వినదగు!

అస్తిత్వ ఆరాట యోగోపదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాకు నేనుగా ఉండలేనా?’
కలిసిన ప్రతిసారి చైతన్యం ఇలాగే ప్రశ్నిస్తుంటాడు.
చైతన్యకు అవి ప్రశ్నలు కావచ్చు కానీ నాకు మాత్రం అవి ప్రశ్నల్లా అనిపించవు. అది ఆరాటం... తపన.
నిజానికి, ఈ ప్రశ్నలు చైతన్య ఒక్కడిదే కాదు, తన తరానికి చెందిన ఆరాటమే కాదు.. అది తరతరాల తపన.
తపనకు సమాధానం తపస్సు, యోగ సాధన తప్ప మాటల అల్లిక కాదు... ఆలోచనల గూడూ కాడు.
చైతన్యకు అనే కాదు, చైతన్య తరానికైనా, ఏ తరానికైనా నా స్థిర సమాధానం మాత్రం ‘ఉండగలవు’ అనే.
‘నిజానికి ఎవరమైనా మనకు మనంగా ఉండాలంటే జీవన చట్రంలో ఎన్నో గర్షణలు, మరెన్నో సంఘర్షణలు తప్పవు. జీవన క్షేత్రంలో వాటికి ఎదురొడ్డి నిలబడ గలిగినప్పుడే ‘నా’ మనగలిగేది.
అదే నా అస్తిత్వం.
అస్తిత్వ జీవన పోరాటాన్ని గికంగా గదిగుచ్చిందే భగవద్గీత. ఈ గీతాసారధి కృష్ణుడు. కృష్ణ ఉవాచని త్రికరణ శుద్ధితో విన్నవాడు అర్జునుడు. పైగా, విన్నదాన్ని త్రికరణాత్మకంగా ఆచరించి విజయుడయ్యాడు. కృష్ణుడి యోగోపదేశాన్ని తన వ్యక్తిత్వంలో రంగరించుకుని తరతరాలకు విజయబాట అయ్యాడు. అదే అసలైన అర్జున గిక సంయమనం. అదే గిక సిద్ధి. కాబట్టి, భగవద్గీత అంటే యోగసూత్ర సంహిత.’
ఇలా సాగుతుంటుంది చైతన్య వంటి వారితో నా వివరణాత్మక సంభాషణ.
‘సామాజిక ఉన్నతితోపాటు ఆధ్యాత్మిక పరిణతిని అంటే గిక సిద్ధిని పొందటం ఎలా? అన్న ప్రశ్నకు సదీర్ఘ సమాధానమే కృష్ణ గీత - అవునంటారా’ అంటూ కృష్ణ చైతన్య కాస్త తల పంకించాడు.
‘అవును, చైతన్యా! ఒకవైపు దేహాత్మ ప్రాపంచిక బంధాలతో ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా నిలవరించుకోవటాన్ని గీత చాల ప్రస్ఫుటంగా చూపుతూ, మరోవైపు జీవాత్మ గికంగా పరిణవించగల అవకాశాలను కళకు కట్టినట్లు చూపించింది. దేహంలో ఉన్న ఆత్మ దేహాతీతంగా ఎదగగల నేపథ్యాన్ని కృష్ణ ఉపదేశంలో చూడగలం. పైగా, భగవద్గీతలో పైకి కనిపించేది స్వధర్మం, సామాజిక ధర్మం -లే అయినా ప్రస్ఫుటీకరించింది మాత్రం ఆత్మ ధర్మానే్న.’
‘అంటే ఆత్మయోగమనేగా గురువుగారూ! ఒక్క క్షణం భగవద్గీతను పక్కన పెడదాం. ఈ రోజు ప్రపంచానికి కావలసింది భౌతిక ప్రాపంచిక జీవన లాలస. మనం చూస్తూనే ఉన్నాం... ప్రతి ఒక్కరం మొదటగా ఆరోగ్యం వెంట పడ్తున్నాం. దేహారోగ్యాన్ని, మానసికారోగ్యాన్ని కాపాడుకోవాలంటూ జిమ్‌ల వెంట, యోగా స్టూడియోస్‌లో నేర్పించే వ్యాయామల వెంట, మహా అయితే ఆసనాల వెంట పడ్తున్నారు. అంటే ఈనాడు హఠ యోగానికి లభిస్తున్న ఆదరణ గీతలో చెప్పిన కర్మయోగానికి లభించటం లేదనిపిస్తోంది’ చైతన్య.
