైంది. ఘంటసాలకు నేషనల్ అవార్డు రావాలనుకోవడంలో ఇప్పుడు కోరుకోవడంలో అర్ధం లేదు. మహమ్మద్ రఫీకన్నా ముందే ఘంటసాలకు పద్మశ్రీ ఇచ్చారు. గాయకులలో తొలిగా పొందినవారూ ఆయనే. భానుమతి, సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల భారతరత్నకు అర్హులే. కానీ చిత్ర విచిత్రమైన తూకాలవల్ల తూగలేకపోతున్నాం. అయినా అసాధ్యం మాత్రం కాదు.
- మున్నా మధుసూధన్‌రావు,
హైదరాబాద్