విశాఖపట్నం

మనోడే (కథానికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులమేరా మన బలం, కులమేరా మన ఆయుధం, కులమే మన సర్వస్వం... ఇవీ సంగమేశు నిత్యం జపించే మంత్రాలు. చదువు, సంస్కారం పక్కన పెట్టి ఉద్యోగం చేస్తున్నామనే ఇంగితం విడిచి ఇరవై నాలుగు గంటలూ కుల నామస్మరణలో మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను కుల జపంతో ఆవిరి చేస్తున్నాడు. పని చేస్తున్నది మండల రెవెన్యూ కార్యాలయంలో. కులం, మతం, వర్గం అనే భేదభావాలను సంస్కరించాల్సిన కార్యాలయంలో కులం పేరుతో ఉద్యోగులను మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా మార్చేసాడు. తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అలవోకగా ఉద్యోగం సంపాదించిన సంగమేశు ఆ బాధ్యతలను విస్మరించి కుల సంఘాలు ఏర్పాటు, కుల సమావేశాల్లో కీలకపాత్ర పోషించడంతోనే సరిపోతుంది. ఎవరైనా అధికారి నిలదీస్తే మనోభావాలను కించపరిచారని ఎదురుదాడి చేయడం అతని వరస. అందుకే ఆ కార్యాలయంలో సంగమేశు అంటే అందరికీ భయం. ఉన్న ఇరవై మంది ఉద్యోగుల్లో పది మందిని కూడగట్టి కులభక్తి నూరిపోసి ఆఫీసు టైములోనే సభలు సమావేశాలు నిర్వహించి కార్యాలయంలో కులగజ్జిని అంటువ్యాధిలా వ్యాపింపజేస్తున్నాడు. అతడి వెనుక ఉన్న వారికి ఇది ఇష్టం లేకపోయినా పలుకుబడి ఉన్న సంగమేశుకి భయపడి అతని వెనక తిరుగుతున్నారు. ఒక సాయంత్రం సంగమేశు తన కులం వారిని కార్యాలయంలో సమావేశ పరిచాడు. ‘‘మీకొక శుభవార్త. తాశీల్దార్‌గా మన కులం ఆయనే బదిలీపై వస్తున్నారు. మన కొత్త తాశీల్దార్‌కు ఘన సన్మానం ఏర్పాటు చేయాలి. దీనికి కొంత ఖర్చు అవుతుంది’’ అన్నాడు. తన వాటా వెయ్యి రూపాయలు అని చెప్పి తతిమా వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేశాడు. కొత్త అధికారి రానే వచ్చారు. బాధ్యతలు చేపట్టిన భాస్కరరావు అక్కడి పరిస్థితులు అరగంటలో అర్ధం చేసుకున్నారు. సాయంత్రం అందరూ వెళ్లిపోయిన తరువాత ఒంటరిగా ఉన్న తాశీల్దార్ భాస్కరరావుని సంగమేశు ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ‘‘ఇక్కడ మన కులం వారు పది మంది ఉన్నారు. మాకు మీరు అన్ని విధాలుగా సపోర్టుగా నిలవాలి. మన కులం ఉద్యోగులంతా రేపు మీకు సన్మానం ఏర్పాటు చేశాం’’ అని చెప్పాడు సంగమేశు.
తాశీల్దార్ ఆశ్చర్యపోయాడు. అయినా బయటికి గుంభనంగా ఉన్నట్లు నటిస్తూ ‘‘అలాగే’’ అంటూ తలూపారు.
మర్నాడు తాశీల్దార్‌ను ఉద్యోగులంతా ఘనంగా సన్మానించారు. తాశీల్దార్ వౌనంగా సన్మానం అందుకున్నాడు. తర్వాత మాట్లాడుతూ ‘‘మీరు మీ పిల్లల్ని బాగా చదివించి వృద్ధిలోకి తేవాలి’’ అంటూ ఏకవాక్యంలో ప్రసంగం ముగించారు.
ఏదో ఊహించుకున్న సంగమేశు తెల్లబోయాడు.
* * *
