అంతర్జాతీయం

పిలిస్తేనే వెళ్లా : విజయ్‌మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్:వేలకోట్ల రూపాయల ఎగవేసి భారత్‌నుంచి పరారైన వ్యాపారదిగ్గజం విజయ్‌మాల్యా హాజరైన ఓ కార్యక్రమంలో అక్కడి భారత హైకమిషనర్ హాజరైన విషయం వివాదంగా మారింది. ఇప్పుడు అది మరింత ముదిరింది. మాల్యా హాజరైన విషయాన్ని పసిగట్టిన వెంటనే భారత దౌత్యవేత్త నవతేజ్ సర్నా కార్యక్రమంనుంచి నిష్క్రమించారన్న భారత విదేశాంగశాఖ వివరణపై మాల్యా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను ఎవరూ ఆహ్వానించలేదని, ఆహ్వానితుల జాబితాలో మాల్యా పేరు లేదని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టాడు. పిలవకుండా వెళ్లే అలవాటు తనకు లేదని చెప్పుకున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.