వినదగు!

యోగేశ్వర విశ్వ‘రూప’ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాశ రహితమైన విశ్వ సంపదను రూపంగా దర్శించగలగటం గిక ప్రజ్ఞతోనే సాధ్యం. నిజానికి, విశ్వ సంపద అంతా యోగేశ్వర తత్వమే! ఆ విశ్వ సంపద ఐశ్వర్య సంపన్నం, శక్తి సంపన్నం, బల సంపన్నం, వీర్య సంపన్నం, తేజస్సంపన్నం, జ్ఞాన సంపన్నం, విజ్ఞాన సంపన్నం.. వెరసి ప్రజ్ఞాన సంపన్నం. జ్ఞాన విజ్ఞానాలు భౌతిక పరిధులలో అందుతాయి కానీ ప్రజ్ఞానం అందేది గిక వర్తనంతోనే. కారణం ఆ ప్రజ్ఞానం ‘శతశోథ సహస్రశః’ ‘నానావిధాని దివ్యాని’ ‘నానావర్ణాకృతీని’ కాబట్టి. వన ఎరుకలో లేని, మనం ఇతఃపూర్వం చూడని ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విన్యాదులను, మరుత్తులను, మరింత ఆశ్చర్యకర జగత్తును సైతం కలిగినటువంటిది ఆ విశ్వ సంపద. ఇన్ని మాటలెందుకు, చరాచర జగత్తంతా ఆ విశ్వసంపదనే. ఈ విశ్వ సంపన్నతను చూడటానికి మానవ నేత్రాలు సరిపోవు. దివ్య దృష్టి కావాలి. ఈ గిక నేత్రం తెరచకోవాలంటే యోగమే ఆలంబన. ఇంతకీ ఆ విశ్వరూపం ఎటువంటిదంటే-
‘సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్’ అంటే సర్వ ఆశ్చర్యాలకు ఆకరమైంది.. అన్ని దిక్కులా వ్యాపించినటువంటిది.. పైగా అనంతం. సహస్ర సూర్యుల కాంతి ఏక సమయంలో ప్రసరించినట్లుంటుంది ఆ విశ్వకాంతి. అనేక రూపాలలో విభక్తమైన జగత్తును ఆ విశ్వకాంతిలో దర్శించగలం. అంతేకాదు, ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు, సప్తర్షులు, దివ్యసర్పాలు, వారివారి అనుచర గణం - ఇలా చతుర్దశ భువనాలలో కొలువై వున్న సృష్టి నంతటినీ దర్శించగలం. ఈ విశ్వ రూపానికి ఆది లేదు, అంతం లేదు, కేంద్రం లేదు... పైగా ఈ విశ్వరూపుని బాహువులు అన్ని వైపులకు విస్తరించినటువంటివి. అనేక ముఖాలు, అనేకానేక నేత్రాలు కలిగిన ఈ రూపం విశ్వ పురుషుని స్వంతం. సూర్యకాంతి, అగ్నికాంతి కలగలిసిన మిరుమిట్లు గొలిపే తేజోరూపం ఆ విశ్వ పురుషునిది. తన సారధిగా వచ్చి గీతోపదేశం చేస్తున్న ఈ విశ్వ పురుషుడ్ని అర్జునుడు నాశరహితమైన విశ్వ బ్రహ్మగా దర్శించాడు- విశ్వరచనకు ఆధారమైన వాడిగా దర్శించాడు... శాశ్వత ధర్మకర్తగా దర్శించాడు. మార్పు లేనివాడిగా దర్శించాడు.. సనాతన పురుషుడిగా దర్శించాడు. అందుకే కృష్ణుడి విశ్వరూపాన్ని-
‘అనాది మధ్యాన్త మనన్త వీర్య మనన్త బాహుం
శశి సూర్య నేత్రమ్
పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా
విశ్వమిదం తపన్తమ్’గా దర్శిస్తాడు. అనాది, అమధ్య, అనంతంగాను; అనంత పరాక్రమవంతుడిగాను, అనంత బాహుబల సంపన్నుడిగాను; శశి సూర్య నేత్రుడిగాను; ప్రజ్వలిత అగ్నిముఖ తేజస్సుతో ఈ విశ్వాన్ని తపింప చేస్తున్న వాడిగాను దర్శిస్తాడు. ఇటు పృథ్వికీ, అటు ఆకాశానికీ, అష్ట దిక్కులకూ వ్యాపించిన యోగేశ్వర విశ్వరూపాన్ని అర్జునుడు చూశాడు. అయితే ఈ విశ్వరూపం ఒకవైపు ఆశ్చర్యకరమైందిగాను, ఆనంద దాయకమైందిగాను దర్శనమిస్తూనే మరోవైపు ఉగ్రత్వంతోను దర్శనమిచ్చింది. విశ్వ పురుషునిలోని, విశ్వ సంపదలోని ఆ ఉగ్రత్వం ఒక్క అర్జునుడినే కాదు ముల్లోకాలను భయభ్రాంతులకు గురి చేసింది.