‘‘సార్ మా పాప బారసాల ఉంది. మీరు తప్పక రావాలి’’ అని సంగమేశు తాశీల్దార్‌ని ఆహ్వానించాడు.
‘‘ఎప్పుడు?’’ ప్రశ్నించారు తాశీల్దార్.
‘‘ఆదివారం రాత్రి సార్. మీరు తప్పక రావాలి’’ అని చెప్పి వెళ్లిపోయాడు సంగమేశు.
బారసాల అనేది ఉదయం కదా చెయ్యాల్సింది. ఇందులో ఏదో మతలబు ఉందని భావించిన తాశీల్దార్ ఎప్పుడు చేసుకుంటే మనకేం. ఒకసారి కనిపించి వచ్చేయడం మంచిది అనుకున్నారు.
ఆదివారం రానే వచ్చింది. ఇంటి దగ్గర చెయ్యాల్సిన శుభకార్యం కల్యాణ మండపంలో చేస్తున్నారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తాశీల్దార్ భాస్కరరావు ఓ మంచి గిఫ్టు పట్టుకుని మండపానికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో కళకళలాడుతున్న కల్యాణ మండపం ప్రాంగణంలో పెళ్లి వాతావరణం కనిపించింది. తాశీల్దార్‌కు ఎదురెళ్లి వినయంగా ఆయనను అందరికీ పరిచయం చేస్తున్నాడు సంగమేశు.
కాస్త ఆడంబరంగా అలంకరించుకున్న వారికి ఇతను మనవాడే అంటూ పరిచయం చేయడం భాస్కరరావుకు నచ్చలేదు. అంతా కలిసి ఓ వంద మంది దాకా ఉంటారు. ఇంచుమించు అందరూ వి ఐపిలే. అందరినీ పరిచయం చేస్తూ తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నాడు సంగమేశు.
ఒకవైపు మాంసాహార వంటకాలు, మరోవైపు మందు పార్టీ. అరక్షణంలో అర్ధమయింది భాస్కరరావుకి. కనీసం పాపపై రెండు అక్షింతలు వేసి దీవిద్దామనుకున్నా వారి జాడ కూడా లేదు. మరి ఉండబట్టలేక ‘‘ఏమయ్యా సంగమేశు, మీవారు ఎవరినీ పరిచయం చేయడంలేదు. ఏమిటి సంగతి’’ అని తాశీల్దార్ నిలదీశారు.
అసలు విషయం చల్లగా చెప్పాడు సంగమేశు.
‘‘సార్ మీకు తెలియంది ఏముంది. మన కులంలో అంతా అలగా జనం. వారికి నాగరికత తెలియదు. వారిని పిలిస్తే ఈ కార్యక్రమం కాస్త అన్న సంతర్పణ అయిపోతుంది. అసలు కార్యక్రమం ఎప్పుడో అయిపోయింది. విఐపిలను దృష్టిలో పెట్టుకుని బారసాల పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. చివరికి మా అమ్మానాన్నలను కూడా పిలవలేదు’’ అంటూ చెప్పాడు. తాశీల్దార్ భాస్కరరావు ‘‘ఇకచెప్పింది చాలు. కులం పేరుతో నువ్వు చేస్తున్న లేకి పనులు మానుకో. కులం మన ఇంటి వరకే పరిమితం. నీది కులభక్తి, కులపిచ్చి గానీ కావు. నీకు కులగజ్జి పట్టింది. ఇది చాలా ప్రమాదం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కులం, వృత్తి, వర్గరహితంగా సమాజాన్ని గౌరవించడం నేర్చుకో’’ అంటూ తెచ్చిన గిఫ్ట్ విసిరికొట్టి విసురుగా కారులో అక్కడి నుండి నిష్క్రమించారు.
ఇదంతా ప్రత్యక్షంగా చూసిన వారంతా సంగమేశును పురుగుని చూసినట్లు చూసి అర్ధాకలితోనే అక్కడి నుండి నిష్క్రమించారు. సంగమేశులో అంతర్మథనం మొదలయింది. కులం పేరుతో ఎంత మందిని ఇబ్బందుల పాలు చేశాను. కులం కన్నా గుణమే మిన్న అనే భావం సంగమేశులో మార్పునకు కారణమయింది.

