వినదగు!

స్థిరత్వ, స్థితత్వాలే నాయక ‘సమత’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీతలో అర్జునుడు నాయకుడా?
కృష్ణుడు నాయకుడా?
కృష్ణార్జునుల అంశలతో మనం నాయకులం కాలేమా?
కురుక్షేత్రం యుద్ధ క్షేత్రమే.. అంటే కర్మక్షేత్రమే!
మన మానవ క్షేత్రమూ జీవక్షేత్రమే.. కర్మక్షేత్రమే!
నాటి సంగ్రామం కౌరవ పాండవుల మధ్యన.
నేటి సమాజంలో మన పోరు వివిధ స్థాయిలలో.
అలనాడు న్యాయం - అన్యాయం, ధర్మ - అధర్మంల భూమికగా రణభూమికి అడుగులు పడ్డాయి.
ఈనాడు మన మానవ క్షేత్రంలో నెగెటివిటీ - పాజిటివిటీలతో మానసిక ఘర్షణ.
అర్జునుడు కురుక్షేత్రంలో అయిన వారిని, ఆత్మీయుల్ని చూసి తల్లడిల్లి తలక్రిందులయ్యాడు.
మనం మనవే అయిన ఆలోచనా ధోరణులతో తబ్బిబ్బవుతున్నాం.. తలమునక లవుతున్నాం.
నాడు అర్జునుడు గెలుపొందటం ఒక అవసరం.. అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి.
నేడు మనం గెలవటం ఒక అత్యవసరం.. మన అస్తిత్వం వెల్లడి కావటానికి. అప్పట్లో అర్జునుడిది జీవన సంగ్రామమే! ఇప్పట్లో మనదీ జీవన పోరాటమే! అప్పుడు అర్జునుడు విజయుడయ్యాడు. ఇప్పుడు మనం విన్నర్లం కావాలి. అన్నట్టు విజయం నాయకత్వ శోభితం కావాలి.. అదీ ముఖ్యం... నాయకత్వ లక్షణాలతో ప్రకాశమానం కావాలి. చెడును, అధర్మాన్ని తుదముట్టించటమే మనుగడ లక్ష్యం కావాలి.
కురుక్షేత్రంలోనైనా, కార్యక్షేత్రంలోనైనా, జీవన క్షేత్రంలోనైనా మధ్యన పొడచూపే భావోద్విగ్నతలన్నీ నాయకత్వ ప్రతిభతో సమసించి విజయం వరించటమే ముఖ్యం. ఎంతలా వగచినా చివరికి యుద్ధం చేయక తప్పలేదు అర్జునుడికి.. మనమూ అంతే.. నాయక లక్షణాలతో బ్రతికి బట్ట కట్టవలసిందే!
కృష్ణోపదేశం ‘పోరు’ తప్పదు అని చెప్పటానికే. ఆ పోరుకు తగ్గ మానసిక శిక్షణను అందించేదే గీత. ముఖ్యంగా మనలోని ప్రతి ఒక్కరం గెలవటానికి కావలసిన వౌళిక సూత్రాలను మనం గీతలో చూడగలం. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల ఏళ్ల క్రితం గీతలో చెప్పబడ్డ నాయకత్వ లక్షణాలు, నాయక లక్ష్యాలు క్రీస్తు తర్వాత రెండు వేల ఏళ్లయినా వర్తమానానికీ వర్తిస్తుండటం గీతా రహస్యం. గీతను కేవలం ఒక హైందవ మత గ్రంథంగా కాక ఒక సామాజిక వికసన గ్రంథంగా ప్రపంచ మేధావులు పరిగణిస్తుండగా దాన్ని కేవలం భక్తిపీఠానికే పరిమితం చేసి మనం మిన్నకుంటే ఎలా?
