హైదరాబాద్

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి పార్టీ శ్రేణులు పనిచేయాలని గ్రేటర్ హైదరాబాద్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బర్కత్‌పురాలోని నగర పార్టీ కార్యాలయంలో నగర పదాధికారులు, కన్వీనర్లు, మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌లో కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన కమిటీలతో సైతం సమన్వయం మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దీనికని తోడు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కోర్ కమిటీ సమావేశాలను నియోజకవర్గం కన్వీనర్లు నిర్వహించి, మిత్రపక్షంతో సమన్వయాన్ని ఏర్పర్చుకోవాలని సూచించారు. మిత్రుల మధ్య చక్కటి సమన్వయాన్ని ఏర్పర్చుకుని ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలన్నారు. త్వరలోనే బిజెపి, టిడిపిలకు సంబంధించి నగర స్థాయిలో ఓ సమన్వయకమిటీని ఏర్పాటు చేసి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్త్రృంగా ప్రచారం చేసి బిజెపి పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. నేతలు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని పలుపునిచ్చారు. ఎప్పటికీ ప్రజల వెంట ఉండే పార్టీ బిజెపి పార్టీ మాత్రమేనని ప్రజలకు విస్త్రృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, ప్రధాన కార్యదర్శులు భవర్‌లాల్ వర్మ, ఎక్కా నందు, సహదేవ్‌యాదవ్, రమేష్ యాదవ్, వైకుంఠం, దిడ్డి రాంబాబు, మహిళా నేతలు బంగారి రాధిక, కవిత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

15 పులులను దత్తత తీసుకున్న ఎస్‌బిహెచ్
నార్సింగి, డిసెంబర్ 11: నెహ్రూ జూపార్కులోని 15 పులులను యేడాదిపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దత్తత తీసుకుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నెహ్రు జూ పార్కులోని 15 పులులను యేడాది పాటు దత్తతను తీసుకున్నారు. ఒక్కొక్క పులికి ఒక లక్ష చొప్పున యేడాది పాటు దత్తత తీసుకున్నారు. ఎస్‌బిహెచ్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య జూ పార్కు క్యూరేటర్ జి.రవికి 15 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ జూ పార్కులోని అన్ని జంతువులను దత్తత తీసుకునే అవకాశం ప్రజలకు కల్పించామని తెలిపారు. అయితే ఇప్పటికే చాలా సంస్థలు జంతువులను దత్తత తీసుకున్నాయని పేర్కొన్నారు. పదిహేను పులుల కోసం పదిహేను లక్షలు అంజదేసిన ఎస్‌బిహెచ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిహెచ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.