- టంకాల సత్యంనాయుడు, రాజాం.

అతిథి మర్యాదలు

రామారావు ఏమీ తోచక బీచ్ వైపు షికారు బయలుదేరాడు. పరిసరాలను గమనిస్తూ రామకృష్ణా బీచ్‌కి చేరుకున్నాడు.
ఇంతలో ‘‘రామం రామం’’ అంటూ వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు.
స్నేహితుడు రఘు కనిపించాడు.
‘‘హైదరాబాద్ నుండి వైజాగ్ ఎప్పుడు వచ్చావు?’’ స్నేహితుడిని ప్రశ్నించాడు రఘు.
‘‘వైజాగ్‌లో మా మేనత్త మనవడు పెళ్లి ఉండేనూ వచ్చా. మా పెద్దల్లుడికి బ్యాంకు ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చి విజయవాడ నుండి ఈ ఊరు వేశారు. ఎంవిపికాలనీలో వాళ్లు ఉంటున్నారు. వాళ్లింట్లోనే దిగాను’’ అంటూ చెప్పాడు రామారావు.
కుశలప్రశ్నలు పూర్తయ్యాక రాత్రికి వాళ్లింటికి భోజనానికి రమ్మని రఘు పిలిచాడు.
‘‘అయితే మా అమ్మాయికి భోజనానికి రానని ఫోన్ చేసి చెబుతాను’’ అంటూ ఇంటికి ఫోన్ చేశాడు రామారావు.
ఈలోపు తన స్నేహితుడు రఘు భోజనానికి వస్తున్నట్లు రఘు వాళ్లావిడకి ఫోన్ చేసి చెప్పాడు.
రామారావు, రఘు వైజాగ్‌లోనే ఎవిఎన్ కాలేజీలో చదువుకున్నారు. తరువాత రామారావుకు ఎజి ఆఫీసులో ఉద్యోగం వస్తే వెళ్లి జాయినైపోయాడు. రఘు నాన్నగారు అప్పుడు పోర్టులో పని చేయడం వలన రఘుకి పోర్టులోనే ఉద్యోగం సంపాదించారు. రఘు వాళ్లకి డాబాగార్డెన్స్‌లో సొంత ఇల్లు ఉన్నందున వారు అక్కడ ఉండేవారు. రామారావు మహరాణిపేటలో మరో ఇద్దరు రూమ్మేట్లతో కలసి ఉండేవాడు.
సెలవు రోజుల్లో రామారావు రఘు వాళ్లింటికి వెళుతుండేవాడు. రఘు వాళ్లమ్మగారు నిజంగా కాశీ అన్నపూర్ణమ్మగానే చెప్పాలి. ఎప్పుడు వాళ్లింటికి వెళ్లినా కాఫీ, టిఫిన్ ఇచ్చేవారు. భోజనం టైమైతే ఆప్యాయంగా కమ్మని భోజనం పెట్టేవారు. ఆమె చేతి భోజనం రామారావు ఎన్నటికీ మరచిపోలేడు. మొదట్లో తరచూ కలిసేవారు. పెళ్లిళ్లు అయ్యాక రాకపోకలు తగ్గాయి. తరువాత రఘు అమ్మగారు, నాన్నగారు కూడా కాలం చేశారు. రఘు ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయి కాపురాలు చేసుకుంటున్నారు. డాబాగార్డెన్స్‌లోని ఇంటిని తనకే ఇచ్చినట్లు రఘు ఒకసారి చెప్పాడు.