అసలు గీతోపదేశం ప్రారంభమైంది భావోద్విగ్నత ప్రాతిపదికనే. అర్జునుడు భావోద్రేకంతో కృష్ణుడి ముందు తలవంచకపోతే
భగవద్గీత ఆవిష్కృతమయ్యేదే కాదు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తోపాటు పర్సనాలిటీ, కేరెక్టర్, ఇంటిగ్రిటి అనేవి లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటన్నిటితోపాటు సందర్భానికి తగ్గ నాయకత్వం - సిట్యుయేషనల్ లీడర్‌షిప్ - ప్రధాన భూమిక అవుతోంది. ‘కతుస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్’ అని కృష్ణుడు అర్జునుడితో కలవరపాటుతో భావోద్విగ్నం కావటానికి ఇది సమయం. సందర్భం కాదంటాడు. అంటే కార్యక్షేత్రంలో నాయకుడి కలవరపాటు విఘ్నాలకు దారితీస్తుందనేగా! ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం’ అని అంటున్నాడంటే హృదయ దుర్బలత్వం నాయకుడి ప్రతిభను నిర్వీర్యం చేస్తుందనే కదా! అందుకే అర్జునుడు కూడా ఒప్పుకున్నాడు తనది ‘కార్పణ్య దోషోపహత స్వభావ’మని. అంటే నాయకుడి దైన్య స్వభావం అతడి వ్యక్తిత్వాన్ని కాలుష్యపరుస్తుందనే! కురుక్షేత్రంలో ఆదిలోనే మానసిక స్థిరత్వాన్ని కోల్పోయిన నాయకుడు అర్జునుడు. అంటే సందర్భానికి, సమయానికి తగ్గట్లుగా ప్రతిస్పందించటంలో వెనకపడ్డాడు. అందుకే కృష్ణుడు సిట్యుయేషనల్ లీడర్‌షిప్ ఎలా ఉండలా తన గీతోపదేశం ద్వారా మన ముందుంచాడు. నాయకులం కావాలంటే కావలసింది ఛాలెంజ్‌ను ఎదుర్కోవటం. ఆనందానికి ఉప్పొంగిపోవటం. బాధకు తల్లడిల్లిపోవటం కూడదు. స్వార్థంలో కూరుకుపోకూడదు. కోపతాపాలు, భయాందోళనలు అసలే పనికిరావు. సంయమనం, నిస్వార్థం సహజ కుండలాలు కావాలి. వ్యక్తిత్వాన్ని, వ్యక్తిమత్వాన్ని కోల్పోకూడదు. మనపై, మనం ఉంటున్న సమాజంపై పట్టు కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు, ఎలా ప్రతిస్పందించాలో తెలిసి ఉండటమే సిట్యుయేషనల్ లీడర్‌షిప్. అయితే గీతలో ఈ నాయకత్వ లక్షణాలన్నీ తాత్వికతలో పొదిగి ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా చూడగల నేర్పు మన స్వంతం కావాలి. ఈ రోజు మనం ఎంతో అధునాతనమైన అంశాలుగా చెప్పుకుంటున్న వర్క్, నాలెడ్జ్‌లు గీతలో కర్మ, జ్ఞానాలుగా కనిపిస్తాయి. అలాగే వర్కర్ అంటే కర్మిష్ఠి, నాలెడ్జ్ వర్కర్ అంటే జ్ఞాని. అసలు జ్ఞానికైనా, కర్మిష్ఠికైనా ముందుగా తన గురించి తనకు తెలిసి ఉండాలి. తాను చేయగలది ఏమిటో, చేయలేనిది ఏమిటో తెలిసి ఉండాలి. తనకు తన బలమేమిటో తెలిసి ఉండాలి. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ముఖ్యం. ఇలా తన గురించి తనకు సంపూర్ణ అవగాహన లేనపుడు ఏ వ్యక్తీ ఒక నాయకుడిలా స్పందించలేడని నిర్ద్వంద్వంగా చెప్తోంది గీత. అంటే నాయకుడికి తన భౌతికత గురించి తెలిసి ఉండాలి. తన మానసికత గురించి తెలిసి ఉండాలి. తనలోని చైతన్య స్థితి గురించి తెలిసి ఉండాలి. నాయకుడికి తన దైహిక, మానసిక, చైతన్య వర్తనాలపై పట్టు ఉండాలి.
ఇక చైతన్య స్పర్శలు ఇంద్రియ స్పర్శల కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి మన చైతన్య స్థితి మన ఎరుకలో ఉండి తీరవలసిందే. అప్పుడే ధ్యాన స్థితిలో సాధ్యమయ్యే స్థితత్వం, స్థిరత్వం మన వశమవుతుంది. ఎప్పుడైతే ఈ స్థిరత్వం, స్థితత్వం సాధ్యవౌతుందో అప్పుడు మన ఆలోచనలపైన, ఇంద్రియాలపైన పట్టు సాధ్యవౌతుంది. బహుశా ఇందుకే కాబోలు కృష్ణుడు అర్జునుడికి అంతటి మహా సంగ్రామం జరగబోతున్న తరుణంలోనూ యోగావిష్కరణ చేశాడు. అసలు ప్రతి వ్యక్తికీ సెల్ఫ్ రియలైజేషన్ అంటే తన విలువ ఏమిటో, తన అస్తిత్వం ఏమిటో తెలిసి రావాలంటే ధ్యానమగ్నం కావటం ముఖ్యం అన్నది కృష్ణ ఉవాచ. ఈ రోజు బయటి ప్రపంచంలో కనిపిస్తున్న నాయకుల్నే లీడర్స్ అనుకుంటున్నాం. నిజానికి తనను తాను అర్థం చేసుకున్న వాడే అసలైన నాయకుడు. ఏ వ్యవస్థలోనైనా ఇతరులలోని శక్తిని, బలాన్ని వెలికితీసి సమర్థులుగా చేసేవారే నాయకులు. ఇలా చూసినప్పుడు కృష్ణుడు అసలైన నాయకుడిలా ప్రత్యక్షమవుతాడు. అందుకే గీతోపదేశం అంటే నాయకోపదేశమే.
