Others

అవార్డు కావాలా బాబూ... చెత్తయినా ఓకె!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను వరించిందే రంభ..! అన్నాడట వెనుకటికి ఒకడు? అలాంటి పరిస్థితే సినీ అవార్డుల్లోనూ కనిపిస్తుంది. హాలీవుడ్ నుండి దిగుమతి అయిన ‘చెడ్డ అవార్డులు’ యిప్పుడు బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ని సంపాదించుకుంటున్నాయి. ‘గోల్డెన్ కేలా’ పేరిట అందిస్తున్న ఈ అవార్డులను సైతం అందుకోవడానికి పరిశ్రమలోనివారు సిద్ధపడడం చూస్తుంటే పేరుకు తగ్గట్టుగానే ‘కోతికి అరటిపండు’ దొరికినట్టు అనిపించకమానదు.
పాపం! ఎవరు మాత్రం ఏం చేస్తారు?! పాపులారిటీ కోసం.. కమర్షియాలిటీ కోసం కోట్లు కుమ్మరించి తీసే సినిమాలు తస్సుమంటే ఉన్నది పోయింది.. ఉంచుకున్నదీ పోయిందన్న చందంగా చతికిలపడిన పరిస్థితుల్లో గోల్డెన్ కేలా అవార్డులు కొత్త ఊపునిస్తున్నాయనుకోవాలి. వీటికి ఈమధ్య క్రేజ్ పెరిగింది. ఏకంగా స్టార్లుగా చలామణి అయ్యేవారికే ఈ అవార్డులు వస్తుండటం ఓ విశేషం!
సరదాగా ఓ సాయంత్రం.. పెద్ద ఈవెంట్‌లో ఫ్లాప్‌ల మీద ఫన్ చేసుకుంటూ అవార్డులను ఎగరేసుకుపోవడానికి ఆసక్తిగా ఎదురుచూడటం కూడా అలవాటైపోయింది. కనీసం చెత్త అవార్డు సైతం రాకపోతే చిన్నబుచ్చుకునే స్థితి నెలకొంది. ఏదైతేనేం అవార్డు వచ్చిందా? లేదా అనే ఆలోచనను కూడా అలవాటు చేసేసుకుంటున్నారు. అవార్డు బూస్టప్‌నిస్తుందని భావిస్తున్నారు. పరాజయాలే విజయానికి తొలిమెట్టు అన్నట్లు ఊహించుకుని మరీ సిద్ధమైపోతున్నారు. ప్రస్తుతానికి బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ చెత్త అవార్డులు ప్రాంతీయ భాషలకు పాకకపోవడం గమనార్హం!
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ టీవీ చానళ్ళు సైతం అవార్డులతో సినీ ప్రముఖులను సత్కరించుకుంటూ వస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, టీవీ చానళ్లయతే ఈ ప్రోగ్రాంలతో సొమ్ములు బాగానే చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రమాణాల మాదిరి కాకుండా ప్రేక్షకుడినే జడ్జిని చేసేసి ఎస్‌ఎమ్‌ఎస్‌ల రూపంలో వాడి చేతి జిడ్డుతో కూడా సొమ్ములు చేసుకోవడంలో ఛానల్స్ ముందుంటున్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర అవార్డులంటే పైరవీలు అని భావించడం కామన్. ఈ పరిస్థితుల్లో ఏ అవార్డు అయితే ఏమిటి? వచ్చిందా లేదా? అన్న చందంగా సినీ జీవులు సిద్ధపడిపోవడం ఎక్కువైపోయిందనే చెప్పాలి. అందుకే చెత్త అవార్డులను సైతం ఘనంగా ఎనౌన్స్ చేయడంలో, వాటిని అందుకోవడం ఏ మాత్రం భయం, సిగ్గు కనిపించడంలేదు. పైగా చెత్త అనేది ఇచ్చేవారు చెప్పేమాట కాదు ప్రేక్షకదేవుడు ఇచ్చిన తీర్పు అన్నది సినీ జనమెరిగిన సత్యం కావడంతో ఏ ప్రాబ్లమ్ లేకుండా పోయింది.
