కృష్ణ

పూలే వంటి మహానీయుల స్ఫూర్తితో ఆర్టీసీలో సమసమానత్వం కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: జ్యోతిరావుపూలే వంటి మహానీయుల స్ఫూర్తితో ఆర్టీసీలో సమసమానత్వం కోసం తన వంతు కృషి చేస్తున్నానని ఎపిఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సోమవారం జరిగిన జ్యోతిరావుపూలే జయంతి సభలో సాంబశివరావు మాట్లాడారు. ఎవరినీ అనుసరించకుండా ఎవరికీ చెప్పకుండా తనకు తానుగా సామాజిక రుగ్మతలను రూపుమాపటానికి నడుం కట్టిన జ్యోతిరావుపూలే మహానీయుడన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఆ స్ఫూర్తితోనే ఎయిర్‌పోర్టును ఏనాడు చూడని పేదలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ బస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నామన్నా రు. కార్మికుల గురించి ఎందరెందరో ఏదో మాట్లాడుతుంటారు. ఆపై తమ దారిన తాము వెళుతుంటారు. అలా కాకుండా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తన అభిమతమన్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల ఇక ప్రత్యేక శ్రద్ధ వహించబోతున్నామన్నారు. అంతే కాకుండా బస్సు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడటం లేక మరణించడం జరిగినప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకై ప్రత్యేక బీమా సదుపాయాన్ని తీసుకురానున్నామన్నారు. ఆర్టీసీలో మున్ముం దు పెనుమార్పులు రానున్నయన్నారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మరో ఇడి కోటేశ్వరరావు, బిసి సెల్ నేత రంగారావు, ఇన్‌చార్జి రీజనల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. సభానంతరం మై థియేటర్ యాప్‌ను, గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయాన్ని నండూరి ప్రారంభించారు.