రాష్ట్రీయం

ఎంఐఎం కాంగ్రెస్‌తోనే లాభపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒవైసీ కుటుంబంపై విరుచుకుపడ్డ సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్
హైదరాబాద్, డిసెంబర్ 26: మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే లాభ పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో దోస్తీ చేసి లాభపడిన ఎంఐఎం తెలంగాణ ఏర్పడగానే టిఆర్‌ఎస్ గెలవాలని ఆ పార్టీ పంచన చేరిందని విహెచ్ ఘాటుగా స్పందించారు. శనివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంఐఎం పార్టీపైనా, ఒవైసీ కుటుంబంపైనా విరుచుకుపడ్డారు. ఒవైసీ కుటుంబానికి దారుస్సలాంతో పాటు పలు విద్యాసంస్థలు చేకూరాయని, అలాంటి ఒవైసీ కుటుంబం పేద ముస్లింలకు చేసిందేమిటో చెప్పాలని విహెచ్ ప్రశ్నించారు. అసలు ఒవైసీ కుటుంబానిది హైదరాబాదే కాదని అన్నారు.