జాతీయ వార్తలు

మార్కెట్లోకి అత్యాచార వీడియో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల క్రితం యుపిలో దారుణం
న్యూఢిల్లీ, నవంబర్ 21: దేశంలో అత్యాచారాలకు నెలవుగా మారిన ఉత్తరప్రదేశ్‌లో బిటియా అనే 15 ఏళ్ల దళిత బాలికపై రెండేళ్ల క్రితం అగ్రవర్ణానికి చెందిన నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడమే కాకుండా ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించి మార్కెట్లో అమ్మేశారు. దీంతో షాక్‌కు గురై పెదవి విప్పలేకపోకపోయిన బాధితురాలు ఎట్టకేలకు తేరుకుని ఆ కామాంధులపై న్యాయ పోరాటానికి ఉపక్రమించింది. 2012లో 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో బిటియాను పాఠశాల నుంచి గెంటేయడం ఆమెను మరింత కుంగదీసింది. అయితే ప్రపంచంలో మహిళల దైన్యస్థితిపై శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో బిటియా నోరు పెగల్చుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ‘పాఠశాలలో ఉపాధ్యాయులు నన్ను నిందితురాలిగా పరిగణించారు. నా వలన ఇతర విద్యార్థులపై దుష్ప్రభావం పడుతుందని పాఠశాల నుంచి గెంటేశారు. ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ గ్రామస్థులు కూడా నాపై వత్తిడి తీసుకువచ్చారు’ అని ఆమె వాపోయింది. ఈ వ్యవహారంలో తొలుత పోలీసులు తమకు సహకరించేందుకు నిరాకరించారని, అలాగే తమ న్యాయవాది కూడా నిందితుల నుంచి లంచాలు తీసుకుని సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని బిటియా తల్లి వెల్లడించింది. బిటియా సామూహిక అత్యాచారానికి గురైన వీడియోను మార్కెట్లో అమ్ముతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక తన భర్త గుండెపోటుతో మరణించాడని తెలిపింది.