ఒకవైపు ఆనందాన్ని, ఇంకొకవైపు భయాన్ని కలుగజేస్తున్న ఆ విశ్వరూపాన్ని దేవతాగణం, సప్తర్షి మండలం, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, విశే్వసులు, అశ్విన్యాదులు, మరుత్తులు, ఊష్మవులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు ఆశ్చర్యచకితులై చూస్తున్నట్లుగానే అర్జునుడు సైతం చూస్తూ, ఆనందమనుభవిస్తూనే మరొకవైపు వికృత ముఖాలతోను, భయంగొల్పే నేత్రాలతోను, అసాధారణ పాదాలు, తొడలతోను, రకరకాల ఉదరాలతోను, భయంకరమైన కోరలతోను ఉన్న విశ్వ పురుషుని ఉగ్రరూపాన్ని చూడటం అర్జునుడికి భరింపరానిదే అవుతోంది. అందుకే భయపడుతున్న అంతఃకరణ కలవాడవుతూ, తాను ధైర్యాన్నీ శాంతినీ పొందలేక పోతున్నానంటాడు అర్జునుడు కృష్ణుడితో. అర్జునుడికి విశ్వరూపంలో ఉగ్రరూపాన ప్రళయ కాలాగ్ని ముఖం కనిపించింది. ఆ భయంకర రూపం ముందు దిక్కులు తెలియకుండా పోయాయి. సుఖం లేకుండా పోయింది. చక్రవర్తులు, మహాసేనానులు, కౌరవులు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, కౌరవ పాండవ సైన్యంలోని మహా యోధులు సైతం ఆ ఉగ్రరూప ప్రవేశం చేస్తుండటం చూశాడు.
ఒకవైపున ఆశ్చర్యకర రూపాన్ని, మరొకవైపున ఉగ్రరూపాన్ని విశ్వరూపంలో దర్శించిన అర్జునుడు ‘విజ్ఞాతు మిచ్ఛామి భవన్తమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిమ్’ - ఆదిపురుషుడవైన నీ వర్తనం నాకు అంతుచిక్కకున్నదంటాడు. అర్జునుడికి అర్థంకాని తన తత్వాన్ని ‘కాలోస్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్సమా హర్తు మిహ ప్రవృత్తః’ - లోకాలను సంహరించే కాలుడను తానేనని, లోక క్షయానికే తన ఈ విజృంభణ అని సుబోధకం చేస్తాడు ఆ విశ్వ పురుషుడు. పైగా ‘నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా అంటే శత్రు సైన్యాన్ని వినాశనం చేసి విజయ సంపన్నుడివి అయినా కాకపోయినా ఈ సృష్టి వినాశనం తప్పదు - ఈ వినాశన కారకత్వంలో నువ్వు నిమిత్తమాత్రుడివే... కర్తృత్వ పరంగా నువ్వు కర్మయోగివే’నంటాడు.
అందరినీ నేను ముందే చంపేశాను. నీవు నిమిత్తమాత్రుడివిగా కర్మ చేయి. అంతే’ అని అంటాడు. మొత్తానికి అర్జునుడు విశ్వరూప దర్శనంతో గ్రహించింది - విశ్వాన్ని సత్తుగాను, అసత్తుగాను, సదసత్తులకు అతీతంగాను, వినాశరహితంగాను, ఆదిగాను, అనంతంగాను, పురాణ పురుషతత్వంగాను, విశ్వవ్యాపకత్వంగాను, పంచ భూతాత్మకంగాను, సూర్య చంద్రాదులుగాను, అష్టదిక్కులుగాను -
‘అనన్త వీర్యామిత విక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోసి సర్వః’ గాను-
‘పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్’ గాను- ఇంతకీ ఈ విశ్వ ‘రూప’ దర్శనం వేదాధ్యయనంలోను, యజ్ఞ కర్తృత్వంతోను, యజ్ఞ్ధ్యాయనంతోను, అగ్నిహోత్ర నిర్వహణతోను, ఉగ్రతపస్సుతోను, దానాదులతోను సాధ్యపడదు.
ఎవరికి విశ్వరూప దర్శనం సాధ్యం అంటే - ఏ విషయంలోను అత్యాసక్తి లేని, వైర స్వభావం లేని, సర్వభూతాలను ప్రేమించగల కర్మయోగులకు మాత్రమే.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946