జాతీయ వార్తలు

ఆ గ్రామంలో కట్నం నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్‌పట్: కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఆ గ్రామంలోని వారంతా సామూహికంగా ప్రమాణం చేశారు. యుపిలోని బాగ్‌పట్ జిల్లా బావ్లి పంచాయతీలో ఈ మేరకు సోమవారం గ్రామస్థులంతా సమావేశమై వరకట్నాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో అమ్మాయిలెవరూ జీన్స్, బిగుతు దుస్తులు వేసుకోరాదని, ఆడపిల్లలు పుట్టకుండా భ్రూణహత్యలకు పాల్పడేవారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని పెద్దలు తీర్మానించారు. పెళ్లిళ్ల సందర్భంగా భారీ శబ్దాలతో పాటలు, అశ్లీల నృత్యాలు చేసినా సహించేది లేదని, ఎవరైనా చనిపోతే కర్మకాండల పేరిట భారీగా జరిగే విందులకు హాజరు కారాదని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు.