తెలంగాణ

ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఆదేశాలివ్వలేం: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నంత మాత్రాన నిందితులపై చర్యలు తీసుకోవాలని తాము ఆదేశాలివ్వలేమని తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి వీసీ అప్పారావును, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భావోద్వేగాల కారణంగా దేన్నీ విచారించలేమని, నిబంధనల ప్రకారం వీసీని ఎలా తొలగించాలో చెప్పాలంటూ కోర్టు ప్రశ్నించింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.