వినదగు!

కర్మాచరణలో రాగద్వేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మాచరణ విషయంలో మన జ్ఞానం కూడా మూడు విధాల పురివిప్పుతుంటుంది - సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానాలుగా. సృష్టిలో విభిన్న జీవులు, ప్రాణులు, భూతాలు. అయితే వీటిని వేరువేరుగా కాక వాటి తత్వాన్ని విభక్తం కానిదిగాను, వినాశం లేనిదిగాను పరిగణించే జ్ఞానం కలిగి ఉండటమే సాత్విక జ్ఞానం. ఇలాకాక భిన్నంగా చూడటం రాజస జ్ఞానం. అల్పంగా చూడటం తామస జ్ఞానం.
ఇలా మనలోని జ్ఞానమే కాదు మన కర్మలు సైతం మూడు రకాలు-
‘నియతం సంగరహిత మరాగ ద్వేషతః కృతమ్
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్విక ముచ్యతే’
అంటే, కర్మాచరణలో రాగద్వేషాలు చోటు చేసుకోకూడదు. అత్యాసక్తీ పనికిరాదు. ఫలాభిలాషా అనవసరం. ఇలా రాగద్వేష రహితంగా, అత్యాసక్తి రహితంగా, ఫలకామన లేకుండా చేసే నిత్యకర్మలే సాత్విక కర్మలు. ఈ సాత్విక లక్షణాలకు విరుద్ధంగా కామాతురతతో, అహంకార పూరితంగా చేసే కర్మలు రాజస కర్మలు. కష్టనష్టాల పరిగణన లేకుండా, సమర్థత అసర్థతలను పసిగట్టకుండా మోహ స్వభావంతో చేసే కర్మలు తామస కర్మలు.
ఇక, కృష్ణుడు మన బుద్ధిని కూడా సాత్వికం, రాజసం, తామసం అని మూడు విధాలుగా పరిగణించటం కర్మ మార్గాన్ని, కర్మ నివర్తనా మార్గాన్ని వివేచించగల బుద్ధి, కార్యాలను అకార్యాలను విడివిడిగా చూడగల బుద్ధి, భయాలకు అభయాలకు మధ్యనున్న భేదాన్ని పసిగట్టగల బుద్ధి, బంధాన్ని బంధరాహిత్యాన్ని అంటే మోక్షత్వాన్ని విడిగా చూడగల బుద్ధి సాత్విక బుద్ధి. ఇలా విరుద్ధలను విరుద్ధాలుగా చూడలేక ఒకటిగానే పరిగణించటం రాజస బుద్ధి. నెగెటివ్‌గా ఉన్న వాటిని సైతం పాజిటివ్‌గా పరిగణించటం తామస బుద్ధి. దీనే్న ‘సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ’ అని అంటాడు గీతాచార్యుడు.
* * *
విషాదం, వోకం, భయం, మదం, స్వప్నం - ఈ అయిదు లక్షణాలు మన పాంచభౌతిక జీవనంలో నిలదొక్కుకుని ఉంటే మనది తామస ధృతి. మన అవసరార్థం ధర్మ, అర్థ, కామాలకు నిలయమయి ఉంటే మనది రాజస ధృతి. ఏకాగ్రచిత్త సంస్కారంతో వర్తించటం సాత్విక ధృతి. దీనే్న భగవద్గీత - ‘్ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేన్ద్రియ క్రియాః
యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్విక్’ అని అంటుంది.
ఇంతకీ ఈ సాత్విక ధృతి యోగాభ్యాసకులకే సాధ్యం. కారణం వారి మనోవ్యాపారం వ్యభిచరించని చిత్తమై ఉంటుంది. అంటే యోగ సాధకులకి మానసిక క్రియలు, ప్రాణ క్రియలు, ఇంద్రియ క్రియలు వశమై ఉంటాయి. దీనే్న ఏకాగ్రచిత్తం అంటాం. అంటే సాత్విక ధృతి వల్లనే ఏకాగ్రత, ఏకాగ్రత వల్లనే యోగ పూర్ణత్వం సాధ్యం.
* * *
‘యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమమ్
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మ బుద్ధి ప్రసాదజమ్’
అవును, యోగ సాధన ప్రారంభ దినాలలో బుద్ధి నెమ్మదించటం, నిర్మలంగా ఉండటం కాస్త కష్టసాధ్యమే. ఈ వర్తనం అలవడేవరకు విషతుల్యంగానే ఉంటుంది. అయితే గిక పరిణావంతో ‘అమృతం’లా పరిణమిస్తుంది. ఇలా తొలిగా ‘విషం’లా ఉన్నదే తుది దశలో ‘అమృతం’లా పరిణమించటమే సాత్విక సుఖం. అయితే దీనికి విరుద్ధంగా తొలుత అమృతంలా అనిపిస్తూ ఆ తరువాత విషంలా మారటం రాజస సుఖం. ఇక,
‘యదగ్రే చానుబనే్ధ చ సుఖం మోహన మాత్మనః
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామ సముదా హృతమ్’
అని అంటుంది గీత - తామస సుఖాన్ని గురించి. అంటే, నిద్ర, సోమరితనం కలగజేసే సుఖం తామస సుఖం అని అర్థం.
ఇన్ని విధాల మన మానవ అవతారాన్ని జల్లెడ పడుతూ ‘స్వే స్వే కర్మణ్య భారతః సంసిద్ధిం లభతే నరః’ మన కర్మాచరణలో మనం చూపించే ఆసక్తే మన సిద్ధత్వానికి ఆలంబన అని తేల్చేస్తాడు గీతాచార్యుడు. పైగా - ‘సహజం కర్మ కౌనే్తయ సదోష మపి న త్యజేత్’ - స్వభావాన్ని బట్టే కర్మాచరణ సాధ్యమవుతుంటుంది కాబట్టి కర్మ విషయకంగా ఎటువంటి దోషాలు దొర్లినా కర్మాచరణలో వెనుతిరగకూడదు. కారణం, అగ్నిని ధూమం కప్పినట్లుగా కర్మలనూ దోషం కప్పి ఉంటుంది కాబట్టి,
చివరికి గీతాచార్యుడు తేల్చిందేమిటంటే-
‘అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః
నైష్కర్మ్య సిద్ధిం పరమాం సంన్యాసేనాధి గచ్ఛతి’
అని - అసక్త బుద్ధితో మనసును జయించాలి. ఆశలు తొలగితేనే నైష్కర్మ్య సిద్ధి.
ఇలా, మనసును జయించటం, నైష్కర్మ్య సిద్ధిని పొందటం సాధ్యమయ్యేది యోగంలో తల మున్కలయిన వారికే. అందుకే యోగ పూర్ణులను పూర్ణ పురుషులు అనేది. శ

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946