తెలంగాణ

విజయనిర్మల మృతికి పలువురు ప్రముఖుల సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బాల నటిగా చిత్ర పరిశ్రమకు వచ్చిన విజయనిర్మల పట్టుదలతో పరిశ్రమించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ఆమె మృతికి తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీయార్ తదితరులు సంతాపం తెలిపారు.