Others

తోడూ నీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.టి.ఆర్, భానుమతి, ఎస్.వి.రంగారావు, జమున వంటి అగ్ర తారలతో ఆదుర్తి సుబ్బారావు (దర్శకుడు) రూపొందించిన అద్భుత చిత్రం ‘తోడూ-నీడ’. ఈ చిత్రాన్ని విజయ్‌భట్ మూవీస్ వాళ్లు నిర్మించారు. అతిరథ మహారథులు పనిచేశారు. సముద్రాల, ఆచార్య ఆత్రేయ, కె.వి.మహదేవన్, సుశీల, ఘంటసాల, ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ వంటివారు ఈ చిత్రం ఔన్నత్యాన్ని పెంచారు. కథ మన మనసు లోతుల్ని తాకుతుంది. కె.ఎస్.గోపాలకృష్ణన్ (తమిళ రచయిత కాబోలు) చక్కగా కథ రాశారు. పాత్రల ఔచిత్యాన్ని పెంచారు. ప్రతి పాత్రా మనకు సందేశాన్నిస్తుంది. జమున తన సోదరుడి కూతుర్ని తల్లికన్నా మిన్నగా పెంచుతుంది. భానుమతి తనకు మనసివ్వని భర్తతో తన స్నేహితురాలి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి విజయం సాధిస్తుంది. ఇక ఎన్.టి.ఆర్. పాత్ర మామగారికోసం తననుతాను త్యాగం చేస్తారు. ఎస్.వి.రంగారావు అంతా మనవాళ్లే. అందరినీ అభిమానించాలి. అందరినీ అక్కున చేర్చుకోవాలి. మనదగ్గర పుష్కలంగా ఉన్న అభిమానాన్ని అందరకీ పంచాలి అనే తత్వం జమున ఆత్మకూడా మనకు సందేశాన్నిస్తుంది. నన్ను మర్చిపో.. వేరొకరి రూపంలో చేరవచ్చినది నేనే. తన స్థానంలో ఉన్న స్ర్తిని ఆదరించమని భర్తకి చెబుతుంది.. వేడుకుంటుంది. ఇక పాత్రల విషయానికి వస్తే అమృత గుళికలు... మన మనసుని తాకే పాటలు, అత్తఒడి పువ్వువలె మెత్తనమ్మా, మళ్లున్నా మాన్యాలున్నా, ఎన్నో రాత్రులు వస్తాయి, శోభనం పాట భానుమతి ఎలా పాడారబ్బా? అనుకుంటాం. ఎంతగొప్పగా ఉంటుందో సాహిత్యం. మల్లెల మంచం పిలిచింది. ఊయల త్వరలో రానుంది.. అంటూ సాగుతుంది. వలపులోని చిలిపితనం ఇదేలే... అన్నీ మన మనసుల్ని సేద తీరుస్తాయ్. ఆహ్లాద పరుస్తాయ్. మంచి హృదయమున్న సినిమా చూశామన్న తృప్తిని కలిగిస్తాయ్. అందుకే నాకు ఈ సినిమా అంటే అంత ఇష్టం.
-బి.మోహనకుమారి, చెన్నయ్