Others

నాకు నచ్చిన సినిమా (నీతి-నిజాయితీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతరులకు సహాయకారిగా వుంటూ నీతి నిజాయితితో మెలిగితే విజయం ఎప్పుడూ అతన్ని వెన్నంటి ఉంటుందని చెప్పే చిత్రం కాంచన ప్రధానపాత్రలో నటించిన ‘నీతి-నిజాయితీ’. మనిషికి పైపై మెరుపులు అవసరం లేదని, లోపలున్న గొప్పతనమే ఆ వ్యక్తికి సంఘంలో గౌరవాన్ని ఇస్తుందని ఈ చిత్రంలో చెప్పకుండా చెప్పారు. కథానాయకుడు మూగవాడైనా అతని వ్యక్తిత్వం చాలా గొప్పది. జమిందారుల ఇంటిలో పుట్టినా అతని మనస్సు పేదవారికి సహాయం చేయడానికి ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. అతనికి అదే భావాలున్న కథానాయిక తోడైంది. ఏమీ తెలియని అమాయకుడైన కథానాయకుడిని సంఘంలో ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతుంది కథానాయిక. ‘మాటలకందని భావాలు, మంచి మనసులు చెబుతాయి’, కవితలకందని భావాలు కంటి పాపలై చెబుతాయి’ అంటూ కథానాయిక, కథానాయకుణ్ణి ప్రతి విషయంలో ప్రోత్సహిస్తుంది. వెనె్నల మాటాడదు, మల్లిక మాటాడదు అయినా కానీ వెనె్నలను, మల్లెలను ఆస్వాదించని వారు ఎవరు? అని అడిగి కథానాయకునికి ధైర్యం నూరిపోస్తుంది. ఏనాడు పలకని దైవం ఈ లోకాన్ని ఏలుతుంది కదా? అలాగే నీవు కూడా మాటలు రాకపోయినా గొప్పవాడివి అవుతావని చెబుతుంది. విలన్ దాచిపెట్టిన వజ్రాల కోసం సినిమా అంతా సాగుతుంది. చివరికి ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయి? అనేదే సమస్య. ప్రపంచమంతా వెతుకుతాడు విలన్. చివరికి జమిందారు ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్, కుర్చీలు దాదాపు ఓ 20 ఉంటాయి. అందులో ఒక్కదాంట్లో వజ్రాలు ఉన్నాయని విలన్‌కు తెలుస్తుంది. ఆ ఒక్క కుర్చీ ఏది? అనే అనుమానంతో కుర్చీలన్నీ చించేస్తాడు. ఆ కుర్చీలలో వుండే దూది అంతా విలన్‌ను పిచ్చివాడిగా మార్చేస్తుంది. చివరికి ఆశబోతు విలన్ పతనవౌతాడు. ఏమీ తెలియని కడిగిన ముత్యంలా వుండే కథానాయకుడు చివరికి విజయాన్ని సాధిస్తాడు. ఎదుటి వాళ్ల గురించి ఏమీ తెలియకపోయినా పరవాలేదు. ప్రతీది తెలుసుకోవాలి అనుకోవటం కూడా చాలా తప్పు. నీతి నిజాయితీగా బ్రతికేవారికి ఏ ఇబ్బంది ఉండదని పరోక్షంగా ఈ చిత్రం చెబుతుంది. అందుకే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.

- బి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్