రఘు పెళ్లయిన కొత్తలో రెండు మూడుసార్లు రామారావు వాళ్లింటికి వెళ్లాడు. అయితే అతని భార్య కలుపుగోలుగా లేకపోవడం వల్ల వైజాగ్ వచ్చినా వాళ్లింటికి మాత్రం వెళ్లేవాడు కాదు. ఇద్దరూ కలుసుకుని చాలా కాలం కావడం వల్లను, రఘు స్వయంగా భోజనానికి పిలవడం వల్ల అతనింటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు రామారావు. కొంత సేపు బీచ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నాక రాత్రి ఎనిమిది అవుతుండగా రఘు వాళ్లింటికి బయలుదేరారు.
కాలింగ్‌బెల్ నొక్కగానే రఘు కూతురు వచ్చి తలుపు తీసింది.
‘‘నా కూతురు లయ’’ అంటూ పరిచయం చేశాడు రఘు.
ఆమె ఫ్రిజ్ డోర్ తీసి గ్లాసులో నీళ్లు వంచుకుని గడగడ తాగేసి లోపలికి వెళ్లిపోయింది.
ఈ వైనానికి రామారావు ఆశ్చర్యపోయాడు.
ఆమె తనకి ఇవ్వడానికే నీళ్ల గ్లాసులో పోస్తుందనుకున్నాడు.
తర్వాత రఘునే అడిగి మంచినీళ్లు తాగాడు రామారావు.
పాత ఇంటిని మార్చి కట్టినట్లున్నారు. హోల్లోనే కిచెన్, డైనింగ్ టేబులు ఉన్నాయి. పది నిముషాల తర్వాత బాగా అలంకరించుకున్న రఘు భార్య సుందరి వచ్చింది. భార్యని పరిచయం చేశాడు రఘు. టీ తెమ్మని చెప్పాడు.
వాళ్లు మాటల్లో ఉండగానే ఆమె టీ పెట్టి తీసుకొచ్చింది.
ఆమె అక్కడ కొంత సేపు కూర్చుని లోపలికి వెళ్లిపోయింది. కొడుకు ఇంజనీరింగ్ చదివి పోర్టులోనే ఉద్యోగం చేస్తున్నట్లు, కూతురు ఎంబి ఎ చేస్తున్నట్లు చెప్పాడు రఘు.
తన ముగ్గురు కూతుర్లకు పెళ్లయిందని, ఇద్దరు హైదరాబాద్‌లోను, ఒకమ్మాయి వైజాగ్‌లోనే ఉన్నట్లు రామారావు చెప్పాడు.
రాత్రి తొమ్మిదవడంతో భోజనాలకు కూర్చున్నారు. వాళ్లబ్బాయి కిరణ్ రావడంతో ముగ్గురికి మూడు కంచాల్లో అన్నం వడ్డించి, రఘు భార్య సోఫాలో సెల్‌ఫోన్‌లో ఆటలాడుకోసాగింది. దొండకాయ వేపుడు, రసం, ఆవకాయ పచ్చడి, పెరుగు అన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉండడంతో ఎవరికి కావలసినవి వారు వడ్డించుకుని తిన్నారు.
మాట వరసకైనా సుందరి వడ్డిస్తానంటూ ఇటు రాలేదు. భోజనాలు పూర్తయ్యాక రఘు, అతని కొడుకు కిరణ్ ఎవరి కంచాలు వారు తీసి సింక్‌లో పడేయడం చూసి రామారావు కూడా తన కంచాన్ని తీసి సింక్‌లో పడేశాడు. అయితే రఘు కానీ, సుందరి కానీ మర్యాదకైనా కంచం తీస్తామని అనలేదు.
ఆ సమయంలో రామారావుకి రఘు తల్లి గుర్తుకొచ్చింది. అతని కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఇంటికొచ్చిన అతిథికి కొసరి కొసరి తినిపించడమే మర్యాద. మరిదేమిటి? అనుకుని రామారావు అక్కడి నుండి బయలుదేరాడు.