‘అవును చైతన్యా! నువ్వన్నట్లు భగవద్గీత పూజా పుస్తకం అయిపోయిందా అనిపిస్తోంది. సహస్ర నామాల్లా గీతా శ్లోకాలు కూడా నిత్య పారాయణానికే పరిమితమై పోయాయా అనిపిస్తోంది. గృహస్థులు గీతను పూజాకుసుమం చేసి రోజూ పూజ గదిలో ఒక అధ్యాయ పఠనానికే పరిమితమై పోతుండటం చూస్తుంటే బాధేస్తుంటుంది. నిజానికి, ఇహానికి సంబంధించిన ఆరోగ్య సంహిత పతంజలి యోగసూత్రాలది అయితే పరానికి సంబంధించిన యోగ సూత్ర సంహిత భగవద్గీతది. భగవద్గీతను మనం కేవలం వ్యక్తిత్వ వికాస సంహితలా కాక గిక సిద్ధిని అందించే రహస్య నిధిలా తరచి చాడగలిగితే మనం ప్రజ్ఞాన పూర్ణులం అవుతాం.’
‘అన్నట్టు, హఠయోగం ఒక్క సన్యాసాశ్రమంలోని వారికే పరిమితం కదా! మరి ఈ రోజు ప్రతి ఒక్కరూ హఠయోగం వెంట పడ్డారేమిటి?’ చైతన్య ప్రశ్న.
‘నువ్వనుకున్నట్టు, నువ్వు చెబుతున్న సాంసారికులు సైతం నూటికి నూరు శాతం హఠయోగులు కాదు. ఆసన, ప్రాణాయామ సాధన చేసినంత మాత్రాన హఠయోగి అని కాదు. పతంజలి ప్రశ్నాపత్రంతో ఇటువంటి వారికి అయిదు శాతం మార్కులు కూడా పడవు. నిజానికి పతంజలి యోగ సూత్రాలను అర్థం చేసుకోగలిగితే యోగసాధనకు ఎంతటి క్రమశిక్షణ, శిక్షణ, సాధన అవసరమో తెలిసి వస్తుంది. ఆ త్రయం ఒక్క శరీరానికే కాదు.. మనసుకి కూడా వర్తిస్తుంది. దేహపరంగాను, మనసు పరంగాను శక్తిమంతులం అయితే తప్ప దేహాతీత, మానసాతీత సాధన సాధ్యం కాదు.. అసలు యోగం అంటేనే అతీత దేహ, అతీత మానస సాధన. అందుకే, నా ఉద్దేశంలో, పతంజలి యోగ సూత్రాల కంటే పై స్థాయిదే భగవద్గీత. అర్థం చేసుకోగలిగితే తప్ప గీత నుడివిన ‘కర్మయోగం’ ఎంతలా ఆత్మకారకమో విశదం కాదు.
అన్నట్టు, నీకో సీక్రెట్ చెప్పనా? చైతన్యా!
కురుక్షేత్రాన్ని లైవ్‌గా చూస్తూ సంజయుడు అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతున్నట్లుగా భగవద్గీత ఆరంభమవుతుంది. కళ్లు తెరిచిన వాడు సంజయుడు, కళ్లు మూసుకుపోయిన వాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ అంధుడు మోహబంధుడు.. దేహ బాధితుడు... ప్రాపంచిక వ్యామోహితుడు.. మానసిక బలహీనుడు.. ఇంద్రియ వశుడు. ఇలా మానవ వ్యక్తిత్వ, మనస్తత్వ ప్రతీక ధృతరాష్ట్రుడు. అటు సంజయుడిదీ. ఇటు ధృతరాష్ట్రుడిదీ మానవ ప్రకృతే అయినా ప్రవృత్తులు మాత్రం వేరువేరు. ఈ ప్రవృత్తి కారణంగానే సంజయుడు పరప్రజ్ఞాన్వితుడు కాగలిగాడు, ధృతరాష్ట్రుడు ఇహ సంపన్నుడిగానే మిగిలిపోయాడు.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946