జాతీయ వార్తలు

రాజకీయ దురుద్దేశంతోనే సెక్షన్ 8 అడుగుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి సర్కార్‌పై వేణుగోపాలచారి మండిపాటు

న్యూఢిల్లీ, మార్చి 17: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలని ఏపి అసెంబ్లీ తీర్మానించడాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తప్పుపట్టారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి కష్టం లేకపోయినా ఏపిలోని తెలుగుదేశం ప్రభుత్వం సెక్షన్ 8 గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి రాజకీయం చేస్తోందని వేణుగోపాల చారి ధ్వజమెత్తారు. సెక్షన్ 8ని అమలు చేయాలని కోరడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటని ఆయన నిలదీశారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాం తాలు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఈ విష యం తెలుగుదేశం నేతలకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతుంటే టిడిపి ఇలా సెక్షన్ 8 గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నా రు. ఎన్‌డిఏ ప్రభుత్వంతో పోరాడ లేక హైదరాబాద్‌ను వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధి విమర్శించారు. హైదరాబాద్‌లో శాంతి, భద్రతలను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే ఏపి ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని ఆయన ఆరోపించారు. ఏపికి ఎన్ని పథకాలు ఇచ్చినా తాము వ్యతిరేకించబోమని, తెలంగాణకు న్యాయపరంగా రావలసిన పథకాలు, నిధుల కోసం పోరాడుతామని చారి ప్రకటించారు.