- మహాభాష్యం రమ,
(ఎం. రామలక్ష్మి), అలకానందకాలనీ,
విజయనగరం-3.

నివాళి

బహుముఖ ప్రజ్ఞాశాలి
దూసి ధర్మారావు

సాధారణంగా
చాలామంది చూడవలసిన ప్రదేశాలను ఎంతో ఆసక్తితో చూస్తారు, ఆనందిస్తారు. అంతేకాని ఆ దృశ్యాలను అక్షర రూపంలో చిత్రీకరించలేరు. ధర్మారావు మార్గమే వేరు. చూసినదాన్ని, ఆ అనుభూతిని పదిమందికీ అందజేద్దామనుకోవడం ఆయన ప్రత్యేకత.

నేనే శ్రీకాకుళం ఆంధ్రావని ఆభరణం
నాగావళి నాగానం వంశధార నా ప్రాణం
హర్షవల్లి రవికిరణ్ తొలి వెలుగుల తోరణం
శ్రీకూర్మం, మూపురం ముఖలింగం గోపురం
ఇలా ఎవరనగలరండీ! శ్రీకాకుళం జిల్లా నాగావళీ తీరంలో దూసి గ్రామంలో పుట్టి శ్రీకాకుళం సాహిత్య సాంస్కృతికాది రంగాలలో తనదైన ఓ ప్రత్యేకతతో ఆ జిల్లా నేల, నీరు, గాలితో మమేకం చెందిన దూసి ధర్మారావు తప్ప. రమణమ్మ, శ్రీనివాసరావులు శ్రుతిలయలుగా, హైమవతి భావంగా, బాబీ ప్రసన్నలు షడ్జమ పంచమాలుగా మాటల్ని కూడా పాటలుగా మార్చి పలకరించే వ్యక్తి ధర్మరావు. అధ్యాపక వృత్తిలో వున్నా ప్రవృత్తి అంతా సాహితీ సాంస్కృతిక రంగమే. ఆయన చిన్నతనంలో తన స్వగ్రామం దూసి ఒక లలితకళల అకాడమీలా ఉండేదట. ఎంత మధుర భావన! తండ్రి శ్రీనివాసరావు ప్రబంధాల పద్యాలు అనేక రాగాలలో ఆలపిస్తూ వుంటే పినతండ్రి బుచ్చిబాబు తూర్పు భాగవతంలోని భామాకలాపంలోని దరువులను శ్రావ్యంగా పాడేవారు. తండ్రి మృదంగవాదన కూడా. వెనె్నల వాకిళ్ళల్లో లలిత శాస్ర్తియ సంగీత కచేరీలతో గోవిందు మామయ్య నిర్వహణలో సంగీత సాహిత్య కళాపరిమళాలు వ్యాపించేవి. మరో పినతండ్రి దూసి నరసింగరావు గారింట్లో నిరంతరం సంగీత సాధన వినిపించేది.
ఈ నేపథ్యంతో ధర్మారావుకి అటు లలిత శాస్ర్తియ సంగీతం, ఇటు సాహిత్యం, జానపద కళలలో పట్టు ఏర్పడింది. అలా ఎదిగిన ధర్మారావు కలంలోంచి మొదటిగా ‘వెనె్నల మాట్లాడితే’ పేర రేడియో గీతాల సంపుటి వెలువడింది. దీన్ని రాజా లక్ష్మీ ఫౌండేషన్ అధినేత శ్రీరమణయ్య రాజాగారికి అంకితం గావించారు.
ఏ ఆమని పిలుపుల కోసం
తాను చిగురు తొడిగిందో
ఏ కోయిల వలపుల కోసం
పాట బదులు పలికిందో
అనే తొలి టీవీ గీతం చిట్టిబాబు. రామానుజ సూరి వరుల స్వర సమర్పణతో ఆవిర్భవించింది. వెనె్నల మాట్లాడితే రేడియో గీతాలతోపాటు, వందేమాతరం దేశభక్తి గీతాలు వినిపించారు. ఉత్తరాంధ్ర స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను, నేనే శ్రీకాకుళం, రాజాలక్ష్మి ఫౌండేషన్ ప్రస్థానంలో ఓ పదేళ్ళు, సాహిత్య వ్యాస మంజరిగా సౌరభం మానికొండ చలపతిరావు అనువాద వ్యాసాలు ఇలా క్రమం తప్పకుండా సాహితీ వరివస్యగా అందించారు.
