Others

లవ్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్స్ అన్న తరువాత ముద్దూ ముచ్చట.. కొట్లాట కీచులాటా మామూలే. అందులోనూ సెలబ్రిటీస్ లవ్ అంటే -వీటి మోతాదు కాస్త ఎక్కువే ఉంటుంది. అంతేకాదు, వీలైతే కొంత ఇగో.. కుదిరితే కప్పు కాక ఉండటం సహజం. అందుకే ప్రేమను ప్రదర్శించినపుడు ఇచ్చే గిఫ్ట్‌లూ అతే మోతాదులో ఉంటాయ. కొట్లాడుకున్నపుడు ఇద్దరి మధ్యా కోపాలూ అంతే శ్రుతిలో ఉంటాయ. ఇదంతా బాలీవుడ్ హాట్ లవ్ జంట అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లిల గురించే. ఇద్దరి మధ్యా పబ్లిక్‌గానే ప్రేమాయణం నడిచింది. తరువాత పొరపొచ్చాలు వచ్చాయ. తూచ్ నీకూ నాకూ సంబంధం లేదన్నట్టు దూరందూరంగా ఉన్నారంటూ వార్తలూ వచ్చాయి. తూచ్ తూచ్ మేమిద్దరం సెట్ అయపోయాం అంటూ తాజా షాకిస్తున్నారు. ‘సుల్తాన్’ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్న అనుష్కకు విరాట్ ఘాటు సెండాఫ్ ఇచ్చాడట. స్వయంగా తన కార్‌లో ఎయిర్‌పోర్ట్‌వరకు డ్రాప్ చేసి, అక్కడే ముద్దూముచ్చటతో గిచ్చికాలను తుడిచేశారట. ఇటీవలే అనుష్క పుట్టినరోజున విరాట్ కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడట. అంటే ఇద్దరూ కలిసిపోయారన్న మాట. కాదుకాదు, సయోధ్య కుదిర్చి సుల్తానే.. అదేనండి సల్మానే కలిపేశాడన్న మాట.