Others

‘మనసులేని బ్రతుకొక నరకం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్గీయ ఎఎన్‌ఆర్-వాణిశ్రీల జంటతో వచ్చిన ‘సెక్రటరీ’ చిత్రంలోని ‘మనసులేని బ్రతుకొక నరకం’ పాట రాసింది స్వర్గీయ మనసుకవి ఆత్రేయ. రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను ఏడిపించే ఆత్రేయకు ఈ పాట రాసినందుకు పాదాభివందనం చేస్తూ ‘మనసులేని బ్రతుకొక నరకం’ అన్న పాటలో స్వర్గీయ ఎఎన్‌ఆర్ ‘కన్నీరు’ పెట్టిస్తారు. మనసును భగ్నంచేసే ఈ పాట అంటే నాకు ప్రాణం. పాటలోని చరణాలు గుండెకు హత్తుకుపోతాయి. ‘మనసులేని బ్రతుకొక నరకం-మరువలేని మనసొక నరకం, మనిషికెక్కడ ఉన్నది స్వర్గం- మరణమేనా దానికి మార్గం..’ అంటూ మంచిమనసుతో ప్రేమించేవారికి చివరకు మరణమే శరణ్యం అంటూ హృదయాన్ని భగ్నంచేశారు. ఈ పాటలోని ఈ చరణం కన్నీరు కురవాల్సిందే. ‘మనసనేది మరొకరికి ఇచ్చినప్పుడే తెలిసేది, దాచుకుంటే ఎవరికి అది దక్కకుండా పోతుంది- ప్రేమనేది నీకునీవే పెంచుకుంటే పెరిగేది, పంచుకునే ఒక మనసుంటేనే బంధమై అది నిలిచేది’ అంటూ రాస్తే గుండె కరిగిపోయింది. ‘మరవలేనిది మాసిపోదు- మాసిపోనిది మరలిరాదు.’ ‘రాని దానికై కన్నీళ్ళు, రాతి బొమ్మకు నైవేద్యాలు’ అంటూ ప్రేమను వంచించిన వారిని ఉద్దేశించి రాయడం అదిరింది. ఇంకా ఆత్రేయ ఆఖరి చరణంలో ‘తరుముకొచ్చే జ్ఞాపకాలు ఎదను గుచ్చే గులాబిముళ్ళు’ గురుతుతెచ్చే అందాలు- కూలిపోయిన శిల్పాలు ‘కన్ను నీదని వేలు నీదనీ’ పొడుచుకుంటే రాదా రక్తం, రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం’ అంటూ ప్రేమను భగ్నం చేసే వారికోసమే రాసిన ఈ పాట ప్రేమించిన వాళ్లకు గుణపాఠం అయ్యి మనస్సులేని బ్రతుకు నరకం మనల్ని ప్రేమించలేని వారికి అది స్వర్గంగా భావిస్తూ ప్రేమ ఫలించేదాకా ఎదురుచూడలేని ఆత్రేయగారు తన కలం ద్వారా ఈ పాట రాస్తే ఘంటసాల గొంతుతో ఈ పాట పరవశమై స్వర్ణం లాగా మెరిసిపోయింది.

-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి