Others

కొత్తగా చెప్పాలని.. డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి

రాజ్‌తరుణ్, అర్థన జంటగా రూపొందిన చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు. ఈ చిత్రంతో దర్శకుడిగా
పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ప్రతి సినిమానూ కొత్తగా చెప్పాలన్నదే తాపత్రయం అంటున్న గవిరెడ్డితో చిన్న చిట్ చాట్.

మీ నేపథ్యం?
పుట్టింది, పెరిగింది నర్సీపట్నంలోనే. ఇష్టమైన చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. మా ఊరినుంచే పరిశ్రమకు వచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇన్‌స్పిరేషన్‌తో ప్రయత్నం మొదలుపెట్టాను.
ఇక్కడికి ఎలా?
ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకుండా దర్శకుడ్ని కావాలన్న తపనతో వచ్చేసిన బాపతు నాది. హైదరాబాద్ రాగానే కృష్ణానగర్ కష్టాలు మామూలే.
ఎవరి దగ్గర పనిచేశారు?
2007లో నగరం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ని. తరువాత దర్శకుడు మదన్‌తో కలిసి ట్రావెల్ చేశా. బన్నీ దగ్గర ఏడాదిపాటు పనిచేశాను. వ్యక్తిగతంగా ఎంతో సాయం చేశారు.
పాతకథనే ఎంచుకున్నారు?
కొత్త కథ చేయాలనుకోలేదు. అనుకున్న కథనే కొత్తగా చెప్పాలని ట్రై చేశా. ప్రతివాడి జీవితంలో చిన్ననాటి ప్రేమ కథ ఒకటుంటుంది. నా లైఫ్‌లోనూ ఉంది. ఆ కథకే కెమెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి సినిమా కథ చేసుకున్నా.
రెస్పాన్స్ ఎంత?
గ్రామీణ నేపథ్యం సినిమా కనుక కుటుంబమంతా కలిసే చూశారు. కామెడీ బావుందన్న కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో క్రికెట్ ఎపిసోడ్‌ను బాగా ఎంజాయ్ చేశారు.
ప్రొడ్యూసర్స్?
వెరీ హ్యాపీ. అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న విధంగా తీశానన్న సంతృప్తి కలిగించారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ప్రోత్సాహం నాకో కొత్త ఉత్సాహం.
తన కోసమే కథ రాశారా?
సినిమా చూపిస్త మావ టైంలోనే ఈ కథ రాజ్ తరుణ్‌కు చెప్పాను. ఐడియా బావుందంటూనే ఓకే చెప్పాడు. చాలారోజులుగా రాజ్‌తరుణ్, నేను ఫ్రెండ్స్. ఆ నమ్మకంతో ఈ సినిమా చేశాడు.
నెక్స్ట్ ప్రాజెక్టు?
‘గరం’కు కథ, మాటలు ఇచ్చాను. ప్యూచర్ ప్రాజెక్టులు కొత్తగా ఉంటాయని చెప్పనుగానీ, కమర్షియల్ ఫార్మాట్ కథలను తెరకెక్కిస్తా.

-ద్వివేది