జాతీయ వార్తలు

వీడియోకాన్ ఆఫీసుల్లో సీబీఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు ఐసీసీఐ అక్రమంగా రుణాలు మంజూరు చేసిందనే అరోపణలకు సంబంధించి గురువారంనాడు సీబీఐ వీడియోకాన్ ఆఫీసులపై దాడులు నిర్వహించింది. ముంబయిలోని వీడియోకాన్ అధిపతి వేణుగోపాల్ దూత్ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. 2012లో వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ 3250 కోట్ల రుణాలు మంజూరుచేసిన విషయం విదితమే. ఈ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఇఓ చందాకొచ్చార్ తన భర్త దీపాకొచ్చర్ ఒత్తిడి వల్ల అక్రమ పద్దతిలో మంజూరు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు చందాకొచ్చర్ భర్తపై కేసు సైతం నమోదు అయింది. చందాకొచ్చర్ తన పదవికి రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. వీడియోకాన్‌ రుణాలకు సంబంధించిన కేసులో నిందితులుగా ఆరోపిస్తూ ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీడియకాన్‌ గ్రూప్స్‌ ఎండీ వేణుగోపాల్‌‌ ధూత్‌పై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.