Others

పడిలేచిన నటుడు (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. అలనాటి తెలుగు నాటక రంగంలో చిరపరిచితమైన పేరు. సోదరుడు జె.వి.సోమయాజులుతో కలిసి కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి తెలుగు వారిని ఆనందపరచిన నటుడు. తర్వాత కాలంలో యన్.టి.రామారావు గిరీశం పాత్రలో వచ్చిన కన్యాశుల్కం చిత్రం కూడా నాటకమంత ప్రజాదరణ పొందక పోవటానికి కారణం -తెలుగు ప్రేక్షకులు ఆ నాటకంపై ఏర్పరచుకొన్న ప్రభావమే. యన్.టి.ఆర్ సైతం ఆ నాటకాన్ని తిలకించి -గిరీశం పాత్రను మా సినిమాలోకంటే బాగా చేశావు బ్రదర్ అని రమణమూర్తిని అభినందించటం జరిగింది.
అనుపమా ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ ఎడిటర్ నిర్మాత, దర్శకుడిగా మారి నిర్మించిన యమ్.యల్.ఏ. చిత్రం ద్వారా గిరిజ సరసన జోడిగా తెలుగు సినిమా రంగానికి రమణమూర్తిని పరిచయం చేసాడు. ఆ చిత్రం తర్వాత నటించిన అత్తా ఒకింటి కోడలే (దేవిక), మంచి మనసుకు మంచిరోజులు (రాజసులోచన), పెళ్ళితాంబూలం (జమున), బావ మరదళ్ళు (కృష్ణకుమారి) చిత్రాలలో తనకంటే సీనియర్ హీరోయిన్లతో నటించి మెప్పించగలిగాడు. తర్వాత చిత్రాలుగా మంచిచెడు, పెళ్ళిమీద పెళ్ళి, శభాష్‌రాముడు, ఆశాజీవులు తదితర చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. ఎంత బిజీగావున్నా తల్లిగారి ఆబ్దికము రోజు శ్రీకాకుళంలోని స్వంత ఇంట్లో అన్నదమ్ములు కలువటం ఆనవాయితీ.
అలా శ్రీకాకుళం బయలుదేరటానికి రైల్వేస్టేషన్‌కి వెళ్ళే సమయంలో దర్శకుడు బి.యన్.రెడ్డి దగ్గరనుంచి కరొచ్చింది పూజాఫలంలో ఒక గెస్ట్ పాత్ర కోసం. ఊరెళ్తున్న కారణంగా రెండురోజులలో కలుస్తానని చెప్పాడట రమణమూర్తి. వచ్చి కలిశాడు కూడా. ఆ సమయానికి పూజాఫలం చిత్రం షూటింగ్ మొదలుకాలేదు. కానీ తనలాంటి అగ్ర దర్శకుడు కబురంపగానే సమయానికి వచ్చి కలవలేదనే కోపంతో రమణమూర్తి నటించవలసిన ఇతర చిత్రాల నిర్మాతలు, దర్శకులకు ఫోన్‌చేసి రమణమూర్తి వేషాన్ని కాన్సిల్ చేయించారట. రమణమూర్తి సినిమా జీవితంలో నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అయినా చలించక తను నమ్ముకున్న రంగస్థలంపైనే కన్యాశుల్కం నాటక ప్రదర్శనలో బిజీ అయ్యాడు. తరువాత యం.యస్.గోపీనాథ్ దర్శకత్వంలో అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఔట్‌డోర్‌లో చంద్రమోహన్ డ్రైవ్ చేస్తున్న జీపు యాక్సిడెంట్‌లో రమణమూర్తి కాలికి బలమైన గాయమై మళ్లీ ఎక్కువ కాలం చికిత్సతోనే గడిచిపోయింది. తరువాత సిరిసిరిమువ్వ చిత్రంలో పూజారి పాత్రతో వచ్చిన రమణమూర్తి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తూ మురిపిస్తూనే ఉన్నాడు. అలాంటి సంకల్ప బలాన్ని ఒక కార్యక్రమంలో గుర్తు చేసుకుంటున్నప్పటి రమణమూర్తి చిత్రమిది...

-పర్చా శరత్‌కుమార్ 9849601717