ప్రస్తుతం ‘గోల్డెన్ కేలా’ అవార్డుల జాబితా బాలీవుడ్‌లో విడుదలయ్యింది. పరమ చెత్త చిత్రంగా దిల్‌వాలా ఎంపికయ్యింది. చెత్త హీరో హీరోయినులుగా సూరజ్ పంచోలి, సోనమ్‌కపూర్ విజయం సాధించారు. పరమ చెత్త దర్శకునిగా సూరజ్ బర్‌జాత్య ఎంపిక కాగా బాగా విసుగెత్తించిన పాటగా ప్రేమ్త్రన్ ధన్‌పాయో టైటిల్ సాంగ్‌నిలిచింది. చరిత్రను వక్రీకరించిన చెత్తగా హిస్టారికల్ ఆక్యూరసీ కేటగిరిలో బాజీరావు మస్తానీ అవార్డును సొంతం చేసుకుంది. ఎమ్‌ఎస్‌జి-2 సైతం చెత్త కేటగిరిలో చోటు సంపాదించుకుంది.
ఈ అవార్డులను పరిశీలిస్తే ప్రేమ్త్రన్ ధన్‌పాయో అత్యధిక కేటగిరిలలో అవార్డులను కొట్టేసి చెత్త రేసులోనే నెంబర్‌గా నిలవడం విశేషం! పైగా రాజశ్రీ, రెడ్ చిల్లీస్ వంటి అగ్ర సంస్థలతోపాటు సంజయ్ భన్సాలీ వంటి అగ్ర దర్శకులు దర్శకత్వం వహించిన చిత్రాలే చెత్త కేటగిరీలో వుండడం వీటి ప్రాధాన్యతను తెలుపుతుంది. ఏటా వందలాది సినిమాలు విడుదలయ్యే పరిశ్రమలో కనీసం చెత్త కేటగిరిలో కూడా అవార్డు రాకపోతే అవమానంగా భావించే రోజులు రానున్నాయా? అనిపిస్తుంది.
ఉత్తమ చిత్రాలు రిపీట్ రన్‌లో కలెక్షన్లను పెంచుకునే పరిస్థితి ఒకప్పుడు వుండేది. యిప్పుడు ఈ అవార్డులు చానల్‌లో ప్రసారమయ్యేటప్పుడు రేటింగ్‌కి ఉపయోగపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రీగా చూపించినా చూడవద్దు చూడవద్దు అని చెప్పే ప్రేక్షకుడికి చెత్త అవార్డు చిత్రం చూడాలనిపించేలా చేస్తుంది. చెత్త అవార్డు చిత్రాల ఎంపికలో భవిష్యత్‌లో కాంపిటీషన్, పైరవీలు నడిచినా ఆశ్చర్యపడనక్కరలేదు.
ఇలాంటి ఫ్లాప్‌లకు అవార్డులు లభించడంవల్ల మా హీరోకు ఫ్లాపుల్లో సైతం అవార్డులొచ్చాయని ఫ్యాన్స్ కాలరెగరేసి చెప్పుకునే స్థితి వస్తుంది. నా సినిమా చెత్తా? అని ప్రశ్నించే స్థాయిని వదిలేసి నా సినిమా చెత్తలోనూ బెస్ట్ అని చెప్పుకునే నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు పోటీపడిపోవడం ఖాయం. ఇప్పటికే దక్షిణాది పరిశ్రమలో డజనుకుపైగా అవార్డు ఉత్సవాలు హల్‌చల్ చేస్తున్న తరుణంలో త్వరలో ఏదో ఒక సినీ అభిమాన సంస్థ చెత్త అవార్డుల ఫంక్షన్‌ని కూడా తెరపైకి తెస్తాదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. చెత్త సినిమా తీసానని వెనుతిరిగి పోకుండా వుండేందుకు యిదీ ఓ రకమైన ప్రోత్సాహమేమో! వేచి చూద్దాం!

-బాసు