జాతీయ వార్తలు

తెలంగాణ గురించి మాట్లాడరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి కాంగ్రెస్ ఎంపీలకు విహెచ్ ప్రశ్న
న్యూఢిల్లీ, మార్చి 17: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు అమలు కోసం రాజ్యసభలో టి కాంగ్రెస్ ఎంపీలు మద్దతిస్తుంటే, ఏపి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు మాత్రం తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావ వాపోయారు. విభజన జరిగి రెండేళ్లయినా హామీలు అమలులో ఎన్‌డిఏ సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు ఇవ్వాడాన్ని, కేంద్రీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణ గురించి పట్టించుకోవడమే లేదని విహెచ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. హైకమాండ్ ద్వారానే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని ఆయన అన్నారు.