హైదరాబాద్

సమస్యలు పరిష్కరించని ప్రజాప్రతినిధులను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రజాగాయకురాలు విమలక్క
ఉప్పల్, మార్చి 13: సమస్యలను పరిష్కరించని ప్రజాప్రతినిధులను బహిష్కరించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రజా గాయకురాలు విమలక్క ప్రజలకు పిలుపునిచ్చారు. బోడుప్పల్ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షా శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీబావం ప్రకటించారు. ఉద్యమాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యంవల్లే అడవులు, గుట్టలు, చెరువుకుంటలు కబ్జావుతున్నాయని ధ్వజమెత్తారు. సహజ వనరులను పరిరక్షించకుండా విధ్వంసం సృష్టిస్తూ రియల్టర్లు కోట్లు సంపాదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల నరికివేతతో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అడవులను నరికివేస్తుంటే చర్యలు తీసుకోని ప్రభుత్వం మొక్కలను నాటాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సంకల్పంతో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను గాలికొదిలి సంపాదనే ధ్యేయంగా పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇంటింటికి నల్లా నీరు అందించడమే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ సమీపంలోని బోడుప్పల్‌లో నీటికోసం ఇన్ని కష్టాలు పడుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు, సాగునీటికోసం జనం అల్లాడుతున్నా పట్టించుకోని పాలకులు ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. నగరంలో ఎక్కడబడితే అక్కడ లికేజీలు, పైపుల పగుళ్లతో కృష్ణా తాగునీరు నేలపై వృధాగా ఏరులై పారుతుండగా ఇక్కడ గుక్కెడు నీటికోసం దాహార్తితో అలమటిస్తున్న బోడుప్పల్ ప్రజల ఆర్తనాదాలు పట్టవా అని విరుచుకుపడ్డారు. సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులపై ఉద్యమాల ద్వారా అవసరమైతే తిరుగబడాలని పిలుపునిచ్చారు. వానమ్మ ఒక్కసారి వచ్చిపోవమ్మని అని విమలక్క పాడిన పాటకు మహిళలు గొంతు కలిపి అందర్ని ఆకట్టుకున్నారు.
మహిళలతో కలిసి విమలక్క ర్యాలీ
అంతకుముందు విమలక్క కాలనీ మహిళలు, ప్రజలతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ స్కూల్ మీదుగా పురవీధుల్లో నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ నాయకుడు నాగరాజు, ప్రజాసంఘాల ఉద్యమ నేత రాధిక, కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారులు రాపోలు రాములు, సలహాదారులు బొమ్మక్ రమేశ్, అధ్యక్షుడు బొమ్మక్ మురళి, ప్రధానకార్యదర్శి పులకండ్ల జంగారెడ్డి, ప్రజాప్రతినిధులు వి.అశోక్‌రెడ్డి, కామగల్ల నర్సింహ, మల్లారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సరిత, సునిత పాల్గొని ప్రసంగించారు. దీక్షలో ఐఐసిటీ కాలనీ సంక్షేమ సంఘం ప్రజాప్రతినిధులు బివి చారి, సింగిరెడ్డి అంజిరెడ్డి, గణేష్ అయ్యర్, కె.సత్యనారాయణ, లక్ష్మినారాయణ కూర్చున్నారు.