Others

రంగ రంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘటోత్కచుడు ఎలా ఉంటాడు? నేపాళ మాంత్రికుడు ఎలా ఉంటాడు? హిరణ్యకశిపుడు ఎలా ఉంటాడు? అప్పాపురం జమీందారుగారూ, రత్తయ్యగారు ఎలా వుంటారు? వీళ్ళంతా ఎలా ఉంటారో మనకు తెలీదు. ఎస్వీ రంగారావుగారు ఎలా ఉంటారో తెలుసు. ఆయన తెలిస్తే, పైవాళ్ళంతా తెలిసినట్టే. స్పురద్రూపం, గంభీరమైన కంఠస్వరం, అలవోకగా భావాలు పలికే వాచకం.. ఆయన్ను అభిమానించనివారు ఎవరుంటారు? వాళ్ళలో నేను కూడా వున్నందుకు గర్వంగా వుంటుంది.
మా ఊరి నెహ్రూనగర్ రెండో లేను చివర్లో ఒకరోజు హఠాత్తుగా ఓ నిలువెత్తు విగ్రహం వెలిసింది. చూస్తే వొడలు పులకరించాయి. ఘటోత్కచుడి వేషంలో వున్న రంగారావుగారి విగ్రహం అది. ఆ విగ్రహం ముందే నిలబడి, తదేకంగా ఆయనే్న చూడాలనిపిస్తుంది. జీవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా విగ్రహంలో. ‘సాహసం శాయరా డింభకా! రాజకుమారి లభించునులే!’అని ఆయన గొంతు ఖంగున మోగుతున్నట్టే వుంటుంది.
భారతీయ కళారంగానికి వనె్నలద్దేందుకే రంగారావులూ, రామారావులూ పుడతారు. కాక, ఇంకేం పనుంది వారికి? ఆ పనిమీదే వచ్చారు. నూరు శాతం పని పూర్తిచేసుకుని వెళిపోయారు. మనమంతా వారి విగ్రహాల్ని పెట్టుకుని, వారినుండీ స్ఫూర్తి పొందే పని పెట్టుకుంటాం.
నావరకూ నేను మూడోలైన్లో పనుంటే, పనిగట్టుకుని రెండో లైనుగుండా వెళ్తాను. ఆయన్నోసారి చూసిపోదాం అనిపించడంవల్ల ఆటోమాటిగ్గా నడక రెండో లైనుకు తిరుగుతుంది. విగ్రహాన్ని చూడగానే ఆయన నన్ను ‘ఎలా ఉన్నావురా డోంగ్రే!’ అని పలకరిస్తారు. ఆ విగ్రహాన్ని తయారుచేసిన శిల్పి చాతుర్యం మొదలుకుని, దాన్ని అక్కడ శ్రమకోర్చి ఏర్పాటుచేసిన కళాభిమానుల అంతరంగంవరకూ నాకు ప్రతీది గొప్పగా తోస్తుంది.
ఓరోజు దూరప్రాంతం నుండీ నా మితృడొకడు వచ్చాడు. వాడికి ఊళ్ళో ఉన్న విశేషాలు అన్నీ చూపించాక చివరిగా, ‘నీకో అద్భుతం చూపిస్తానురా!’అంటూ తీసుకెళ్ళి రంగారావుగార్ని చూపించాను. వాడా విగ్రహాన్ని ఎగాదిగా చూసి, ‘ఇందులో విశేషం ఏముంది? మా ఊళ్ళో కూడా ఆ కులంవాళ్ళు ఉన్నారు. అక్కడకూడా ఈయన విగ్రహం పెట్టారు. ఇదొక్కటే కాదు, అల్లుగారి విగ్రహం కూడా పెట్టారు. తమ కుల గౌరవాన్ని పెంచిన గొప్పవారి విగ్రహాలను పెట్టుకోవడం ప్రతి కులం లోనూ, ప్రతి ఊరిలోనూ ఉన్నదే! అదేం తప్పుకాదు’ అని తేల్చేశాడు. నాకు ఈడ్చి ముఖంమీద తన్నినట్టు అయింది. నోట మాట రానట్టు రంగారావుగారి ముఖంకేసి చూస్తుండిపోయాను. ఇది కుల విగ్రహమా? కళారంగ ప్రతిరూపం కాదా? రంగారావుగార్ని ఎందుకింత చిన్నబుచ్చారు? విశ్వజనీనమైన కళాకౌశలాన్ని కులానికి పరిమితం చెయ్యడం ఏం న్యాయం? ‘‘కులములోననొకడు గుణవంతుడు...’’- చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తొచ్చింది. నిజమేనా? ఏ ఒక్క వ్యక్తి వల్లో ఒక కులం గొప్పదనం బైటపడినట్టు అయితే, ఆ కులంలో పుట్టిన నేరస్తుల, హంతకుల మాటేమిటి? వారివల్ల ఆ కులం భ్రష్టుపట్టినట్టు భావించాలా? కాదుకదా, మరెందుకు పెద్దవిగ్రహాలను పెట్టి ఆ వ్యక్తుల్ని చిన్నవారిని చేస్తున్నారు? ఏదేమైనా, ఆ తర్వాత నేనెప్పుడూ పనుంటే తప్ప రెండో లైనుకు వెళ్ళలేదు. రంగారావుగారిప్పుడు నా గుండెల్లో మాత్రమే ఉన్నారు. ఆయన పట్ల నాకున్న అభిమానమంత పెద్ద సైజులో.

-బాలకృష్ణ, సికిందరాబాద్