క్రీడాభూమి

హోర్వాత్‌పై నా విజయం.. అమర జవాన్లకు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత బాక్సర్ విజేందర్

లివర్‌పూల్, మార్చి 13: ప్రొఫెషనల్ బాక్సర్‌గా కెరీర్‌లో తాను సాధించిన నాలుగో విజయాన్ని పఠాన్ కోట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అశువులు బాసిన వీర జవాన్లకు అంకితం ఇస్తున్నట్టు భారత బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించాడు. అలెగ్జాండర్ హోర్వాత్‌ను నాలుగో రౌండ్‌లో నాకౌట్ చేసిన విజేందర్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు, గత ఏడాది అక్టోబర్ 10న సోనీ వైటింగ్‌ను మాంచెస్టర్‌లో, నవంబర్ 7న డీన్ గిలెన్‌ను డబ్లిన్ (ఐర్లాండ్)లో, డిసెంబర్ 19న సమెట్ హుసినొవ్‌ను మాంచెస్టర్‌లో జరిగిన ఫైట్స్‌లో చిత్తు చేశాడు. తాజాగా లివర్‌పూల్‌లో అతను హోర్వాత్‌ను పడగొట్టాడు. బలం కోసం పాము రక్తం తాగుతానని, విజేందర్‌ను మట్టికరిపిస్తానని ఫైట్‌కు ముందు సంచలన ప్రకటనలు గుప్పించిన 20 ఏళ్ల హోర్వాత్ మొదటి మూడు రౌండ్లలో విజేందర్ పంచ్‌లకు ఎదురునిలవలేకపోయాడు. అయితే అతి కష్టం మీద నిలదొక్కుకొని ఫైట్‌ను కొనసాగించాడు. కానీ, నాలుగో రౌండ్‌లో విజేందర్ విసిరిన పంచ్ బలంగా తగలడంతో రింగ్‌లో కుప్పకూలిన అతను రిఫరీ కౌంటింగ్ పూర్తి చేసే వరకూ లేవలేదు. ప్రొఫెషనల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన తర్వాత వరుసగా నాలుగు విజయాలను నమోదు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో విజేందర్ పేర్కొన్నాడు. అయితే, స్వదేశంలో జూన్ 11న జరిగే డబ్ల్యుబివో ఆసియా టైటిల్ ఫైట్‌లో గెలిచినప్పుడు ఇంకా ఎక్కువగా సంతోషిస్తానని అన్నాడు. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఫైట్ చేయడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నాడు. ఆసియా టైటిల్‌పైనే దృష్టి కేంద్రీకరించానని, ఇప్పటి నుంచే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు. ఇలావుంటే, డబ్ల్యుబివో ఆసియా టైటిల్ పోరుకు ముందు అతను వచ్చేనెల రెండో తేదీన మరో ఫైట్‌లో పాల్గొంటాడు. అతని ప్రత్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు.