వినదగు!

‘ఆత్మ’యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భౌతిక, అధిభౌతికల ‘కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం.. సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహు స్త్యాగం విచక్షణాః’ భగవద్గీత అష్టాదశాధ్యాయం ‘మోక్ష సన్యాస యోగం’లోని మొదటి శ్లోకంలో అర్జునుడు ‘సన్న్యాసస్య తత్త్వ మిచ్ఛామి’ - ‘త్యాగస్యచ’ ‘వేదితుమ్’ ... అంటే సన్యాస సత్యాన్ని, త్యాగ తత్వాన్ని స్పష్టపరచమని అడిగినపుడు, కృష్ణుడిచ్చిన సమాధానంలోని తొలి నిర్వచనమే ‘కామ్యానాం...’ అన్న ఈ రెండవ శ్లోకం.
అర్జునుడి దృష్టిలో కృష్ణుడు మహాబాహుడు... బాహుబలం కలవాడు; హృషీకేశుడు... ఇంద్రియ నిగ్రహం కలవాడు. అంటే శారీరక, మానసిక సంయమనం కలవాడని. అటు దేహాన్ని, ఇటు మనసుని అదుపులో ఉంచుకోవటమంటే ‘సమాధి స్థితి’లో ఉన్నట్లే. ‘సమస్థితి’లో ఉన్నట్లే!! దీనే్న ‘బాలెన్సింగ్ పర్సనాలిటీ’ అంటాం.
మానసిక సంయమనం లేనివాడు అర్జునుడు... సంపూర్ణ సంయమనశీలి కృష్ణుడు; చాంచల్య మానసుడు అర్జునుడు... అచంచలుడు కృష్ణుడు; భౌతిక ప్రవృత్తికి ప్రతీక అర్జునుడు... అధిభౌతిక ప్రవృత్తికి ప్రతిబింబం కృష్ణుడు; - కాబట్టి అర్జునుడిది అడిగే స్థానం అయింది.. కృష్ణుడిది చెప్పే స్థానం అయింది. అందుకే భగవద్గీత కృష్ణగీత అయింది.
కామ్యాలు అంటే కామనలు - ఇవి దైహికమనవి కాబట్టి భౌతికాలు, ప్రాపంచికాలు.. పైగా మనసు పెత్తనంలోనివి. ఈ కామనా కర్తలను విడనాడటమే సన్యాసం. ఇంకా చెప్పుకోవాలంటే దైహిక, మానసిక, భౌతిక, ప్రాపంచిక భోగాలపై అనురక్తిని పెంచుకోకుండా, పదార్థ సంపదలపై మనసు పడకుండా పాంచభౌతిక జన్మతో సంప్రాప్తించిన వాంఛల లావాదేవీలలో చిక్కుబడకుండా ఉండటమే సన్యాసం.
ఇక, సర్వ - కర్మ - ఫలాలను త్యజించటం త్యాగం. ఒక్క అధిభౌతిక ఫలాసక్తి తప్ప భౌతిక జగతికి చెందిన వాటిపై ఫలానురక్తి లేకుండటమే త్యాగం.
కాబట్టి, సన్యాసం - త్యాగం అనే రెండు లక్షణాలు మోక్ష సన్యాస యోగానికి ఓంప్రథమంగా ఉండవలసిన వ్యక్తిత్వ విశేషాలు. దీన్నిబట్టి సన్యాసం - త్యాగం అన్న వ్యక్తిత్వాంశలు మనల్ని ఆత్మకు చేరువ చేస్తాయన్నది స్పష్టం.
* * *
భౌతిక వర్తనం, అధిభౌతిక వర్తనం అని మన మానవ అవతార వర్తనం రెండు రకాలు. భౌతిక వర్తనం అంతా పరార్థ ఫలాసక్తితో సాగుతుంది... ఫలితం ప్రాపంచిక భోగాలు, భౌతిక సంపదలు, అహంభావాలు, దైహిక లాలసలూ ఇనుమడిస్తూ పోయే జీవన విధానం. పైగా కోరికకు ఆరంభమే తప్ప అంతం లేని జీవనశైలి.
అయితే, అధిభౌతికానికి కావలసింది పదార్థ ఫలానురక్తి. భౌతికాలపై మోజు ఉండదు, ఆసక్తి ఉండదు... ఉండేదల్లా పరార్థ ఆవాసం కోసం తపన. ఈ జీవితం - ఈ మానవ అవతారం - ముగిసిన తర్వాత ఆత్మ ఎలా, ఎక్కడ స్థితమై ఉంటుందన్న తపనే తపస్సుగా పరిణమిస్తుంది. ఈ పరార్థ తపన నుండి పుట్టుకొచ్చేవే యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు. మన నేత్రద్వయానికి ఇవి భౌతికాలనిపిస్తాయి. కానీ, మూడో నేత్రానికి అవి అధిభౌతికాలే. అవి భౌతికమైన జ్ఞాన విజ్ఞానాల కోసం కాదు.. అధిభౌతికమైన పరప్రజ్ఞ కోసం.
అందుకే కృష్ణుడు - ‘యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం’ - యజ్ఞం, దానం, తపస్సు ఎట్టి పరిస్థితుల్లోను వదలిపెట్టక; ‘కార్యమేవ’ - తప్పక చేస్తుండాలి; అని స్పష్టంగా చెపుతాడు. ఎందుకంటే ‘మనీషిణామ్’ - మహాత్ముల్ని కూడా ‘యజ్ఞోదానం తపశ్చైవ పావనాని’ అంటే యజ్ఞ దాన తపస్సులను సైతం పవిత్రపరచగలవు ఆ నిర్దిష్ట కర్మలు.
ఇంతకీ, యజ్ఞం - విశ్వకల్యాణం కోసం, దానం విశ్వ ప్రేమ కోసం, తపస్సు - విశ్వ చైతన్యం కోసం. అంటే ఈ మూడు కర్మలు మనల్ని విశ్వమిత్రుల్ని చేస్తాయి.
ఈ విశ్వహిత కర్మలన్నీ మన పరంగా స్వధర్మాలనిపిస్తుంటాయి.. కానీ అవి స్వార్థం ముసుగు కప్పుకోకపోవటంవల్ల ఈ కర్మ ఫలితం విశ్వవ్యాప్తం. మనలో ఆసక్తి కానీ, కర్మ ఫలాపేక్ష కానీ లేదంటే అవి నిర్దిష్ట కర్మలనే అర్థం. నిర్దిష్ట కర్మలతో మన భౌతిక వర్తనమంతా విశ్వహితాన్ని కాంక్షిస్తున్న అధిభౌతిక వర్తనం కిందే లెక్క.
నిజానికి యజ్ఞం - దానం - తపస్సు... ఇవి నిర్దిష్ట కర్మలు... దైహికంగా అనిపించే దేహాతీత, మానవాతీత కర్మలు... అధిభౌతిక కర్మలు. ఈ నిర్దిష్ట కర్మ ఫలితాలన్నీ పర ప్రయోజనం కోసమే. సపోజ్, నిర్దిష్ట కర్మలను అంటే యజ్ఞం, దానం, యోగం - ఇవేవీ చేయకుంటే ఏమవుతుందన్న ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు -
‘నియతస్య తు సంన్యాసః కర్మణో నోపహద్యతే
మోహాత్తస్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః’ అని అంటాడు. అంటే మనలో సత్వగుణం లోపించిందనే! తమో గుణం చొరబడిందనే! కాబట్టి మానవ జన్మ ఒక పరిపూర్ణ జన్మగా పరిణమించాలంటే యజ్ఞం చేతనో, దానం చేతనో, యోగం చేతనో అధిభౌతికంగా సంపన్నం కావలసిందే! అంటే మానవ అవతారంలోని ‘ఆత్మ’ ఈ దేహం నుండి తప్పుకున్న తర్వాత సుస్థిర స్థితిని చేరుకోవాలంటే కేవలం దైహిక కర్మలకే పరిమితమైపోక, నిర్దిష్ట కర్మలకు నెలవు కావాలి. అదీ మన దేహానికి చెందిన భౌతిక సంస్కారం అనిపించే అధిభౌతిక సంస్కారం.. ఆత్మ సంస్కారం.
అసలు, ఆధ్యాత్మిక వర్తనాన్ని అంటే మానసిక, దైహిక సంయమనాన్ని కష్టసాధ్యం అనుకుంటే ఎలా? ఈ అధి భౌతిక వర్తనం మన దైహిక జీవనాన్ని నొప్పిస్తుందనుకుంటే ఎలా? అలా అనుకోవటం భ్రమించటమా? భ్రమించటంవల్ల మన జీవితం తమోగుణానికి ఆలవాలమవుతుంది. కాబట్టి పదార్థ జగతికే అంకితమై పోకుండా, భౌతిక ఫలాసక్తి లేకుండా ఉండగలిగితే మన ఈ మానవజన్మ సాత్విక గుణ శోభితమే అవుతుంది.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946