కృష్ణ

ఇ-పోస్‌తో పారదర్శకంగా నిత్యావసరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: ఇ-పోస్ విధానం ద్వారా నిత్యావసర సరుకులను సకాలంలో లబ్ధిదారులకు అందించడం పట్ల ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్త చేస్తున్నారని రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాలు, ధరల సమీక్ష, వినియోగదారుల వ్యవహాల మంత్రి పరిటాల సునీత అన్నారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ (ఆహార సలహా సంఘం) సమావేశం బుధవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో మంత్రి పరిటాల సునీత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా కచ్ఛితంగా నిత్యావసర సరుకులు అందించాలనే ధ్యేయంతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఇ-పోస్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. విధానాన్ని అమలు చేయడం ద్వారా 30వేల మెట్రిక్ టన్నులు పొదుపు చేయడం వల్ల రూ. 300 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందన్నారు. ప్రతి నెలా 1 నుండి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు తెరచి ఉంచి నిత్యావసర సరుకులను ప్రతి కార్డుదారునికి అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసామన్నారు. కొన్ని జిల్లాల్లో అవసరమైన మేరకు రెండు రోజులైన పొడగించి సరుకులను లబ్ధిదారులకు అందించాలని కోరామన్నారు. ఇ-పోస్ విధానం ద్వారా ఈ మాసంలో ఇప్పటి వరకు 87 శాతం నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రతి నెల చివరి పదిరోజులు ఎమ్‌ఎల్‌ఎస్ ఫాయింట్స్ వద్ద నుండి చౌక ధరల దుకాణాల డీలర్లు సరుకులను తరలించుకొనేందుకు సరిపడ సమయముంటుందని మంత్రి తెలిపారు. 2015, ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించిన ఇ-పోస్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా 28,942 చౌక ధరల దుకాణాల్లో అమలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి, 40 రేషన్‌కార్డులు ఉన్నాయని వీటికి కొత్తగా మరికొన్ని రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పార్టీలకు అతీతంగా రేషన్‌కార్డులు, దీపం కనెక్షన్లు అర్హతగల ప్రతి ఒక్కరికీ అందజేస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కేవలం 25వేల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఇచ్చారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో 12 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసామని మరో 30 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2017 నాటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ అందజేస్తామన్నారు. చౌక ధరల దుకాణాల డీలర్లు కమిషన్ పెంచే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్స్ వద్ద ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేసి డీలర్లకు అందిస్తామని తెలిపారు. ఏజన్సీ ప్రాంతాల్లో 625 చౌక ధరల దుకాణాల్లో సాంకేతిక కారణాలు వలన ఇ-పోస్ అమలు చేయడంలేదని తెలిపారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కరికాల వలవన్ మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టంలో పేర్కొన్న విధంగా అందరికీ సక్రమంగా నిత్యావసర వస్తువులు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే తొలిసారిగా మన రాష్ట్రం ఇ-పోస్ అమలు చేస్తుందని అన్నారు. ఈ విధానం ద్వారా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వంత భవనాలు లేని వినియోగదారుల ఫోరంకు త్వరలో నిర్మాణాలకు చర్యలు చేపట్టనున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి రవిబాబు మాట్లాడుతూ ఇ-పోస్ పోర్టబులిటి విధానం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నైనా సమీప చౌకధర దుకాణం నుండి రేషన్ తీసుకోవచ్చునని ఆయన తెలిపారు. వెహికల్ ట్రాకింగ్ విధానం ద్వారా ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్ నుండి డీలరు షాపుల వరకు సరుకులు చేరవేసే వాహనాల కదలికలను పసికట్టడం జరుగుతుందన్నారు. ఎపి సివిల్ సప్లైయిస్ కార్పొరేషన్ చైర్మన్ ఎం లింగారెడ్డి మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వానికి భారం అయినప్పటికీ ధాన్యం సేకరణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చివరి కార్డుని వరకు ఆక్రమాలకు తావులేకుండా సక్రమంగా అందేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతల 5 కోట్ల జనాభాలో 98 శాతం ఆధార్ కలిగి వున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు అందిస్తామన్నారు. కమిటీ సమావేశంలో సభ్యుల సలహాలు సూచనలు పరిగణలోనికి తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. శాసనమండలి సభ్యులు పిజి చంద్రశేఖరరావు మాట్లాడుతూ కిలో రూపాయికే సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతను కలిగి ఉండాలన్నారు. ప్రతి నెల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే తేదీలు స్పష్టంగా ఉండాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఇ-పోస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి నెలా 20వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని, వంట గ్యాస్‌లో నగదు బదిలీ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రతి రెండు నెలలకు విధిగా ఆహార సలహా సంఘం సమావేశాలు జరపాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు వారి సలహాలు, సూచనలు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ అనురాధ, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, చౌక ధరల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.

ఎన్జీవోస్ మొవ్వ శాఖ కార్యవర్గం ఎన్నిక
కూచిపూడి, ఏప్రిల్ 13: ఏపి ఎన్జీవోస్ మొవ్వ శాఖ నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బి రాజేంద్రకుమార్ ప్రకటించారు. మొవ్వ ఎంపిడివో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మొవ్వ, ఘంటసాల మండలాల ఎన్జీవోస్ సర్వసభ్య సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఉల్లి కృష్ణ ముఖ్య అతి