రాష్ట్రీయం

నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(85) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మంగళవారం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 28, 1932న వరంగల్ జిల్లాలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మీ దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళారంగంలో వేణుమాధవ్ ప్రవేశించారు. ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. 1971లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేణుమాధవ్.. ఎమ్మెల్సీగా సేవలందించారు. నేరెళ్ల పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.