వినదగు!

మనం దేహరూపులం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవతార పరంపరలో మనది మానవ అవతారం. అయితే ఈ మానవ అవతరణతో మనం దేహరూపులం.. ఆత్మస్వరూపులం. నిజానికి ఆత్మకు రూపం ఉండదు కానీ దేహంలో కొలువై ఉండటంతో ఆత్మకూ స్వరూపాన్ని అంటగడుతున్నాం. అలాగే ఆత్మ నిర్గుణమే అయినా దాన్ని సగుణంగా పరిగణిస్తున్నాం.
మన వల్ల మన సమాజం ఉద్వేగం పొందని స్థితిలో ఉన్నా సమాజం వల్ల మనం ఉద్వేగానికి లోనుకాని స్థితిలో ఉన్నా - అంటే, ఉద్వేగరహిత స్థితిని చేరుకోగలిగితే - మన ఈ మానవ జీవనం ఆత్మజీవనమే అవుతుంది. ఇలా ఉద్వేగ సంపన్నం కాకపోవటమే ఆత్మ సగుణత్వం. అందుకే భగవద్గీత ‘యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః’ అని అంటుంది.
‘సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢ నిశ్చయః’ అనీ అంటుంది. అంటే సర్వకాల సర్వావస్థలలో సంతోషంగా ఉండటం, ఏకాగ్ర చిత్త ప్రవృత్తి కలిగి ఉండటం, దృఢ నిశ్చయంతో ఉండటం అన్నవి ఆత్మ గుణాలు అని. ఇవన్నీ సుగుణాలు కాబట్టి ఆత్మది సగుణమే.
ఇటువంటి ఆత్మ స్వరూపంతో ఉన్న మనం దేహరూపులం కాబట్టి మనం దేహ వర్తనాని కంటే ఆత్మవర్తనానికే ప్రథమ తాంబూల మివ్వాలి. ఇంతకీ ఆత్మవర్తనం అంటే ఏ ప్రాణినీ ద్వేషించకుండా ప్రేమిస్తుండటం.. మిత్ర భావంతో మెలగటం.. అహంకారానికి, మమకారానికి తావివ్వకుండటం.. సుఖదుఃఖాల్ని సమాదరించటం.. సహనశీలంతో వ్యవహరిస్తుండటం - ఇటువంటి వర్తనమంతా ఆత్మవర్తనమే.
‘అనపేక్షశ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ’ అంటే అపేక్ష లేకుండటం, శౌచ స్వభావంతో చరించటం, సమర్థత ఉదాసీనతలకు ఆకారమై ఉండటం - ఆత్మస్వరూప లక్షణమే. అంతేకాదు ‘న హృష్యతి/ న ద్వేష్టి/ న శోచతి/ న కాంక్షతి’ = హర్షానికి పొంగిపోకుండటం, ద్వేష స్వభావాన్ని దరికి చేర్చకుండటం, ముఖ్యంగా ఆత్మ వర్తనంలో శుభ అశుభ కర్మల ప్రస్తావన అసలే ఉండదు.
‘తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యే న కే నచాత్ అనికేతః స్థిర మతిర్భక్తి మానే్మ’ అంటే నిందకైనా, స్తుతికైనా చలించకుండటం, వౌనవర్తనంతో చరించటం, సదా సంతుష్టతలో ఉండటం, స్థిర నివాసం కంటే స్థిరబుద్ధి కలిగి ఉండటం - ఆత్మాచరణ అవుతుంది.
అసలు, ఆత్మ విషయకంగా మనం గుర్తించవలసింది అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కంటే ధ్యానం, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది అన్న అంశాన్ని ఈ కర్మ ఫల త్యాగ సిద్ధతే తపస్సు. ఈ తపస్సంపన్నత కోసమే ఆత్మ సదా పరితపిస్తుంటుంది.
* * *
ఇంతకీ దేహ రూపంలోని ఆత్మస్వరూపం అధిభౌతిక ఆవిష్కరణ. అందుకే ఆత్మ సంపదలను అధిభౌతిక ఆవిష్కరణలుగా పరిగణిస్తుంటాం. భౌతికానికీ, దేహానికీ, మానసికానికీ, ప్రాపంచికానీ అందని అనుభవాల దొంతరలు, అనుభూతుల పరంపరలు, ఆవిష్కరణల భాండాగారాలు - అన్నీ ఆత్మసంపదలే.
సామాన్యంగా మన దేహంలోని కళ్లు, ముక్కు, నోరు, చెవులు, చర్మం- వీటి ఆవిష్కరణలతోనే మురిసిపోతూ, ఉబ్బితబ్బిబ్బవుతూ, విర్రవీగుతుంటాం. ఈ పంచేంద్రియ తత్వాల కంటే, శక్తుల కంటే ఎన్నో వేల, వందల రెట్ల శక్తి సంపన్నం ఆత్మ. అయినా ఆత్మ శుద్ధ అహంతో వొదుగుతుంటుంది. కాబట్టే ఆత్మ వర్తనానికి తొలి తాంబూలం.
* * *
మన దేహ రూపం జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ చైతన్య సంకలనం. అయితే ఆత్మస్వరూపం మాత్రం జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అతీంద్రియ సంపన్నం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల మన భౌతిక జీవితాన్ని అంటే దైహిక వర్తనాన్ని రంజింప జేస్తుంటాయి. ఈ ఇంద్రియ తృప్తే మహా భోగంగా అనిపిస్తుంటుంది. ఎంతలా మహా భోగం అనిపిస్తున్నా అదంతా పరిమితులకు లోబడినటు వంటిదే.
పరిమితులు లేనిది అతీంద్రియ చైతన్యం.. అదే ఆత్మచైతన్యం. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ చైతన్యాన్ని సైతం తనలో పొదువుకోగల అతీంద్రియ చైతన్యం ఆత్మ స్వంతం. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ చైతన్యాలను రంగరించి రసాదిష్కారం చేయగలదు ఆత్మచైతన్యం. అదే ఆత్మశక్తి.
నిజానికి మన దేహ రూపంలోని పంచేంద్రియాలు భూ తత్వానికి, జల తత్వానికి, అగ్ని తత్వానికి, వాయు తత్వానికి, ఆకాశ తత్వానికి ప్రతీకలు. ఈ తత్వాలన్నీ ఒదిగిపోయేది ఆత్మతత్వంలో.
* * *
ఇంతకీ మానవ అవతరణలో - దేహ రూపంలోని ఆత్మస్వరూపం వెలుతురు నిండిన తెల్లటి శరీరం... అది ఒక విధమైన మెరుపుగల కాంతి శరీరం.. కాంతిలో రంగరించిన తెల్లదనం. ఇలా ఆత్మది కాంత శరీరమే కాదు.. భారరహిత శరీరం కూడా! ఏ మాత్రం బరువు ఉండదు. గాలిలో ఇట్టే తేలిపోతుంటుంది. ఘన, ద్రవ, వాయు స్థితులలో సైతం ప్రయాణించ గలుగుతుంటుంది. పైగా ఆత్మ ఉన్నచోట చీకటికి అవకాశం లేదు. ఆత్మ ఉన్న తావుల అంతటా వెలుతురే!

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946