సాధారణంగా చాలామంది చూడవలసిన ప్రదేశాలను ఎంతో ఆసక్తితో చూస్తారు, ఆనందిస్తారు. అంతేకాని ఆ దృశ్యాలను అక్షర రూపంలో చిత్రీకరించలేరు. ధర్మారావు మార్గమే వేరు. చూసినదాన్ని, ఆ అనుభూతిని పదిమందికీ అందజేద్దామనుకోవడం ఆయన ప్రత్యేకత. కాబట్టే ‘చూసొద్దాం శ్రీకాకుళం’, మంచు శిఖరాల అంచులపై, శ్రీకాకుళం టు శ్రీనగర్, మహేంద్రగిరి టు వౌంటు అబు, నా చూపులో ఐరోపా అనే రూపాల్లో యాత్రా సాహిత్యాన్ని అందించారు. ఇంక తెలుగు జ్యోతి న్యూజెర్సీ (యు.ఎస్.ఎ మాసపత్రిక) ఆంధ్రజ్యోతి దినపత్రిక కల్చరల్ కంట్రిబ్యూటర్‌గా పత్రికా రచన గావించారు. శ్రీకాకుళం ఎ స్టోరీ ఆన్ స్టోన్, తరతరాల శ్రీకాకుళం, సర్వజిత్ సంకల్పం. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ కళింగాంధ్రలకు సంపాదకత్వం వహించారు. భారత జాతీయ సంస్కృతీ వారసత్వ సంస్థ (నిశఆ్ఘష్ద) అన్నది దేశంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఓ శాఖ వుంటుంది. మిగతా జిల్లాల్లో దీని పని తీరు ఎలా వున్నా శ్రీకాకుళం జిల్లా శాఖ కన్వీనరుగా నేటివరకూ ధర్మారావుగారు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
ఇవన్నీ ఓ ఎతె్తైతే ఇటీవల రసతరంగిణి అనే సాహిత్య కళా వ్యాసమంజరిని అందించారు. అక్షరం, అవధానం, పద్యం, ఆధునికం, స్వరం, నాట్యం, చిత్రం, నాటకం, జానపదం అనే నవ తరంగాలుగా ప్రాచీన ఆధునిక సంగీత సాహిత్య, నృత్య, నాటక, జానపద రంగాలకు చెందిన వ్యాసాలు పోహళింపుతో అద్భుత గ్రంథం ఇది. సద్గురు శివానందమూర్తి మహోదయుల ఆశీరభినందనలనందించారు. ప్రముఖ రచయిత, నటులు గొల్లపూడి మారుతీరావు గారు ఎన్నో రంగాల వైభవానికి వేదిక అంటూ ఆయన వ్రాసిన వ్యాసాలన్నీ గొప్ప పరిశోధనకు ప్రాతిపదికలన్నారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి మన డా పప్పు వేణుగోపాలరావుగారు ‘ ఇజజ్ఘశఆ త్యీరీ ద్ఘ్ఘ్ఘూయూౄ జశ ఘ త్ఘీక ళన్దజఇజఆఒ దజఒ జఒత్ఘ్య్యీఔ్ఘౄ జశ ఆ్దజఒ త్యీరీ’ అన్న ప్రశంస ఈ రచనకు మణిమకుటం.
ఈ ప్రతిభామూర్తిని అనేకానేక పురస్కారాలు అవార్డులు వరించాయి. రాజాలక్ష్మీ ఫౌండేషన్ (చెన్నై) ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) మద్రాసు మిత్రమండలి, విశాఖ కళాభారతి, విశాఖ మ్యూజిక్ అకాడమీ, శ్రీకాకుళం మహతి, సునాద వినోదిని వంటి దేశంలో ప్రముఖ సంస్థల పురస్కారాలంకృతులయ్యారు.
కవిగా, రచయితగా, విమర్శకునిగా, వక్తగా, వ్యాఖ్యాతగా ఇలా బహుముఖ ప్రతిభామూర్తి దూసి ధర్మారావుగారిని ఆదివారం రాత్రి విశాఖ బీచ్‌లో బస్సు రూపంలో మృతువు దూసుకొని వచ్చింది. వారు ఇకలేరు అన్నది సహృదయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజమేనా! నమ్మలేని నిజం. పోలీసు అధికారిగా వున్న వారి కుమారుడు కిషోర్‌గారితోపాటు కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధర్మారావు సాహితీమూర్తికి అక్షర నీరాజనాన్ని అందిస్తున్నాయి విజయనగరంలోని విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య, గురజాడ సాంస్కృతిక సమాఖ్యలు.

