కృష్ణ

నవ నిర్మాణ దీక్ష అదిరిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: నవనిర్మాణ దీక్షలో భాగంగా గురువారం జరగబోయే సంకల్ప దీక్ష స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పలు సూచనలను చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30,000 మందికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ముందుగానే సిద్ధం చెయ్యాలని ఆ సమయంలో పంపిణీ చేసేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా వైద్య శిబిరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. డివి మేనర్ హోటల్ నుంచి బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజలతో కలిసి ఊరేగింపుగా దీక్షాస్థలికి చేరుకుంటారని కలెక్టర్ చెప్పారు. అడిషనల్ సిపి హరికుమార్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, మేయర్ శ్రీ కోనేరు శ్రీధర్, సబ్ కలెక్టర్ డిసిపి అశోక్ కుమార్, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధి, ఇతర రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్ల పర్యవేక్షణలో పాల్గొన్నారు.

నేటి నుండి శ్రీ రాజశేఖర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
అవనిగడ్డ, జూన్ 1: స్థానిక శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజశేఖర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ఆదివారం వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగుతాయని ఆలయ ఇఓ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మహోత్సవం నిర్వహించటకు గాను ప్రత్యేక మండపాన్ని కూడా నిర్మించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయుట, అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుటు, సాయంత్రం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, ద్వజావరోహణలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శుక్రవారం ఉదయం బలిహరణం, సాయంత్రం జగాజ్యోతి, ఘంటసాల సాయి కిరణ్ శర్మ దంపతులచే శ్రీ స్వామివారి కళ్యాణం జరుపుతారు. శనివారం రథోత్సవం, రథ హోమం, గ్రామోత్సవ కార్యక్రమాలు జరుగ్గా ఆదివారం వసంతోత్సవం, చూర్ణోత్సవం, అవభృదస్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగ్గా, సాయంత్రం ద్వాదశ ప్రదక్షణలు, పవళింపు సేవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు తిమ్మ సముద్రంకు చెందిన యజ్జీక బ్రహ్మ జంధ్యాల రామసుబ్బయ్య శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయి. నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్యశర్మ అవధాని, మల్లాది బాలకృష్ణశర్మ అవధాని గార్లచే ప్రతి రోజూ సాయంత్రం 5గంటలు నుండి వేద స్వస్తి జరుగుతుంది. శనివారం రాత్రి 7గంటలకు శ్రీ లలిత కళా భారతి రేపల్లె వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహిస్తారని ఇఓ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.