* * *
‘స్వధర్మమపి చావేక్ష్య న వికంపితు మర్హసి’ అన్న శ్లోకంలో స్వధర్మాన్ని పరిగణనలోకి తీసుకుని కర్తవ్య పరాయణత నుండి వెనుతిరగటం తగదు అని కృష్ణుడు అనటంలో స్వధర్మానికి మించిన వ్యవస్థా ధర్మాన్ని పరిరక్షించాల్సింది నాయకులే అని చెప్పక చెప్పినట్టయింది.
సిట్యుయేషనల్ లీడర్‌షిప్‌కు కావలసిన మరో పార్శ్వం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎక్కడైతే భావోద్విగ్నతలకు తావుండదో అక్కడ నాయకత్వ ప్రతిభ సరిగా రాణిస్తుంది. అసలు మనం భావోద్విగ్నతలతో సతమతమవుతూ సరియైన నిర్ణయాలు తీసుకోగలమా? తీసుకోలేం. అటువంటప్పుడు ఇక నాయకత్వం నెరపే స్థితత్వం ఎక్కడ ఉంటుంది? అన్ని సందర్భాలలో స్థిరంగా ఎలా వ్యవహరించగలం? ఇంతకీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే "A discipline of understanding ourselves, especially the emotions that brew in our mind'.
జ్ఞాన ఫిపాసలో క్రమశిక్షణ, వాక్భాషణంలో క్రమశిక్షణ, సమత్వ భావనలో క్రమశిక్షణ నాయకులు లక్షణ సమన్వితులు కావటానికి, వారి సమర్థ నాయకత్వం వర్థిల్లటానికి అవసరమంటుంది గీత. అసలు నాయకులు ప్రభావవంతులు, ప్రతిభాశాలురు కావాలంటే గత నాయకత్వాల నుండి నేర్చుకుంటూ, వర్తమానంగా కొత్తపుంతలు తొక్కాల్సిందే. నాయకులన్న వారు ఇతరులకు నేర్పించటం ఎంత ముఖ్యమో, తామూ నేర్చుకోవటం అంతే ముఖ్యం.
ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిదే లీడర్‌షిప్ ప్రభావవంతం కాదన్నది నేటి మాటనే.. కాదు నాటి కృష్ణుడి మాట కూడా! నిజాయితీగా, గౌరవంగా చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పటం నాయక ప్రతిభ అవుతుంది. అసలు నాయకుల మాటలే మంత్రాలలా పని చేయాలి. అంటే నాయకుల మాటలు అంతలా ప్రభావం చూపాలి. మంత్రముగ్ధుల్ని చేయాలి. అప్పుడే నాయకుల విజన్, మిషన్ సంపూర్ణమవుతుంది.. సత్ఫలితాలనిస్తుంది. త్యాగధనులు కావటం అన్నది నాయకులకు పెట్టని భూషణం కావాలి. మనం అనుకుంటున్నట్టుగా నెగెటివ్ థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ పనికిరావని కృష్ణుడూ చెప్పాడు. అలాగే అందరినీ సమంగా చూడటం, అన్నిటినీ సమభావంతో చూడటం అవసరం. నిస్వార్థ సేవే తప్ప స్వార్థంతో కూడుకున్న పనులు పనికిరావు. సోమరితనం, నిజాయితీ లేకపోవటం, క్రమశిక్షణా రాహిత్యం ఏ కోశానా ఆదరణీయం కాదు. మూర్ఖత్వం మూడు ఆమడల దూరంలో ఉండాలి.
మొత్తానికి ‘సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జ’ అన్న శ్లోకం ద్వారా నాయకులు సుఖానికి, దుఃఖానికి, లాభాలకు, నష్టాలకు, జయాలకు, అపజయాలకు అతీతంగా అంటే రాగద్వేషాలను దరిచేరనీయక వర్తిస్తూ, గమ్యం వైపు సాగిపోవాలి అన్నదే కృష్ణోపదేశ సందేశం.
*

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946