- డా అయల సోమయాజుల గోపాలరావు, 9440435262

మనోగీతికలు

స్మృతి
మనసు పల్చని తెల్ల కాగితం
అందు రాయాలి జీవితపు
అనుభవాలు పాఠాలు
ఎప్పుడూ మంచి భావాలు
జీవన్మణికి ముత్యాల సరాలు
ఎద పాన్పును పరవశించి
పులకించు గులాబీ తోటలు
విషాదాల గుండె లోతుల
గాయాలు ముళ్లబాటలు
మనసు కాగితంపై లోతైన భావాలు
జీవిత పోరాటాలు

- యలమంచిలి శివాజీ

ఉదయ రాగాలు
తెల్లవారి సూర్యుని రాకను
చెప్పకనే చెబుతాయి చెట్లపైనున్న పక్షులు
తమ కిలకిలారావాలతో
అమ్మ పనిపాటలకై లేస్తే
పసిపిల్లలు పక్క తడిమి
అమ్మకై చేసే రోదనలు
ఇల్లు తుడుపులు, గినె్నల శబ్దాలు
దినపత్రిక రాక, పాలవాని కేక
ఇవేవీ నిద్రను కదిలించలేవు
రాత్రంతా టివిలు, ల్యాప్‌టాప్‌లు
ఇంటర్నెట్‌లతో కాలక్షేపమైతే
నిద్రపోయేది పగలేగా
ఇంటి ఇల్లాలు పేరుపేరునా తెల్లవారిందని
దుప్పటి లాగివేసి అందరికీ పలకాలి మేలుకొలుపు
ఆఫీసులు, స్కూళ్లకు అందరూ వెళ్లాలిగా!

- గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట,
విజయనగరం.
సెల్ : 9441567395.

మార్పు కోసం
చరిత్ర గొప్పదని సంతృప్తి చెందుతూ
గాడి తప్పుతున్న వర్తమానం
మార్పు సహజమంటూ మానవత్వాన్ని మరచి
ఊహించని ప్రపంచంలో బతికేస్తున్న
ఈ తరం మానవుని చూసి
ఆనందించాలా ఆవేదన చెందాలా?
ఆడపిల్లలపై అత్యాచారాలు
డబ్బు కోసం హత్యలు
స్వార్ధానికై మోసాలు
అడుగడుగునా అవినీతి ఆగడాలు
అన్నీ పరిపాటైపోయాయి
వీటన్నింటినీ చూస్తూ
మనకి మనంగా
మార్పు చెందలేమా?

- సాలూరు సంతోషి,
విజయనగరం.

మధురస్మృతులు
ఓ చెలీ నీ రాకకై
హృదయ మందిరాన్ని పదిలపరిచా
గుండె గుడిలో నీవుండలేక
ఎండమావిగా తలిచావు
నా ఊసులు, బాసలు నీకు
జోల పాడలేనప్పుడు నేను
నీ సాన్నిహిత్యం మరి యోచించలేను
నీ మధురస్మృతులే చాలు
ఈ జన్మకవే పదివేలు!
సెల్ : 8019783424.

- బండారు చిన్న రామారావు (లోగిశ),
విజయనగరం జిల్లా,
లోగిశ-535270.
సెల్ : 9553330545.

దీనజనులు
కణకణ మండే అగ్నికీలల్లో
దేహం దహించుకుపోతున్నా
ఉష్ణతాపాన్ని లెక్క చేయక
జానెడ పొట్టకు తపన పడే
దీన జనుల గాథ వేరు
ప్రకృతి విలయతాండవంతో
హుదుద్‌లైనా పైలిన్‌లైనా
విపత్తులన్నింటికీ వరుస కట్టి
జీవన గమ్య మార్గపథాన
పయనించుటకు వెనుకడుగేయరు
ప్రపంచ మురికిని కడిగేస్తూ
స్వచ్ఛ్భారత్ సాధకులై
ప్లాస్టిక్ సామ్రాజ్యానికి కట్టలు కట్టి
పర్యావరణానికి రక్షణ చుట్టి
ధరిత్రి గోడును గుర్తెరిగిన మీకు
రుణపడి ఉంది ఈ భారతావని

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం, విశాఖ జిల్లా.
సెల్ : 9885090752.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. ళ్ఘౄజ: ౄళూఖఔఖ్పఒఔబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- టంకాల సత్యంనాయుడు